దేవాపి మహర్షి బోధనలు - 35
🌹. దేవాపి మహర్షి బోధనలు - 35 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 26. జ్ఞానయోగము - కర్మయోగము - 1 🌻
సృష్టి ప్రణాళిక ననుసరించని జీవుడు సుఖమును కోల్పోవు చున్నాడు కాని ప్రయాణము మాత్రము సృష్టి ప్రణాళికననుసరించియే యుండును.
ప్రణాళికననుసరించు వారికి సృష్టి చక్రము నందు సమన్వయమేర్పడి కారణము లేని తృప్తి కల్గియుందురు. వారికి సర్వము యజ్ఞార్థకర్మయే కాని తమకు సంబంధించినదేదియు యుండదు. ప్రయాణమున సుఖముండును.
స్వభావము ననుసరించి లోకశ్రేయస్సు కోరి, ఫలాపేక్ష లేక కలవరపాటు లేక ఆచరించిన కర్మ వలన పరిపూర్ణ సిద్ధి కల్గును. ఫలాపేక్ష లేకపోయిననూ పనులయందు పట్టుదల సడల రాదు. ఇతరులు కూడ ఫలాపేక్ష లేక వర్తింపవలెనను బుద్ధి యుండరాదు. ప్రకృతి యందు పనులన్నియు గుణముల ప్రేరణచే కల్గునని గమనించి వ్యక్తులు కారణము కాదని తెలియవలెను.
ఇట్లు తెలియుట వలన తనపై కర్తృత్వము నారోపించుకొనుట, యితరుల యందు దోషములెన్నుట తప్పును. వ్యామోహమునందు చిక్కుబడుట కూడ తప్పును. కర్మాచరణమునందు ఒకరినొకరు చూచుకొనుటలో అంతర్యామి దర్శనము చేయవలెను. అట్లు చేయుటవలన శ్రద్ధ అలవడును. అసూయాదులు సోకవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
17 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment