భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 191


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 191 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 5 🌻


" అహం బ్రహ్మాస్మి"

719. "అహంబ్రహ్మాస్మి" జ్ఞానము, బ్రహ్మీభూతునకు జీవన్ముక్తునకు, సద్గురువునకు, అవతార పురుషునకు తరహాలుగా ఉండును.

1. బ్రహ్మీ భూతుడు:- అనంతముగా "నేను భగవంతుడను" అని ఉండును.

2. జీవన్ముక్తుడు:- " సమస్తము నాతో ఉన్నది"

3. సద్గురువు :- "సమస్తము నాది"

"సమస్తము నాలో ఉన్నది"

"సమస్తము నా నుండి ఉన్నది"

4. అవతారము :-"నేను భగవంతుడను" సర్వము ‌‌‌ "నేనే"

" నేను సమస్తమందున్నాను"

" సమస్తము నాలో ఉన్నది, నా

నుండి వచ్చుచున్నది."


720. | | కోశములు | అనుబంధ లోకములు | లోకానుభవము కలవారు |

|1. | అన్నమయకోశము | భౌతిక ప్రపంచము | సామాన్య మానవులు |

|2. | ప్రాణమయకోశము | సూక్ష్మ ప్రపంచము | యోగులు |

|3. | మనోమయకోశము | మానసిక ప్రపంచము | మహాపురుషులు, సత్పురుషులు |

|4. | ఆనందమయకోశము | సత్యలోకము | బ్రహ్మీభూతులు, జీవన్ముక్తులు, సలీక్‌లు |

|5. | విజ్ఞానమయకోశము | | సద్గురువులు, అవతార పురుషులు |


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


12 Mar 2021

No comments:

Post a Comment