🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 237 / Sri Lalitha Chaitanya Vijnanam - 237 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
🍀 58. చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ ।
మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా ॥ 58 ॥🍀
🌻237. 'మహాచతుషష్టి కోటి యోగినీ గణ సేవితా' 🌻
అరువది నాలుగు కోట్ల యోగినీ గణములచే సేవింపబడునది శ్రీలలితా దేవి అని అర్థము. 64 సంఖ్యను గూర్చి వివరించటమైనది. కోటి యోగినులు అనగా ఏడు లోకములు వ్యాపించియున్న ఆమె శక్తులు. ప్రధానముగ అమ్మ శక్తులు ఎనిమిది.
అందు వలననే అష్ట బాహువులు గల దుర్గగ ఆమెను భావింతురు. ప్రకృతి స్థానములు కూడ ఎనిమిదియే. అమ్మ శక్తులు దుర్గా, బ్రాహ్మీ, మహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, ఇంద్రాణీ, చాముండా. ఇట్టి ఎనిమిది యోగినీ శక్తులకు మరల ఎనిమిది ఉపశక్తులున్నవి. ఎనిమిది రెట్లు ఎనిమిది కనుక అరువది నాలుగు అయినవి.
అనగా ఎనిమిది ప్రకృతి స్థానములలో ఒక్కొక్క దానిలో మరల స్థూల సూక్ష్మములుగ ఎనిమిది తత్త్వము లుండును. ఈ అరువది నాలుగు యోగినీ శక్తులకు కోట్ల సంఖ్యల గుంపులు లేక సేనలు కలవు.
ఈ మొత్తము నన్నింటిని విశేషము చెప్పుటకు, చతుషష్టి అను పదమును మహా చతుషష్టి అని తెలుపుట జరిగినది. మహత్వమనగా తొమ్మిదింతలని అర్థము. మహా చతుషష్టి కోటి యోగినీ గణములు ఇచ్చట గ్రహించవలెను.
అనగా ఎనిమిది ముఖ్య శక్తులు, ఎనిమిది ప్రకృతి స్థానములలో అరువది నాలుగు కోట్లుగ ఆవరించి యుండగ అట్టి మొత్తము శక్తులు తొమ్మిదింతలై శ్రీ చక్రమందలి నవావర్ణముల యందు ఆవరించి యున్నారని భావము.
శ్రీ చక్రరాజము నందలి తొమ్మిదింటి యందు ప్రత్యేకముగ అరువది నాలుగు కోట్ల యోగినీ శక్తులు కలవు అని తంత్రము తెలుపుచున్నది. శ్రీ లలిత యోగశక్తి సర్వత్ర వ్యాపించి సర్వమును నిర్వర్తించు చున్నదని దీనివలన తెలియనగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 237 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mahā-catuḥ-ṣaṣti-koṭi-yoginī-gana-sevithā महा-चतुः-षष्ति-कोटि-योगिनी-गन-सेविथा (237) 🌻
Mahā-catuḥ-ṣaṣti-koṭi means sixty four crores or 640 million. Yoginī-gana are demigoddesses. She is worshipped by these 640 million demigoddesses also known as yogini-s. In Śrī Cakra, there are eight mātṛkā devi-s (also known as aṣḥta māta-s) like, Brāhmī, Māheśvarī, Kaumārī, Vaiśṇavī, Vārāhī, Indrāṇī, Cāmuṇdā, Mahālakśmī. The aṣḥta māta-s have eight deputies called as yogini-s which make sixty four yogini-s.
Each of these sixty four yogini-s has one crore or ten million attendant yogini-s. Thus the calculation of 640 million yogini-s is arrived. These yogini-s attend to different aspects of administration of the universe.
In Śrī Cakra there are nine āvaraṇa-s (coverings or roundabouts). Each āvaraṇa is controlled by a yogini. The ninth āvaraṇa is controlled byLalitāmbikā Herself. Taking into account the other eight āvaraṇa-s, It is said that each āvaraṇa has ten million yogini-s.
The number sixty four should have some significance. This numeric is used in three consecutive nāma-s 235, 236 and this nāma. It is possible that the numeric sixty four refers to sixty four tattva-s. The products of five basic elements like ether, etc combined with antakaraṇa (mind, intellect, consciousness and ego) making a total of sixty four. In fact, the entire human activities are controlled by these 64 tattva-s.
Please also refer nāma 230.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
17 Mar 2021
No comments:
Post a Comment