దేవాపి మహర్షి బోధనలు - 58


🌹. దేవాపి మహర్షి బోధనలు - 58 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 39. సాన్నిధ్యము 🌻


1. ఏ సాధకునికైనను ఏడు సంవత్సరములు ఒక చక్రముగ ఒక దీక్ష నడువవలెను. శ్రద్ధాభక్తులను బట్టి స్వీకరించిన దీక్ష ఏడు సంవత్సరములలో సాఫల్యమిచ్చును.

2 . ఒక సాధకుని శిష్యునిగ అంగీకరించుట అను అంశము సద్గురువు యొక్క ఇష్టా అయిష్టములను బట్టి యుండదు. సద్గురువునకు ఇష్టా అయిష్టములుండవు. ప్రవర్తనమున సాధకుడు చూపించు ఉత్తమ లక్షణములే వాని స్వీకారము నకు తోడ్పడును.

3. నీ సత్ప్రవర్తనము ద్వారా సద్గురు సాన్నిధ్యమును నీవు ఆవాహనము చేయగలవు. కొన్ని ధర్మ సూత్రములను ఏకాగ్రతతో పాటించినప్పుడు సద్గురువు నీవైపు ఆకర్షింప బడును.

4. ఏ సూత్రములను ఆధారముగ సద్గురువు నీకు సాన్నిధ్యము నిచ్చెనో ఆ సూత్రములను ఎన్నటికిని విడువరాదు. వాటిని మరచినచో సద్గురువు సాన్నిధ్యము నీకు తెలియకయే అదృశ్యమగును.

5. త్రికరణ శుద్ధి, నిష్కామ కర్మము, పరహితము ఇత్యాది గుణములు నీయందు శాశ్వతముగ నున్నచో సద్గురు వెల్లప్పుడు నీతో నుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


17 Mar 2021

No comments:

Post a Comment