వివేక చూడామణి - 47 / Viveka Chudamani - 47


🌹. వివేక చూడామణి - 47 / Viveka Chudamani - 47 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 15. మనస్సు - 1 🍀


168. ఈ మానసికమైన పొర అనేకమైన కోరికలతో నిండి పంచ జ్ఞానేంద్రియాలకు అనుగుణంగా నడుచుకుంటూ యజ్ఞయాగాదులతో ఈ భౌతిక ప్రపంచ సృష్టికి కారణమవుతుంది.

169. మనస్సుకు భయట ఏవిధమైన అజ్ఞానము లేదు. మనస్సే అజ్ఞానమునకు కారణము. ఇది బంధనాలకు మూలము. ఎపుడైతే మనోనాశమగుతుందో, అపుడు సాధన ద్వారా, క్రమశిక్షణ ద్వారా ఆత్మ సౌందర్యాన్ని స్థిర పర్చిన అదే విముక్తి అని చెప్పబడింది. నిర్వికల్ప సమాధి స్థితి అపుడు ఏర్పడుతుంది.

170. మనము కలలు కనేటపుడు, బాహ్య ప్రపంచముతో ఏవిధమైన సంబంధము ఉండదు. మనస్సే ఈ ప్రపంచ సృష్టికి కారణమవుతుంది. అనుభవము, అనుభవించేవాడు, అనుభవించబడేది అన్నీ ఒక్కటే. మెలుకువలో కూడా అదే స్థితి నెలకొని ఉంటుంది. అందువలన ఈ విశ్వమంతా మనస్సు యొక్క వ్యక్తీకరణమే.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 47 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj


🌻 The Mind - 1 🌻

168. The mental sheath is the (sacrificial) fire which, fed with the fuel of numerous desires by the five sense-organs which serve as priests, and set ablaze by the sense objects which act as the stream of oblations, brings about this phenomenal universe.

169. There is no Ignorance (Avidya) outside the mind. The mind alone is Avidya, the cause of the bondage of transmigration. When that is destroyed, all else is destroyed, and when it is manifested, everything else is manifested.

170. In dreams, when there is no actual contact with the external world, the mind alone creates the whole universe consisting of the experiencer etc. Similarly in the waking state also; there is no difference. Therefore all this (phenomenal universe) is the projection of the mind.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


17 Mar 2021

No comments:

Post a Comment