24-APRIL-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 190🌹  
2) 🌹. శివ మహా పురాణము - 390🌹 
3) 🌹 Light On The Path - 139🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -18🌹  
5) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 212🌹
6) 🌹 Osho Daily Meditations - 7 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 67 / Lalitha Sahasra Namavali - 67🌹 
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 67 / Sri Vishnu Sahasranama - 67🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -190 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 31

*🍀 31. ఏకాత్మ బుద్ధి - ఎవడు సమస్త భూతముల యందున్న నన్ను దర్శించి సేవించు చున్నాడో, సర్వత్ర అట్లే వర్తించుచున్నాడో, అట్టి యోగి నాయందే వసించును, వర్తించును. ఈ శ్లోకమున “ఏకత్వ మాస్థితః"అనునది ప్రధానము. సర్వ భూతముల యందు స్థితిగొన్న నన్ను భేదబుద్ధిలేక ఎవడు దర్శించి సేవించునో అట్టి యోగి నా యందే వర్తించు చున్నాడు, నాయందే వసించు చున్నాడు అని దైవము పలుకుటలో జీవులు చూపించు భేదబుద్ధిని హెచ్చరిక చేయుచున్నాడు. భేదబుద్ధి తొలగనిదే దైవము కనపడడు. భేదబుద్ధిని విసర్జించిన వానికే అందరియందున్న ఒకే దైవము కనిపించును. ఇది ముమ్మాటికి సత్యము. 🍀*

సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వ స్థితః |
సర్వథా వర్తమానో2పి స యోగీ మయి వర్తతే || 31 

ఎవడు సమస్త భూతముల యందున్న నన్ను దర్శించి సేవించు చున్నాడో, సర్వత్ర అట్లే వర్తించుచున్నాడో, అట్టి యోగి నాయందే వసించును, వర్తించును. ఈ శ్లోకమున “ఏకత్వ మాస్థితః"అనునది ప్రధానము. సర్వ భూతముల యందు స్థితిగొన్న నన్ను భేదబుద్ధిలేక ఎవడు దర్శించి సేవించునో అట్టి యోగి నాయందే వర్తించు చున్నాడు, నాయందే వసించు చున్నాడు అని దైవము పలుకుటలో జీవులు చూపించు భేదబుద్ధిని హెచ్చరిక చేయుచున్నాడు. 

చిన్నవాడని - పెద్దవాడని, ధనవంతుడని - పేదవాడని, అధికారియని - సేవకుడని, పాపియని- పుణ్యుడని, జ్ఞానియని - అజ్ఞానియని, ఉత్తముడని - అధముడని, స్వర్గమని - నరకమని భేదబుద్ది జీవులకున్నది గాని దైవమునకు లేదు. దైవమునది అభేద బుద్ధి. రామకృష్ణాదుల జీవితములలో ఈ అభేదబుద్ధిని దర్శించవచ్చును. భేదబుద్ధి తొలగనిదే దైవము కనపడడు. 

భేదబుద్ధిని విసర్జించిన వానికే అందరియందున్న ఒకే దైవము కనిపించును. మతభేదము కల వారెవ్వరును దైవమును చూచినవారు కాదు. ఇది ముమ్మాటికి సత్యము. మనకు యిష్టమైన వానియందు, యిష్టము కాని వానియందు కూడ దైవమున్నాడు. ఈ సత్యము నంగీకరించుకొలది దైవమునకు చేరువగుదుము. దర్శించినకొలది, అట్లే అభేద బుద్ధితో సేవించినకొలది దైవముతో యోగము సంభవించును. 

అట్టివాడు అన్ని వ్యవహారముల యందును దైవముతోనే వర్తించుచు, ఆనందము చెందుచు నుండును. అతడే నిజమగు యోగి. అభేద బుద్ధిని ఏకాత్మ బుద్ధి యందురు. ఒకే దైవమును అన్నిట భేదము లేక దర్శించుట ఏకాత్మబుద్ధి. అట్టి ఏకాత్మబుద్ధి కలవాడు ఏ మార్గమునందు వర్తించుచున్న వాడైనను, అతడు యోగస్థితి యందున్నట్లే. “సర్వధా వర్తమానోపి "అనుటలో అతడు వర్తించు మార్గమేదైనను తనకు సమ్మతమే అని అర్థము. 

భగవద్భక్తులలో ఉత్తమోత్తములైన వారు కుమ్మరులుగను, వడ్రంగులుగను, మాంసము నమ్ముకొను వారుగను, గోపాలకులుగను, గొట్టెల కాపరులుగను కూడ వర్తించిరి. దైవముతో కూడియున్న వానికి ప్రాపంచిక విలువలతో సంబంధము లేదు. ఇట్టివారు మహెన్నత శీలసంపత్తి కలవారు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 390🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 17

*🌻. ఇంద్ర మన్మథ సంవాదము - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ దేవతలు వెళ్లిపోగానే దురాత్ముడగు తారకాసురునిచే మిక్కలి పీడింపబడియున్న ఇంద్రుడు మన్మథుని స్మరించెను (1). వసంతునితో కూడి యుండువాడు, రవీదేవికి ప్రియుడు, గర్విష్ఠి, రతీదేవితో కూడియున్నవాడు, ముల్లోకములను జయించువాడు అగు కామప్రభుడు వెంటనే వచ్చెను (2). వత్సా! తరువాత మహోన్నతమగు మనస్సు గల మన్మథుడు ప్రణమిల్లి ఇంద్రుని ఎదుట అంజలి ఘటించి నిలబడి ఇంద్రునితో నిట్లనెను (3).

మన్మథుడిట్లు పలికెను-

నీకు కలిగిన ఏమి? నన్ను స్మరించుటకు కారణమేమి? ఓ దేవరాజా! విషయమును చెప్పుము. నీవు చెప్పు పనిని చేయుటకు వచ్చితిని (4).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ మన్మథుని ఆ మాటను విని దేవరాజగు ఇంద్రుడు 'బాగున్నది, బాగున్నది' అని స్తుతిస్తూ ప్రేమ పూర్వకముగా నిట్లు పలికెను (5).

ఇంద్రుడిట్లు పలికెను-

ఓ మన్మథా! నాకు పని కలుగగానే నీవు దానిని చేయుటకు సంసిద్ధుడవైతివి. నీ ఈ ఉద్యమశీలత కొనియాడదగినది.నీవు ధన్యుడవు (6). నేను ప్రస్తుతంలో నీ ఎదుట చెప్పబోవు పలుకుల నాలకించుము. నా కర్యము నీ కార్యమే గాని మరియొకటిగాదు (7). నాకు అనేక మంది గొప్ప గొప్ప మిత్రులు గలరు. మన్మథా ! కాని నీవంటి మంచి మిత్రుడు ఎక్కడనూ లేడు (8). కుమారా! నా విజయము కొరకై రెండు నిర్మింపడినవి. ఒకటి ఉత్తమమగు నా వజ్రము. రెండవది నీవు. వజ్రము నిష్ఫలము కావచ్చును. కాని నీవు ఎన్నడునూ నిర్వీర్యుడవు కావు (9).

ఏవడు హితమును చేగూర్చునో, వానికంటె అధిక ప్రీతిపాత్రుడు మరెవ్వరు ఉందురు? కావున, నీవు నామిత్రులలో శ్రేష్ఠుడవు. నా కార్యమును నీవు చేయదగుదువు (10). నాకు కాల ప్రభావముచే అసాధ్యమగు దుఃఖము సంప్రాప్తమైనది. దానిని నీవు తక్క మరియొకరు ఎవరైననూ దూరము చేయజాలరు (11). దుర్భిక్షము నెలకొన్నప్పుడు దాత యొక్క దాతృత్వము, యుద్ధమునందు శూరుని శౌర్యము, ఆపద వచ్చినపుడు మిత్రుని మైత్రి, భర్త అసమర్థుడయినప్పుడు కుల స్త్రీల పాతివ్రత్యము నిగ్గుతేలును (12). కష్టము వచ్చినపుడు వినయము, పరోక్షమునందు వ్యర్థము కాని మంచి స్నేహము నిగ్గుదేలును. వీటి పరీక్షకు మరో మార్గము లేదు. నేను సత్యమును పలికితిని (13)

ఓ మిత్రశ్రేష్ఠా! నాకు ఆపద వచ్చినది. దానిని ఇతరులెవ్వరూ వారించలేరు. ఈనాడు ఇది నీకు పరీక్షకాగలదు (14). ఈ పని కేవలము నా వ్యక్తిగత కార్యము కాదు. దీనియందు దేవతలు, ఇతరులు అందరి క్షేమము ఇమిడియున్నది. దీనిలో సందియము లేదు (15).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 138 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 21. Look for the flower to bloom in the silence that follows the storm: not till then - 4 🌻*

523. We come now to the Master Hilarion’s note on Rule 21. 

*🍁 524. The opening of the bloom is the glorious moment when perception awakes; with it comes confidence, knowledge, certainty. The pause of the soul is the moment of wonder, and the next moment of satisfaction – that is the silence. 🍁*

525. The opening of the bloom is a gradual process. Even while the bud is still tightly shut it is slowly swelling under the influence of the sun and rain and the manifold influences that play upon it. The actual bursting of the bud is comparatively sudden, but the growth is continuous. 

The growth has been progressing before that; it will go on after. To take another analogy: the growth of the chicken has been taking place inside the egg before, and it continues after, the breaking of the shell; there is a particular point when the shell is broken that is for us the dramatic moment, though it is really only part of a steady growth. It is the same with the growth of the soul.

526. This passage refers also to a particular stage in the disciple’s life. It describes the feelings of the man when the first great truth of Initiation is put before him. People are apt to think that the things that will be taught at Initiation are many and various. I violate no pledge in saying that the great truths are not all given at the same time. 

At each stage one single fact is communicated – a fact that changes the face of the earth for the man, in the same way that the knowledge of reincarnation and karma has changed our lives. One would expect that, having a new fact put before him, it would be necessary for the Initiate to grow into it and prove it. It is not so. The moment the man has the truth he recognizes it at once as true: he needs no proof. 

Then comes the moment of wonder; he marvels at the beauty and perfection of it. Only later does he see that this is not everything. Later vision brings more into view, but for the moment it is perfection. He wonders also that what is so obvious has escaped his notice before. Then comes the moment of satisfaction that is the silence. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #TheosophyJoin and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 18 🌹*
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. నక్షత్రములు - తారలు 🌻*

గ్రహములు, నక్షత్రములు , తారా గణములు వేరు వేరు. తారలనగా చుక్కలుగా కనిపించుచున్న సౌరకుటుంబములు.  

నక్షత్రములనగా తిరుగుచున్న చక్రగతి యందు ఏర్పడిన సమవిభాగములు.  

ప్రస్తుతము 27 సమభాగములు మాత్రమే నక్షత్రములు అనబడుతున్నవి. కొందరు నక్షత్రములనగా తారలనుకొందురు. ఇది సరికాదు.

భాగవతము 4-290, ధ్రువోపాఖ్యానము
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్‌ఇకెసందేశములు
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 7 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 LAUGHTER 🍀*

*🕉 Why wait for reasons to laugh? Life as it is should be reason enough to laugh. It is so absurd, it is so ridiculous. It is so beautiful,so wonderful! It is all sorts of things together. It is a great cosmic joke. 🕉*

Laughter is the easiest thing in the world if you allow it, but it has become hard. People laugh very rarely, and even when they laugh it is not true. People laugh as if they are obliging somebody, as if they are fulfilling a certain duty. 

Laughter is fun. You are not obliging anybody! You should not laugh to make somebody else happy, because if you are not happy, you cannot make anybody else happy. You should simply laugh of your own accord, without waiting for reasons to laugh.

If you start looking into thing$, you will not be able to stop laughing. Everything is simply perfect for laughter-nothing is lacking-but we won't allow it. 

We are very miserly ... miserly about laughter, about love, about life. Once you know that miserliness can be dropped, you move into a different dimension. Laughter is the real religion. Everything else is just metaphysics.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 212 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుడు - 2 🌻*
చివరిభాగము.

775. యదార్ధ మేమనగా:-
 
సత్యమును అనుభవింప వలెను. భగవంతుని దివ్యత్వమును పొందవలెను. దివ్యత్వములో బ్రతుకవలెను. ఇదియే సత్యధర్మము.

1. "భగవంతుడు:- ప్రతిచోట నుండి సమస్తమును చేయుచున్నాడు. 

2. భగవంతుడు:- మనలో నుండి సమస్తమును తెలిసి కొనుచున్నాడు.

3. భగవంతుడు:- మనకు వెలుపల నుండి సర్వమును చూచూచున్నాడు.

4. భగవంతుడు:- మనకు ఆవల నుండి సర్వము తానై యున్నాడు."

----మెహెర్ బాబా

సమాప్తం...🙏. జై మెహర్‌ బాబా. 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
🌹 Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా 🌹
www.facebook.com/groups/avataarmeherbaba/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 67 / Sri Lalita Sahasranamavali - Meaning - 67 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. 67. ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ ।*
*నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ॥ 67 ॥ 🍀*

🍀 285. ఆ బ్రహ్మకీటజననీ - 
బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి.

🍀 286. వర్ణాశ్రమ విధాయినీ -
 వర్ణములను, ఆశ్రమములను ఏర్పాటు చేయునది.

🍀 287. నిజాజ్ఞారూపనిగమా - 
తనయొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినది.

🍀 288. పుణ్యాపుణ్యఫలప్రదా -
 మంచిపనులకు, చెడ్డపనులను వాటి వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 67 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 67. ābrahma-kīṭa-jananī varṇāśrama-vidhāyinī |*
*nijājñārūpa-nigamā puṇyāpuṇya-phalapradā || 67 || 🌻*

🌻 285 ) Aabrahma keeda janani -   
She has created all beings from worm to Lord Brahma

🌻 286 ) Varnashrama vidhayini -   
She who created the four fold division of society

🌻 287 ) Nijangna roopa nigama -   
She who gave orders which are based on Vedas

🌻 288 ) Punyapunya phala pradha -   
She who gives compensation for sins and good deeds.

Continues..
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 67 / Sri Vishnu Sahasra Namavali - 67 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*అనూరాధ నక్షత్ర తృతీయ పాద శ్లోకం*

*🌻 67. ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః |*
*భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః ‖ 67 ‖ 🌻*

 🍀 624) ఉదీర్ణ: - 
సర్వ జీవుల కంటెను ఉత్క్రష్టుడు.

🍀 625) సర్వతశ్చక్షు: - 
అంతటను నేత్రములు గలవాడు.

🍀 626) అనీశ: - 
తనకు ప్రభువు గాని, నియామకుడు గాని లేనివాడు.

🍀 627) శాశ్వతస్థిర: - 
శాశ్వతుడు స్థిరుడు.

🍀 628) భూశయ: - 
భూమిపై శయనించువాడు.

🍀 629) భూషణ: - 
తానే ఆభరణము, అలంకారము అయినవాడు.

🍀 630) భూతి: - 
సర్వ ఐశ్వర్యములకు నిలయమైనవాడు.

🍀 631) విశోక: - 
శోకము లేనివాడు.

🍀 632) శోకనాశన: - 
భక్తుల శోకములను నశింపచేయువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 67 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Anuradha 3rd Padam*

*🌻 67. udīrṇaḥ sarvataścakṣuranīśaḥ śāśvatasthiraḥ |
bhūśayō bhūṣaṇō bhūtirviśōkaḥ śōkanāśanaḥ || 67 || 🌻*

🌻 624. Udīrṇaḥ: 
He who is superior to all beings.

🌻 625. Sarvataḥ-cakṣuḥ: 
One who, being of the nature of pure consciousness, can see everthing in all directions.

🌻 626. Anīśaḥ: 
One who cannot have anyone to lord over him.

🌻 627. Śāśvata-sthiraḥ: 
One, who though eternal is also unchanging.

🌻 628. Bhūśayaḥ: 
One who, while seeking the means to cross over to Lanka, had to sleep on the ground of the sea-beach.

🌻 629. Bhūṣaṇaḥ: 
One who adorned the earth by manifesting as various incarnations.

🌻 630. Bhūtiḥ: 
One who is the abode or the essence of everthing, or is the source of all glorious manifestations.

🌻 631. Viśōkaḥ: One who, being of the nature of bliss, is free from all sorrow.

🌻 632. Śōkanāśanaḥ: 
One who effaces the sorrows of devotees even by mere remembrance.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment