శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 248 / Sri Lalitha Chaitanya Vijnanam - 248


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 248 / Sri Lalitha Chaitanya Vijnanam - 248 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

🍀 60. చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా ।
పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా ॥ 60 ॥ 🍀

🌻 248. 'పద్మరాగ సమప్రభా' 🌻

పద్మరాగ మణితో సమాన మగు దేహకాంతి గలది శ్రీమాత అని అర్థము. పద్మరాగమణి కాంతి ఎఱుపు పసిడి కాంతి. పచ్చని పసిమికన్న ఎఱుపు పసిమి చాల ఆకర్షణీయమైన వర్ణము. గులాబీ రేకులవలె భాసించు కాంతి. శ్రీమాత నైజము నీలము. నీలము శుద్ధ జ్ఞానమునకు సంకేతము. పరమ ప్రేమకు కూడ సంకేతము. ఆమె నుండి ప్రకటింప బడు కాంతియందు ఎఱుపు, పసుపు సరిసమానముగ మిళితమై నున్నవి.

ఇందు ఎఱుపు ఇచ్ఛాశక్తికి సంకేతము. పసుపు క్రియాశక్తికి సంకేతము. ఆమె సహజముగ జ్ఞానశక్తి, జ్ఞాన స్వరూపిణి యగు శ్రీమాత ఇచ్ఛా క్రియా శక్తులద్వారా సర్వసృష్టిని నిర్వహించు చున్నది. ఆమె పద్మరాగ ప్రభలతో విరాజిల్లుచు నుండును. ఇచ్ఛా క్రియాశక్తులను బడయ గోరువారు ఈ నామమును నిరంతరము స్మరణము చేసుకొనవచ్చును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 248 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Padmarāga-sama-prabhā पद्मराग-सम-प्रभा (248) 🌻

She is compared to a special type of ruby called padmarāga which is deep red in colour. Or this could also mean that She is like a red lotus. Padma means lotus, rāga means red and prabhā means light, splendour, radiance, beautiful appearance; lights variously personified.

The deeper meaning of this nāma is the description of Her subtlest kuṇḍalinī form. Kuṇḍalinī is deep red in colour at the base of the spine. When She ascends, the brightness of the red gradually decreases and at sahasrāra when She conjoins with Śiva, She almost becomes colourless. In sahasrāra, the practitioner will be in absolute bliss.

With nāma 248 the discussion on Her saguṇa Brahman (with forms and attributes) form is concluded and the discussion on Her five great acts begin from nāma 249. The Brahman has five acts to do.

One is the creation of the universe, second is its sustenance, the third is dissolution or death of individual lives, the fourth is called tirodhāna known as annihilation or total disappearance of the universe and the fifth is called anugraha the act of re-creation facilitated by incantations.. The nāma-s from 249 to 340 discuss on the ‘Pañca -Brahma svarūpa’ known as the five acts of the Brahman.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


07 Apr 2021

No comments:

Post a Comment