అహాన్ని పరిత్యజించటమే నిజమైన పరిత్యాగం.
🌹. అహాన్ని పరిత్యజించటమే నిజమైన పరిత్యాగం. 🌹
🍀. ఓషో వాణి. 🍀
📚. ప్రసాద్ భరద్వాజ
ఒకప్పుడు ఓ ఆశ్రమవాసి నాతో అన్నాడు దైవం కోసం నేను సర్వస్వాన్నీ పరిత్యజించాను. ఇపుడు నా వద్ద ఏమీ లేవు. అని. నిజంగానే ఆయన వద్ద ఏమీ లేవన్న విషయాన్ని నేనూ చూస్తున్నాను. ఐనా పరిత్యజించాల్సిన మరొకటి ఆయనలో ఇంకా మిగిలే ఉందనీ నిజంగా పరిత్యజించాల్సినది దాన్నొక్కటేననీ ఆయనతో అన్నాను.
ఆయన తన చుట్టూ చూసుకున్నాడు. ఆయన వద్ద నిజంగానే బాహ్యంలో ఏమీ లేవు. ఆయన వద్దనున్న వస్తువు ఆయన అంతరంగంలోనే ఉంది. అది ఆయన చేసిన పరిత్యాగంలో ఉంది. అది ఆయన కళ్ళలో ఉంది. అది ఆయన సన్యాసంలో ఉంది. అదే ఆయనకున్న నేను. ఆ అహాన్ని పరిత్యజించటమే అసలైన పరిత్యాగం.
తక్కిన వాటిన్నిటినీ లాగేసుకోవటం సాథ్యమే కనుక మృత్వువు సర్వస్వాన్నీ లాక్కెళ్ళి పోతుంది.ఈ అహాన్ని మాత్రమే ఎవ్వరూ లాక్కెళ్ళలేరు. ఆఖరుకి మృత్యువుకు కూడా దాన్ని లాక్కోవటం అసాథ్యం. దాన్నికేవలం వదిలి పెట్టవచ్చు. దాన్ని కేవలం పరిత్యజించ వచ్చు. ఎవరూ లాక్కోలేని దానిని పరిత్యజించటమే నిజమైన పరిత్యాగం.
'నేను' మాత్రమే ఏకైక ప్రపంచం. ఆ 'నేను'ను వదిలి పెడ్తున్నవాడే ఏదీ లేని వాడు. ఓ సన్యాసి 'నేను' అన్నదే ప్రపంచం. నేను'లేకపోవడమే సన్యాసం. ఆ 'నేను'ను అర్పించి వేయటమే నిజమైన ఆథ్యాత్మిక పరిభ్రమణం.పరివర్తనం.
ఎందుకంటే ఆ 'నేను' ఖాళీ అయిపోయిన ఆవరణపు శూన్యంలోకే నాది కాని నేను కాని సర్వస్వానికీ స్వంత మయిన 'నేను' ప్రవేశిస్తుంది.
'నేను' అని తన గురించి ఉచ్ఛ రించే హక్కు ఉన్నది దేవునికి మాత్రమే. నిజంగా సృష్టి కి కేంద్రంగా ఉన్న ఒక్కడికే 'నేను' అనే మాటను అనే హక్కు ఉంటుంది. కానీ అతనికి 'నేను' అనాల్సిన అవసరమే ఉండదు. అన్నీ సర్వస్వమూ ఆయనకు 'నేనే' కనుక. హక్కు ఉన్న వాడికి ఆ మాటను అనాల్సిన అవసరమే ఉండదు. ఆ మాటను అనాల్సిన అవసరం ఉన్న వాడికి ఆ హక్కే ఉండదు.
మానవుడి వద్ద నేను, తప్ప 'అహం' తప్ప దైవానికి సమర్పింపదగ్గది మరేదీ లేదు. తక్కిన పరిత్యాగాలన్నీ భ్రమలు మాత్రమే. ఆపరిత్యజింపబడిన విషయాలు నిజంగా ఏనాడూ అతడి స్వంతంగావు గనుక. పైగా తక్కిన పరిత్యాగాలన్నీ మానవుడి అహాన్ని మరింత పెంచి ఘనీభవింప చేస్తాయి కూడా.
ఒకడు తన ప్రాణాన్ని అర్పించినా అతడి 'నేను' కేంద్రం లోంచి అది ఓ అర్పణ కానే కాదు. 'నేను'ను అర్పించడం తప్ప తక్కిన అర్పణలన్నీ కానే కావు. 'నేను' మాత్రమే నిజమైన స్వార్జితం ఆస్తి. ఈ అహం మరణంలోంచీ పయనించని మానవుడు దివ్యత్వప్రాప్తి సాఫల్యాన్ని అందుకోలేని వాడు గానే ఉండి పోతాడు.
ఈ కుప్పలోంచి ఆవిర్భవించే సత్యభ్రమే అజ్ఞానం. కానీ సత్యం కోసం ఈ రాశిలోనే వెదుకుతున్న మానవుడికి ఆ భ్రమ ధ్వంసమై 'నేను' అనే పూదండలోని పువ్వులన్నీ చెల్లా చెదురుగా రాలి పోతాయి. అప్పుడు ఆ మథ్యలో నిజంగా ఉన్న దారం పువ్వు లతో అప్పటి వరకూ కప్పబడి ఉన్న ఆథారం అనే సత్యం కనిపిస్తుంది. ప్రాప్తిస్తుంది.
ఆ పువ్వులన్నిటినీ తొలగించిన తరువాత ఆ పూదండకు ఆధారంగా ఉన్న దారం నాకు మాత్రమే ఆథారంగా ఉండక అన్నింట్లోనూ అందరిలోనూ ఆథారంగా ఉందనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. నాలో ఉన్నట్లు గానే సృష్టి మొత్తం లోనూ అది ఉండి అంతర్లీనంగా వ్యాపించి ఉందనే విషయం అర్థం అవుతుంది.
కానీ ఆ 'హక్కు లేని స్థితిని' వదిలి పెట్టి ఆ హక్కును సాథించుకోవచ్చు.'నేను'గా తయారవడాన్ని విడిచి నపుడే మానవుడు నిజమైన 'నేను' కాగలడు.తన కేంద్రం లోని భ్రమను విడిచి పెట్టి మానవుడు నిజమైన కేంద్రాన్ని ప్రాప్తించుకోవచ్చు. ఏ క్షణంలో తన కేంద్రాన్ని కరిగించు కుంటాడో తక్షణమే మానవుడు నిజమైన కేంద్రాన్ని సంప్రాప్తించు కుంటాడు. మానవుడి నేను నిజం కాదు. అనేక విషయాల సంయోగమే అది. దానికంటూ ప్రత్యేక మైన ఉనికి లేదు. అనేక అంశాల సమ్మిశ్రమమే అది.
ఈ అహంకారపు మరణమే దివ్యత్వం నుండి దూరపు సత్యం నుండి దూరపు సృష్టి నుండి దూరపు మననుండీ మనకే ఉన్న దూరపు మరణం.భౌతిక కాయపు మరణాని కన్నా ముందే ఈ మరణాన్ని పొందిన వాడే ధన్యుడు.
ఇంకా వుంది ...
🌹 🌹 🌹 🌹 🌹
07 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment