వివేక చూడామణి - 57 / Viveka Chudamani - 57
🌹. వివేక చూడామణి - 57 / Viveka Chudamani - 57🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 17. విముక్తి - 4 🍀
204. మురుగు నీటిలోని మురుగును తొలగించినపుడు ఆ నీరు స్వచ్ఛమవుతుంది. అలానే ఆత్మ చుట్టూ ఆవరించి ఉన్న అడ్డంకులు తొలగించినపుడు, ఆత్మ ప్రస్ఫుటమవుతుంది.
205. ఎపుడైతే అసత్యమైన అడ్డంకులు తొలగిపోతాయో, అపుడు వ్యక్తి యొక్క ఆత్మ తప్పని సరిగా పరమాత్మను తెలుసుకుంటుంది. అందువలన ప్రతి వ్యక్తి గుర్తించుకోవాలి, తన ఆత్మ చుట్టూ ఆవరించి ఉన్న బుద్ధి, అహం మొదలగు అడ్డంకులను తొలగించుకోవాలని.
206. మనం చెప్పుకొనే విజ్ఞానమయకోశమనే పొర ఎప్పటికి ఆత్మ కాదు. ఎందువలనంటే అది ఎల్లప్పుడు మారుతుంటుంది. అది పరిమితమైనది. అది గుణములతో, అజ్ఞానముతో కూడి ఉన్నది. అది ఎల్లప్పుడు ఉండేది కాదు. అసత్యమైన విషయాలు సత్యమైన ఆత్మతో పోల్చరాదు.
207. ఆనందమయ కోశము అసత్యమైన మార్పులతో కూడి, ఆత్మిక భావమును ప్రతిబింబిస్తుంది. దాని ప్రభావము వలన సుఖాను భూతులను పొందుచున్నది. సుషుప్తిలో ఆనందము, విశ్రాంతి పొంది, అది ఆనందమయ కోశముగా చెప్పబడినది. కాని అది ఆత్మ స్థితి కాదు. ఆనందమయ కోశములో ఆనందముతో కూడి అది మనము కోరకుండానే వివిధ పనుల ఫలితముగా చేకూరుతుంది. ప్రతి జీవి అలాంటి ఆనందమును ఎట్టి ప్రయత్నము లేకుండానే పొందుట జరుగుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 57 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 Liberation - 4 🌻
204. Just as the water which is very muddy again appears as transparent water when the mud is removed, so the Atman also manifests Its undimmed lustre when the taint has been removed.
205. When the unreal ceases to exist, this very individual soul is definitely realised as the eternal Self. Therefore one must make it a point completely to remove things like egoism from the eternal Self.
206. This knowledge sheath (Vijnanamaya Kosha) that we have been speaking of, cannot be the Supreme Self for the following reasons - because it is subject to change, is insentient, is a limited thing, an object of the senses, and is not constantly present: An unreal thing cannot indeed be taken for the real Atman.
207. The blissful sheath (Anandamaya Kosha) is that modification of Nescience which manifests itself catching a reflection of the Atman which is Bliss Absolute; whose
attributes are pleasure and the rest; and which appears in view when some object agreeable to oneself presents itself. It makes itself spontaneously felt by the fortunate during the fruition of their virtuous deeds; from which every corporeal being derives great joy without the least effort.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
07 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment