శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 249 / Sri Lalitha Chaitanya Vijnanam - 249


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 249 / Sri Lalitha Chaitanya Vijnanam - 249 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 61. పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।
చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥ 🍀

🌻 249. 'పంచప్రేతాసనాసీనా' 🌻

పంచప్రేతముల యందు ఆసీనురాలై యున్నది. శ్రీమాత అని అర్థము. సృష్టికి ప్రధానమైన తత్త్వములు ఐదుగ ఋషులు గుర్తించిరి. ఈ ఐదింటి యందును శ్రీమాత ఆసీనురాలై యుండుట చేత అవి శక్తివంత మగుచున్నవి. అట్లు శ్రీమాత ఆసీనురాలు కానిచో అవి కేవలము ప్రేతములే.

ప్రేతము లనగా నిర్జీవములు. తమకు తాముగ కదలనైన కదలలేవు. ఎట్టి ప్రభావమును చూపలేవు. పంచభూతముల యందు శక్తి శ్రీమాతయే. పంచాంగములతో కూడిన శరీర మందలి శక్తి శ్రీమాతయే. పంచ తన్మాత్రల ప్రభావము శ్రీమాతయే. పంచ ప్రాణముల యందలి శక్తి శ్రీమాతయే. ఇట్లు పంచ తంత్రముల యందు శ్రీమాత శక్తియే విరాజిల్లుచున్నది.

పై విధముగనే ప్రధాన పంచతత్త్వములగు అగ్ని, పదార్థము, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వీరి యందు కూడ శ్రీమాత అస్తిత్వమే. వారి వారికి ఆయా ప్రభావములు కలిగించు చున్నది. ఎంత గొప్ప విద్యుత్ పరికరమైనను, విద్యుత్ శక్తి ప్రసరించ నపుడు పని చేయలేదు కదా! అట్లే త్రిమూర్తులు, ప్రకృతి, అగ్ని కూడ శ్రీమాత యను విద్యుత్ శక్తి చేత నడిపింప బడుచున్నారు. ఆమె లేని వారు లేరు. సమస్తము నందు జీవము, శక్తి ఆమెయే.

శ్రీమాతయే ఉద్భవించనిచో పరతత్త్వము సృష్టి నిర్మాణమే చేయలేదు. నిద్రించుచున్న సృష్టికి మేలుకొలుపు శ్రీమాతయే. మనము నిద్ర నుండి మేల్కాంచుటకు కూడ శ్రీమాతయే కారణము. ఆమె అనుగ్రహించనిచో మేల్కాంచుటయే యుండదు, కదలిక లుండవు, ప్రాణము లుండవు, ప్రాణ స్పందన ముండదు. సాధారణముగ మరణించినపుడు జీవుడు ప్రేతమగును. యాతనా శరీరమున అవశుడై యుండును. ప్రేతము అవశత్వమునకు పరాకాష్ఠ. ఇది భరింపరాని ఒక అవస్థితి.

బ్రహ్మాదులకైనను అట్టి అవస్థితి కలుగ గలదు. కానీ కలుగదు. కారణము వారు శ్రీమాత శాశ్వత అనుగ్రహ పాత్రులు. అనుగ్రహము శ్రీమాత కృపయే కదా! అందువలన శ్రీమాత వారి యందు ఆసీనురాలు కానిచో వారు కూడా అవశులే అని హయగ్రీవుడు, అగస్త్యునకు బోధించుచున్నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 249 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Pañca-pretāsanāsīnā पञ्च-प्रेतासनासीना (249) 🌻


She is sitting on a throne held by five corpses. These five corpses are Brahma, Viṣṇu, Rudra, Mahādeva and Sadāśiva. Brahma looks after creation, Viṣṇu looks after sustenance, Rudra causes death, Mahādeva conceals the dissolved universe (tirodhāna) and Sadāśiva again re-creates the universe (anugraha). It is said that these five Lords cannot function without their Śaktī-s or consorts.

Commentators refer to the consorts of these five Gods and without them it is said that these Gods cannot perform their duties. When they are in inert condition, they are referred as corpses. Śaktī-s here should mean the various manifestations of Lalitāmbikā. Vāc Devi-s surely would not have meant to refer other gods and goddesses in this Sahasranāma.

Saundarya Laharī (verse 1) speaks about this. “Śiva becomes capable of creating the universe, only when united with Śaktī, but otherwise, He is incapable of even a stir. How then could one, who has not acquired merit (puṇya) worship you at least praise you, who is adored even by Viṣṇu, Śiva, Brahma, and others.”

The nāma means that acts of these Gods cannot be carried out without Her authority. Please also read the note at the end of the next nāma.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


09 Apr 2021

No comments:

Post a Comment