దేవాపి మహర్షి బోధనలు - 69


🌹. దేవాపి మహర్షి బోధనలు - 69 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 50. దేవాపి మహర్షి 🌻


నీరు పల్లమెరుగు నిండుగ వున్న తటాకము నుండి క్రిందుగ వున్న ప్రదేశము నకు నీరుపారి వాటిని నింపును. రెండిటి యొక్క సమతలము ఒకటి యగు వరకు నీరు పల్లమునకు పారును. అట్లే ఉన్ముఖుడగు శిష్యుని లోనికి గురువు మేధస్సు ప్రవహించును. వారిద్దరి మధ్య కల

అనుబంధముచేత అది సాధ్యపడును. అదే విధముగ ఉన్ముఖులైనచో భార్యాభర్తల నడుమ కూడ అట్టి చైతన్య ప్రభావము నిర్వర్తింపబడి ఇద్దరునూ సమానమగు చైతన్య స్ఫూర్తి కలవారగుదురు.

గురువు నుండి శిష్యునకు ఈ ప్రవాహము నిర్వర్తింప బడుటకు శిష్యునికి ఉన్ముఖత్వముతో పాటు సంస్కారము ముఖ్యము. సంస్కారము సరిగా లేనిచోట చైతన్య ప్రవాహమున కడ్డంకు లేర్పడును. ఈ అడ్డంకు లెక్కువగ శిష్యుని మనో వికార రూపమున నుండును. దేహము చేత కూడ ప్రవాహమునందుకొనలేని దుస్థితి యందుండవచ్చును. ఇందు మొదటిది శిష్యుడి జన్మల నుండి తానుగ తెచ్చుకొనుచున్నది.

రెండవది తను జన్మించిన వంశము తల్లి తండ్రులకు సంబంధించినది. ఈ రెండిటిని సంస్కరించు కొనుట శిష్యుని వంతు. చైతన్య ప్రవాహము నిర్వర్తించుట మా వంతు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


09 Apr 2021

No comments:

Post a Comment