వివేక చూడామణి - 58 / Viveka Chudamani - 58
🌹. వివేక చూడామణి - 58 / Viveka Chudamani - 58 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 17. విముక్తి - 5 🍀
208. గాఢ నిద్రలో ఆనందమయ కోశము తన యొక్క పూర్తి ఎఱుకలో ఉంటుంది. కలలో మరియు ఎఱుక స్థితిలో అది సందర్భాను సారముగా జ్ఞానేంద్రియాల ప్రభావముతో ఎఱుక స్థితిలోనూ, కలలో జ్ఞాపకాల ప్రభావముతోనూ ఉంటుంది.
209. ఈ ఆనందమయ కోశము పరమాత్మ కాదు. అది మార్పులతో కూడి ఉన్నది. ప్రకృతి అనుసరించి గతములో చేసిన మంచి పనుల ఫలితముగా అది ఏర్పడుతుంది. దానికి ఇతర కోశముల ప్రభావము కూడా జత పడుతుంది.
210. ఎపుడైతే పంచకోశముల ప్రభావము; అది కాదు, అది కాదు అనే విచారణలో తొలగిపోతుందో, చివరకు మిగిలేది ఏదైతే ఉందో దాన్ని దర్శించిన అదే అనంత జ్ఞానముతో కూడిన ఆత్మ.
211. ఈ స్వయం ప్రకాశమైన ఆత్మ, తనకు తాను పంచకోశములతో అతీతమై, స్థూల, సూక్ష్మ కారణ శరీరములను దర్శిస్తూ సాక్షిగా ఉండి నిజమైన, మార్పు లేని స్థితిలో నిరంతరానందమును పొందుతూ ఉంటుంది. జ్ఞాని అదే తన ఆత్మ అని గ్రహించును.
212. శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు:- ఈ ఐదు కోశములు విచారణ ద్వారా అసత్యములని తెలుసుకొని వాటిని తొలగించుకొన్నప్పుడు, నాకేమి గోచరించటలేదు. అందువలన గురువు గారు, ఈ విశ్వములో అంతా శూన్యము ఏమి కనిపించుటలేదు మరి అపుడు మిగిలింది ఏది? జ్ఞాని తన ఆత్మను ఎలా తెలుసుకొనగలడు?
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 58 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 Liberation - 5 🌻
208. The blissful sheath has its fullest play during profound sleep, while in the dreaming and wakeful states it has only a partial manifestation, occasioned by the sight of agreeable objects and so forth.
209. Nor is the blissful sheath the Supreme Self, because it is endowed with the changeful attributes, is a modification of the Prakriti, is the effect of past good deeds, and imbedded in the other sheaths which are modifications.
210. When all the five sheaths have been eliminated by the reasoning on Shruti passages, what remains as the culminating point of the process, is the Witness, the Knowledge Absolute – the Atman.
211. This self-effulgent Atman which is distinct from the five sheaths, the Witness of the three states, the Real, the Changeless, the Untainted, the everlasting Bliss – is to be realised by the wise man as his own Self.
212. The disciple questioned: After these five sheaths have been eliminated as unreal, I find nothing, O Master, in this universe but a Void, the absence of everything. What entity is there left forsooth with which the wise knower of the Self should realise his identity.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
09 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment