శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 258 / Sri Lalitha Chaitanya Vijnanam - 258
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 258 / Sri Lalitha Chaitanya Vijnanam - 258 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 62. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా ।
విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా ॥ 62 ॥ 🍀
🌻258. 'స్వపంతీ ' 🌻
స్వప్నము, సూక్ష్మలోక తెలివి, నిద్ర మేలుకొనిన స్థితి, అజ్ఞానము నుండి మేలుకొనిన స్థితి అను నాలుగు అవస్థలకు అతీతముగ వుండు నది శ్రీమాత అని అర్థము. అవస్థలన్నియూ సృష్టి జీవులకే. త్రిగుణములకు లోబడిన వారికే. శ్రీమాత కిట్టి అవస్థలు లేవు. జీవుని అవస్థలు ప్రధానముగ చతుర్విధములని తెలుపుదురు. అందు మొదటిది నిద్ర. రెండవది స్వప్నము. మూడవది మెళకువ. నాలుగవది అజ్ఞానము నుండి మెళకువ.
ఈ నాలుగు స్థితుల కన్న పైన నుండునది శ్రీమాత.
1. నిద్రయందు బాహ్యలోకము లేదు. అంతర్లోకము లేదు. జీవునకు ఉండుటయే గాని తానున్నాడని కూడ తెలియదు. దీనిని సుప్తి అందురు. ఇట్టి సు స్థితి కలిగించునది శ్రీమాత గనుక సుప్తా అందురు.
2. స్వప్నమున జీవుడు మేల్కాంచిననూ అవశుడై యుండును. అది నిద్ర కాదు; మెళకువ కాదు. పూర్ణ జ్ఞానము కాదు. ఏవేవో దృశ్యములు వచ్చి పోవుచుండును.
జీవునకు స్వాధీన ముండదు. బాహ్యమున మేల్కాంచినపుడుండు లేశమాత్రపు స్వాధీనము కూడ యుండదు. దుస్వప్నములు, సుస్వప్నములు తమకు తాముగా వచ్చి పోవు చుండును. మేల్కాంచిననూ ఏమియూ చేయలేని స్థితియే. వృక్షము లిట్లే యుండును.
స్వప్నమునందు ఇంద్రియములు కార్యములు చేయకున్నను చేసినట్లు భ్రమ కలుగును. మనసు ప్రాపంచిక అనుభవమును పొందుచుండును. ఇట్లు శరీరము, ఇంద్రియములు పనిచేయక మనసు అవశమై తెగిన గాలిపటము వలె సన్నివేశముల యందు పాల్గొనుట స్వప్నము. స్వప్నానుభూతి ప్రతి మానవునకును అప్పుడప్పుడు కలుగు అవస్థ. ఇది కలిగించునది శ్రీదేవియే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 258 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻Svapantī स्वपन्ती (258) 🌻
She exists in dream state too. [During dream state, REM (Rapid Eye Movement) continues to exist but at lower intensity.] The knowledge gained through external objects is transmitted to mind, causing impressions in the mind. But during dream state, these impressions manifest subconsciously as dreams.
Dream is nothing but the contemplation of the mind that could not be executed, in not only this birth, but also the previous births. Dream is the store house of thoughts, accumulated over a period of time. In this state, there is no reasoning to interfere, thoughts remain only as thoughts. Thoughts do not get converted into action. Impressions on the mind remain only as impressions. Impressions revolve in mental horizon. Mind in this stage does not use sensory organs.
Here the subject is not in direct contact with any objects as sensory organs are not involved. The modification of consciousness in this stage is assumed by intellect gained in the waking stage. That is why most of the dreams are around the objects that are already known to us. The transformation from gross to subtle begins at this stage.
The mind does not actively participate in dream state. It remains passive and just watches the dreams as a witness. Exactly this situation is to be attained when one is awake, not getting affected by the materialistic impressions of the mind. This becomes the ultimate step for Self realisation. She is the cause for this stage.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
29 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment