దేవాపి మహర్షి బోధనలు - 78
🌹. దేవాపి మహర్షి బోధనలు - 78 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 59. శ్రావస్తి - మైత్రేయ మహర్షి 🌻
భూమిపై సనత్కుమారుని ప్రణాళికను నిర్వహించుటయే జగద్గురువు మైత్రేయుని ప్రణాళిక. మైత్రేయుని బోధనలు జీవ చైతన్యమును మేల్కొల్పి సృజనాత్మ కము చేయుట. మైత్రేయుని బోధనలు అనంతము, అనిర్వచనీయము, అప్రతర్క్యము అగు విరాట్పురుషుని, అతని సృష్టి విధానమును జీవుల కెరుకపరుచుట.
మైత్రేయుని బోధనలు విశ్వాత్మ చైతన్యమును పరిచయము చేసి, మతములకు మన్వంతరములకు అతీతము మరియు శాశ్వతము నగు ధర్మమును, దైవమును పరిచయము చేయుట. కూటములు, వర్గములు గురుపరంపరాగత మతములలో చిక్కుపడిన వారికి మైత్రేయుని బోధలందవు.
మైత్రేయుని బోధనలు అగ్ని సమానములు. సూటిగ హృదయ కమలమును మేల్కొల్పి, వికసింపజేసి విశ్వాత్మ చైతన్యమునందు రతి గొలుపును. మైత్రేయుని బోధనలు జీవుల పునరుత్థానము కొఱకే. ద్విజత్వము నందించుట కొరకే.
అనగా పదార్థమయమైన దేహమున పుట్టిన జీవుడు దివ్యపదార్థమున మరల పుట్టుట. భూమిని, భూమి జీవులను దివ్య వైభవము వైపునకు నడిపించుట కొఱుకే మైత్రేయ మహర్షి దివ్యశరీరమును ధరించి వేలాది సంవత్సరముల నుండి యజ్ఞార్థము భూమిపై నిలచియున్నాడు.
సశేషం...
🌹
29 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment