29-APRIL-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 596 / Bhagavad-Gita - 596 - 18-8 🌹 
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 380 381 / Vishnu Sahasranama Contemplation - 380, 381🌹
3) 🌹 Daily Wisdom - 104🌹
4) 🌹. వివేక చూడామణి - 67🌹
5) 🌹Viveka Chudamani - 67🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 78🌹
7) 🌹. నిర్మల ధ్యానములు - 10🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 258 / Sri Lalita Chaitanya Vijnanam - 258 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 597 / Bhagavad-Gita - 597 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 08 🌴*

08. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్ |
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ||

🌷. తాత్పర్యం : 
దుఃఖకరములని గాని, దేహమునకు అసౌఖ్యకరములని గాని భావించి విధ్యుక్తధర్మములను విడుచువాడు రజోగుణమునందు త్యాగమొనర్చినవాడగును. అట్టి కార్యమెన్నడును త్యాగమందలి ఉన్నతస్థితిని కలుగజేయలేదు.

🌷. భాష్యము :
కృష్ణభక్తిభావన యందున్నవాడు తాను కామ్యకర్మలను చేయుచున్నాననెడి భయముతో ధనార్జనను విడువరాదు. 

పనిచేయుట ద్వారా మనుజుడు తన ధనమును కృష్ణభక్తికై వినియోగింప గలిగినచో లేదా బ్రహ్మముహుర్తమునందే మేల్కాంచుటచే తన దివ్యమగు కృష్ణభక్తిభావనను పురోగతి నొందించగలిగినచో అతడు భయముతో గాని, ఆ కర్మలు క్లేశకరమని భావించిగాని వానిని మానరాదు. అట్టి త్యాగము నిక్కముగా రజోగుణప్రధానమైనదే. 

రజోగుణకర్మఫలము సదా దుఃఖపూర్ణముగనే ఉండును. అట్టి భావనలో మనుజుడు కర్మను త్యాగమొనర్చినచో త్యాగఫలమును ఎన్నడును పొందలేడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 597 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 08 🌴*

08. duḥkham ity eva yat karma kāya-kleśa-bhayāt tyajet
sa kṛtvā rājasaṁ tyāgaṁ naiva tyāga-phalaṁ labhet

🌷 Translation : 
Anyone who gives up prescribed duties as troublesome or out of fear of bodily discomfort is said to have renounced in the mode of passion. Such action never leads to the elevation of renunciation.

🌹 Purport :
One who is in Kṛṣṇa consciousness should not give up earning money out of fear that he is performing fruitive activities. 

If by working one can engage his money in Kṛṣṇa consciousness, or if by rising early in the morning one can advance his transcendental Kṛṣṇa consciousness, one should not desist out of fear or because such activities are considered troublesome. 

Such renunciation is in the mode of passion. The result of passionate work is always miserable. If a person renounces work in that spirit, he never gets the result of renunciation.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 380, 381 / Vishnu Sahasranama Contemplation - 380, 381 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 380. కర్తా, कर्ता, Kartā 🌻*

*ఓం కర్త్రే నమః | ॐ कर्त्रे नमः | OM Kartre namaḥ*

కర్తా, कर्ता, Kartā

కర్తా స్వతంత్ర ఇతి స మహావిష్ణుః స్మృతో బుధైః కార్యసిద్ధి విషయమున స్వతంత్రుడు గావున ఆ మహావిష్ణునికి కర్తా అని నామము.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వభాగము, శ్రీకృష్ణావతార ఘట్టము ::

సీ.గుణము వికారంబుఁ గోరికయును లేని నీవలన జగంబు నెఱి జనించుఁ,
బ్రబ్బు, లేదగు; నంచుఁ బలుకుట దప్పుగా దీశుండవై బ్రహ్మ మీవ యైన
నినుఁ గొల్చు గుణములు నీ యానతులు సేయ, భటులు శౌర్యంబులు పతికి వచ్చు
పగిది నీ గుణముల బాగులు నీ వని తోఁచును నీమాయతోడఁ గూడిఆ.నీవు రక్త ధవళ నీల వర్ణంబుల, జగము సేయఁ గావ సమయఁ జూడఁ
దనరు, దట్లు నేఁడు దైత్యుల దండింపఁ, బృథివిఁ గావ నవతరించి తీశ! (123)

నీ వలన జగత్తు అంతా జన్మిస్తుంది. అయితే ఆ జగత్తుకి అవసరమైన త్రిగుణాలు గాని, వాని మార్పులు గాని నీకు లేవు. సృష్టి చేయాలనే కోరికకూడా నీకు లేదు. నీ వల్లనే పుట్టిన జగత్తు నీవలననే వృద్ధిపొంది నీయందే లయమవుతుంది అనడం పొరబాటు కాదు. సర్వాతీతుడవై బ్రహ్మము అయిన నీవు తమ ప్రభువు వని త్రిగుణాలు నీ ఆజ్ఞను పరిపాలిస్తాయి. లోకంలో భటుల శౌర్యం ప్రభువు శౌర్యంగా ప్రసిద్ధి కెక్కుతుంది. అలాగే నీ మాయతో కూడి గుణాలూ, వాటి గొప్పతనమూ నీవిగా కన్పిస్తుంటాయి. నీవు ఎర్రని రంగుతోకూడి ఉన్నప్పుడు రజోగుణ రూపుడవై సృష్టి చేస్తావు. తెల్లని రంగుతోకూడి ఉన్నపుడు సత్త్వగుణ రూపుడవై సృష్టిని రక్షిస్తావు. నల్లని రంగుతోకూడి ఉన్నపుడు తమోగుణ రూపుడవై, సృష్టినంతటినీ లయం చేస్తావు. ఇవన్నీ నీవు ధరించే పాత్రలు. అలాగే నేడుకూడా దైత్యులను దండించడానికి భూమిపై మానవుడుగా అవతరించావు. అయినా నీవు మాకు ప్రభుడవే!

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 380🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 380.Kartā 🌻*

*OM Kartre namaḥ*

Kartā svataṃtra iti sa mahāviṣṇuḥ smr̥to budhaiḥ / कर्ता स्वतंत्र इति स महाविष्णुः स्मृतो बुधैः Since Lord Mahā Viṣṇu is free and is therefore one's own master, He is Kartā.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 3
Tvattō’sya janmasthitisaṃyamānvibhō
     Vadantyanīhādaguṇādavikriyāt,
Tvayīśvarē brahmaṇi nō virudhyatē 
     Tvadāśryatvādupacaryatē guṇaiḥ. 19.

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे तृतीयोऽद्यायः ::
त्वत्तोऽस्य जन्मस्थितिसंयमान्विभो
     वदन्त्यनीहादगुणादविक्रियात् ।
त्वयीश्वरे ब्रह्मणि नो विरुध्यते 
     त्वदाश्र्यत्वादुपचर्यते गुणैः ॥ १९ ॥

O my Lord, learned Vedic scholars conclude that the creation, maintenance and annihilation of the entire cosmic manifestation are performed by You, who are free from endeavor, unaffected by the modes of material nature, and changeless in Your spiritual situation. There are no contradictions in You, who is the Parabrahman. Because the three modes of material nature -- sattva, rajas and tamas -- are under Your control, everything takes place automatically.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥

ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥

Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 381 / Vishnu Sahasranama Contemplation - 381🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 381. వికర్తా, विकर्ता, Vikartā 🌻*

*ఓం వికర్త్రే నమః | ॐ विकर्त्रे नमः | OM Vikartre namaḥ*

విచిత్రం భువనం యేన క్రియతే మాయయా సదా ।
స ఏవ భగవాన్ విష్ణుర్వికర్తేతి సమీర్యతే ॥

ఈతనిచే విచిత్రమూ, బహువిధమే అగు ప్రపంచము నిర్మించబడుచున్నది. వివిధ రూపమగు భువనమును నిర్మించునుగనుక విష్ణు భగవానునికి వికర్తా అను నామము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 381🌹*
📚. Prasad Bharadwaj 

*🌻381. Vikartā🌻*

*OM Vikartre namaḥ*

Vicitraṃ bhuvanaṃ yena kriyate māyayā sadā,
Sa eva bhagavān viṣṇurvikarteti samīryate.

विचित्रं भुवनं येन क्रियते मायया सदा ।
स एव भगवान् विष्णुर्विकर्तेति समीर्यते ॥

The creator of the varied universe. He, Lord Viṣṇu Himself makes this vicitram or unique universe.

Śrīmad Bhāgavata Canto 7, Chapter 9
Tvamvā idaṃ sadasadīśa bhavāṃstato’nyo
     Māyā yadātmaparabuddhiriyaṃ hyapārthā,
Yadyasya janma nidhanaṃ sthitirīkṣaṇaṃ ca
     Tadvaitadeva vasukālavadaṣṭitarvoḥ. 31.

:: श्रीमद्भागवते सप्तमस्कन्धे नवमोऽध्यायः ::
त्वम्वा इदं सदसदीश भवांस्ततोऽन्यो
     माया यदात्मपरबुद्धिरियं ह्यपार्था ।
यद्यस्य जन्म निधनं स्थितिरीक्षणं च
     तद्वैतदेव वसुकालवदष्टितर्वोः ॥ ३१ ॥

My dear Lord, the entire cosmic creation is caused by You and the cosmic manifestation is an effect of Your energy. Although the entire cosmos is but You alone, You keep Yourself aloof from it. The conception of "mine and yours," is certainly a type of illusion because everything is an emanation from You and is therefore not different from You. Indeed, the cosmic manifestation is non-different from You, and the annihilation is also caused by You. This relationship between Your Lordship and the cosmos is illustrated by the example of the seed and the tree, or the subtle cause and the gross manifestation.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥

ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥

Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 104 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 13. Knowledge and Activity are the Fruits of Education 🌻*

The problem of human existence and activity is really the problem of the human consciousness. Or, to put it more precisely, the problem is that man is not able to realise that this is the problem. 

Knowledge and activity are the fruits of education. But neither knowledge nor activity is unconcerned with an object outside. This would mean that our relationship with external things is the deciding factor in judging the worth of our knowledge and the value of our activities. This, again, suggests that the worth and value of our education lies in the meaning attached to our relationship with the objects of our study. The whole question is one of subject-object relation. 

There is no such thing as either knowledge or effort unrelated to an aim or objective. If this aim is to be missed, if the purpose is to go out of one’s mind, if the object is to be separated from the subject, if the content of consciousness is to be cut off from consciousness, then the result is obvious. And this is exactly what has happened to our educational methods, to the entire process of education today. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 78 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 59. శ్రావస్తి - మైత్రేయ మహర్షి 🌻*

భూమిపై సనత్కుమారుని ప్రణాళికను నిర్వహించుటయే జగద్గురువు మైత్రేయుని ప్రణాళిక. మైత్రేయుని బోధనలు జీవ చైతన్యమును మేల్కొల్పి సృజనాత్మ కము చేయుట. మైత్రేయుని బోధనలు అనంతము, అనిర్వచనీయము, అప్రతర్క్యము అగు విరాట్పురుషుని, అతని సృష్టి విధానమును జీవుల కెరుకపరుచుట.

మైత్రేయుని బోధనలు విశ్వాత్మ చైతన్యమును పరిచయము చేసి, మతములకు మన్వంతరములకు అతీతము మరియు శాశ్వతము నగు ధర్మమును, దైవమును పరిచయము చేయుట. కూటములు, వర్గములు గురుపరంపరాగత మతములలో చిక్కుపడిన వారికి మైత్రేయుని బోధలందవు. 

మైత్రేయుని బోధనలు అగ్ని సమానములు. సూటిగ హృదయ కమలమును మేల్కొల్పి, వికసింపజేసి విశ్వాత్మ చైతన్యమునందు రతి గొలుపును. మైత్రేయుని బోధనలు జీవుల పునరుత్థానము కొఱకే. ద్విజత్వము నందించుట కొరకే. 

అనగా పదార్థమయమైన దేహమున పుట్టిన జీవుడు దివ్యపదార్థమున మరల పుట్టుట. భూమిని, భూమి జీవులను దివ్య వైభవము వైపునకు నడిపించుట కొఱుకే మైత్రేయ మహర్షి దివ్యశరీరమును ధరించి వేలాది సంవత్సరముల నుండి యజ్ఞార్థము భూమిపై నిలచియున్నాడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 67 / Viveka Chudamani - 67🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 19. బ్రహ్మము - 7 🍀*

239. పండితులైన వారు బ్రహ్మము యొక్క పూర్తి సత్యమును మరియు బ్రహ్మానికి దానిని తెలుసుకొనే వారికి, తెలుసుకొనే దానికి, తెలిసినది అనే భేదము లేదు. అది స్థిరమైనది. ఉన్నతమైన జ్ఞానానికి సారభూతమైనది. 

240. దానిని విసరివేయటానికి, తీసుకొనుటకు వీలులేనిది. ఎందువలనంటే అది పదార్థము కాదు. మనస్సుకు, మాటలకు అందనిది. కొలుచుటకు వీలు లేనిది. మొదలు, చివర లేనిది. అదే మొత్తమైనది. అదే ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ. అది కీర్తి ప్రతిష్టలకు అందనిది. 

241, 242. ఆ విధముగా సృతుల ప్రకారము ‘’తత్వమసి’’ అదే నీవు అనే మాట మరల మరల బ్రహ్మానికి వర్తింపజేస్తూంది. అదే, జీవుడు, ఈశ్వరులకు భేదము లేదిని తెలుపుతుంది. జీవేశ్వరుల సంబంధము భాష పరముగా కాకుండా అవి ఒక్కటే అయినప్పటికి వ్యతిరేకముగా చెప్పబడుచున్నది. 

ఎలా అంటే సూర్యుడు దాని ప్రకాశము లేక వెచ్చదనము వలె. అలానే రాజు సేవకుడు. బావి సముద్రము, మేరుపర్వతము అణువు వలె రెండు ఒక్కటే అయినప్పటికి వేరువేరుగా పిలువబడుచున్నది. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 67 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 19. Brahman - 7 🌻*

239. Sages realise the Supreme Truth, Brahman, in which there is no differentiation of knower, knowledge and known, which is infinite, transcendent, and the Essence of
Knowledge Absolute.

240. Which can be neither thrown away nor taken up, which is beyond the reach of mind and speech, immeasurable, without beginning and end, the Whole, one’s very Self, and of surpassing glory.

241-242. If thus the Shruti, in the dictum "Thou art That" (Tat-Tvam-Asi), repeatedly establishes the absolute identity of Brahman (or Ishwara) and Jiva, denoted by the terms That (Tat) and thou (Tvam) respectively, divesting these terms of their relative
associations, then it is the identity of their implied, not literal, meanings which is sought to be inculcated; for they are of contradictory attributes to each other – like the sun and a glow-worm, the king and a servant, the ocean and a well, or Mount Meru and an atom.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 10 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. మనిషి తన సంకల్పాన్ని దాటి వెళ్ళాలి. అప్పుడే తను దైవ సంకల్పంలో భాగమవుతాడు. 🍀*

వ్యక్తి తన సంకల్పాన్ని వదులుకోవాలి. అసలు యిబ్బందంతా అక్కడే వుంది. ఒకసారి మన సంకల్పాన్ని వదులుకుంటే అపుడు మన గుండా అస్తిత్వం తన పనిని మొదలు పెడుతుంది. అప్పుడక్కడ బాధ వుండదు. దు:ఖముండదు. అత్యుత్సాహముండదు. ఉద్వేగముండదు. వ్యక్తి సంపూర్ణ విశ్రాంతితో వుండవచ్చు. అక్కడ సమస్యే వుండదు.

అన్ని సమస్యలూ నీ సంకల్పం నించే మొదలవుతాయి. సంకల్పమంటే సమస్తానికి వ్యతిరేకంగా సంఘర్షించడం. అది ఘర్షణే. సంఘర్షణ ఆందోళనకి కారణమవుతుంది. అపుడు నీకు వైఫల్యమే ఫలితం. 

అందువల్ల ఎంత పెద్దగా ఘర్షించినా ప్రతివాడికీ హృదయపు లోతుల్లో దాని వల్ల ఫలితం వుండదని తెలుస్తునే వుంటుంది. వ్యక్తి సమస్తానికి వ్యతిరేకంగా నిలిచి విజయం సాధించలేడు.

సమస్తంలో కలిసి వుంటే మనిషి సాధించగలడు. సమస్తానికి వ్యతిరేకంగా వుంటే ఏమీ సాధించలేడు. ఒకసారి నువ్వు నీ సంకల్పాన్ని వదులుకుంటే అన్నీ నీవే హఠాత్తుగా అనంత విశ్వం నీకోసం తలుపులు తెరుస్తుంది. అన్ని రహస్యాలూ నీకు
అవగతమవుతాయి. తెలియనివన్నీ నీకు తెలిసివస్తాయి. అన్ని తాళాలు నీ చేతి కందుతాయి. 

ఇక్కడ వున్న విరోధాభాస ఎట్లాంటిదంటే ఒకసారి నీ సంకల్పాన్ని నువ్వు వదులుకుంటే నువ్వు అధికారివవుతావు. అట్లా కాకుండా నీ సంకల్పాన్ని వదులుకోకుండా నువ్వు సంఘర్షిస్తూ వుంటే నువ్వు బానిసగానే మిగిలిపోతావు.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 258 / Sri Lalitha Chaitanya Vijnanam - 258 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 62. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా ।
విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా ॥ 62 ॥ 🍀*

*🌻258. 'స్వపంతీ ' 🌻*

స్వప్నము, సూక్ష్మలోక తెలివి, నిద్ర మేలుకొనిన స్థితి, అజ్ఞానము నుండి మేలుకొనిన స్థితి అను నాలుగు అవస్థలకు అతీతముగ వుండు నది శ్రీమాత అని అర్థము. అవస్థలన్నియూ సృష్టి జీవులకే. త్రిగుణములకు లోబడిన వారికే. శ్రీమాత కిట్టి అవస్థలు లేవు. జీవుని అవస్థలు ప్రధానముగ చతుర్విధములని తెలుపుదురు. అందు మొదటిది నిద్ర. రెండవది స్వప్నము. మూడవది మెళకువ. నాలుగవది అజ్ఞానము నుండి మెళకువ. 

ఈ నాలుగు స్థితుల కన్న పైన నుండునది శ్రీమాత. 

1. నిద్రయందు బాహ్యలోకము లేదు. అంతర్లోకము లేదు. జీవునకు ఉండుటయే గాని తానున్నాడని కూడ తెలియదు. దీనిని సుప్తి అందురు. ఇట్టి సు స్థితి కలిగించునది శ్రీమాత గనుక సుప్తా అందురు. 

2. స్వప్నమున జీవుడు మేల్కాంచిననూ అవశుడై యుండును. అది నిద్ర కాదు; మెళకువ కాదు. పూర్ణ జ్ఞానము కాదు. ఏవేవో దృశ్యములు వచ్చి పోవుచుండును. 

జీవునకు స్వాధీన ముండదు. బాహ్యమున మేల్కాంచినపుడుండు లేశమాత్రపు స్వాధీనము కూడ యుండదు. దుస్వప్నములు, సుస్వప్నములు తమకు తాముగా వచ్చి పోవు చుండును. మేల్కాంచిననూ ఏమియూ చేయలేని స్థితియే. వృక్షము లిట్లే యుండును. 

స్వప్నమునందు ఇంద్రియములు కార్యములు చేయకున్నను చేసినట్లు భ్రమ కలుగును. మనసు ప్రాపంచిక అనుభవమును పొందుచుండును. ఇట్లు శరీరము, ఇంద్రియములు పనిచేయక మనసు అవశమై తెగిన గాలిపటము వలె సన్నివేశముల యందు పాల్గొనుట స్వప్నము. స్వప్నానుభూతి ప్రతి మానవునకును అప్పుడప్పుడు కలుగు అవస్థ. ఇది కలిగించునది శ్రీదేవియే.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 258 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻Svapantī स्वपन्ती (258) 🌻*

She exists in dream state too. [During dream state, REM (Rapid Eye Movement) continues to exist but at lower intensity.] The knowledge gained through external objects is transmitted to mind, causing impressions in the mind. But during dream state, these impressions manifest subconsciously as dreams.  

Dream is nothing but the contemplation of the mind that could not be executed, in not only this birth, but also the previous births. Dream is the store house of thoughts, accumulated over a period of time. In this state, there is no reasoning to interfere, thoughts remain only as thoughts. Thoughts do not get converted into action. Impressions on the mind remain only as impressions. Impressions revolve in mental horizon. Mind in this stage does not use sensory organs.    

Here the subject is not in direct contact with any objects as sensory organs are not involved. The modification of consciousness in this stage is assumed by intellect gained in the waking stage. That is why most of the dreams are around the objects that are already known to us. The transformation from gross to subtle begins at this stage.  

The mind does not actively participate in dream state. It remains passive and just watches the dreams as a witness. Exactly this situation is to be attained when one is awake, not getting affected by the materialistic impressions of the mind. This becomes the ultimate step for Self realisation. She is the cause for this stage. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment