🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 380 / Vishnu Sahasranama Contemplation - 380 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 380. కర్తా, कर्ता, Kartā 🌻
ఓం కర్త్రే నమః | ॐ कर्त्रे नमः | OM Kartre namaḥ
కర్తా, कर्ता, Kartā
కర్తా స్వతంత్ర ఇతి స మహావిష్ణుః స్మృతో బుధైః కార్యసిద్ధి విషయమున స్వతంత్రుడు గావున ఆ మహావిష్ణునికి కర్తా అని నామము.
:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వభాగము, శ్రీకృష్ణావతార ఘట్టము ::
సీ.గుణము వికారంబుఁ గోరికయును లేని నీవలన జగంబు నెఱి జనించుఁ,
బ్రబ్బు, లేదగు; నంచుఁ బలుకుట దప్పుగా దీశుండవై బ్రహ్మ మీవ యైన
నినుఁ గొల్చు గుణములు నీ యానతులు సేయ, భటులు శౌర్యంబులు పతికి వచ్చు
పగిది నీ గుణముల బాగులు నీ వని తోఁచును నీమాయతోడఁ గూడిఆ.నీవు రక్త ధవళ నీల వర్ణంబుల, జగము సేయఁ గావ సమయఁ జూడఁ
దనరు, దట్లు నేఁడు దైత్యుల దండింపఁ, బృథివిఁ గావ నవతరించి తీశ! (123)
నీ వలన జగత్తు అంతా జన్మిస్తుంది. అయితే ఆ జగత్తుకి అవసరమైన త్రిగుణాలు గాని, వాని మార్పులు గాని నీకు లేవు. సృష్టి చేయాలనే కోరికకూడా నీకు లేదు. నీ వల్లనే పుట్టిన జగత్తు నీవలననే వృద్ధిపొంది నీయందే లయమవుతుంది అనడం పొరబాటు కాదు. సర్వాతీతుడవై బ్రహ్మము అయిన నీవు తమ ప్రభువు వని త్రిగుణాలు నీ ఆజ్ఞను పరిపాలిస్తాయి. లోకంలో భటుల శౌర్యం ప్రభువు శౌర్యంగా ప్రసిద్ధి కెక్కుతుంది. అలాగే నీ మాయతో కూడి గుణాలూ, వాటి గొప్పతనమూ నీవిగా కన్పిస్తుంటాయి. నీవు ఎర్రని రంగుతోకూడి ఉన్నప్పుడు రజోగుణ రూపుడవై సృష్టి చేస్తావు. తెల్లని రంగుతోకూడి ఉన్నపుడు సత్త్వగుణ రూపుడవై సృష్టిని రక్షిస్తావు. నల్లని రంగుతోకూడి ఉన్నపుడు తమోగుణ రూపుడవై, సృష్టినంతటినీ లయం చేస్తావు. ఇవన్నీ నీవు ధరించే పాత్రలు. అలాగే నేడుకూడా దైత్యులను దండించడానికి భూమిపై మానవుడుగా అవతరించావు. అయినా నీవు మాకు ప్రభుడవే!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 380🌹
📚. Prasad Bharadwaj
🌻 380.Kartā 🌻
OM Kartre namaḥ
Kartā svataṃtra iti sa mahāviṣṇuḥ smr̥to budhaiḥ / कर्ता स्वतंत्र इति स महाविष्णुः स्मृतो बुधैः Since Lord Mahā Viṣṇu is free and is therefore one's own master, He is Kartā.
Śrīmad Bhāgavata - Canto 10, Chapter 3
Tvattō’sya janmasthitisaṃyamānvibhō
Vadantyanīhādaguṇādavikriyāt,
Tvayīśvarē brahmaṇi nō virudhyatē
Tvadāśryatvādupacaryatē guṇaiḥ. 19.
:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे तृतीयोऽद्यायः ::
त्वत्तोऽस्य जन्मस्थितिसंयमान्विभो
वदन्त्यनीहादगुणादविक्रियात् ।
त्वयीश्वरे ब्रह्मणि नो विरुध्यते
त्वदाश्र्यत्वादुपचर्यते गुणैः ॥ १९ ॥
O my Lord, learned Vedic scholars conclude that the creation, maintenance and annihilation of the entire cosmic manifestation are performed by You, who are free from endeavor, unaffected by the modes of material nature, and changeless in Your spiritual situation. There are no contradictions in You, who is the Parabrahman. Because the three modes of material nature -- sattva, rajas and tamas -- are under Your control, everything takes place automatically.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥
ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥
Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 381 / Vishnu Sahasranama Contemplation - 381🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 381. వికర్తా, विकर्ता, Vikartā 🌻
ఓం వికర్త్రే నమః | ॐ विकर्त्रे नमः | OM Vikartre namaḥ
విచిత్రం భువనం యేన క్రియతే మాయయా సదా ।
స ఏవ భగవాన్ విష్ణుర్వికర్తేతి సమీర్యతే ॥
ఈతనిచే విచిత్రమూ, బహువిధమే అగు ప్రపంచము నిర్మించబడుచున్నది. వివిధ రూపమగు భువనమును నిర్మించునుగనుక విష్ణు భగవానునికి వికర్తా అను నామము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 381🌹
📚. Prasad Bharadwaj
🌻381. Vikartā🌻
OM Vikartre namaḥ
Vicitraṃ bhuvanaṃ yena kriyate māyayā sadā,
Sa eva bhagavān viṣṇurvikarteti samīryate.
विचित्रं भुवनं येन क्रियते मायया सदा ।
स एव भगवान् विष्णुर्विकर्तेति समीर्यते ॥
The creator of the varied universe. He, Lord Viṣṇu Himself makes this vicitram or unique universe.
Śrīmad Bhāgavata Canto 7, Chapter 9
Tvamvā idaṃ sadasadīśa bhavāṃstato’nyo
Māyā yadātmaparabuddhiriyaṃ hyapārthā,
Yadyasya janma nidhanaṃ sthitirīkṣaṇaṃ ca
Tadvaitadeva vasukālavadaṣṭitarvoḥ. 31.
:: श्रीमद्भागवते सप्तमस्कन्धे नवमोऽध्यायः ::
त्वम्वा इदं सदसदीश भवांस्ततोऽन्यो
माया यदात्मपरबुद्धिरियं ह्यपार्था ।
यद्यस्य जन्म निधनं स्थितिरीक्षणं च
तद्वैतदेव वसुकालवदष्टितर्वोः ॥ ३१ ॥
My dear Lord, the entire cosmic creation is caused by You and the cosmic manifestation is an effect of Your energy. Although the entire cosmos is but You alone, You keep Yourself aloof from it. The conception of "mine and yours," is certainly a type of illusion because everything is an emanation from You and is therefore not different from You. Indeed, the cosmic manifestation is non-different from You, and the annihilation is also caused by You. This relationship between Your Lordship and the cosmos is illustrated by the example of the seed and the tree, or the subtle cause and the gross manifestation.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥
ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥
Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
29 Apr 2021
No comments:
Post a Comment