✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. దేవుడంటే ఆనందం. దేవుడంటే శాశ్వత తత్వం. 🍀
ఫ్రెడరిక్ నిషే! దేవుడు చనిపోయాడు' అన్నాడు. కానీ ఎవరూ అతన్ని 'ఇంతకూ దేవుణ్ణి ఎవరు చంపారు?” అని అడగలేదు. అక్కడ రెండు అవకాశాలున్నాయి. అతను ఆత్మహత్య చేసుకుని వుండాలి. లేదా ఎవరైనా అతన్ని హతమార్చి వుండాలి. దేవుడు ఆత్మహత్య చేసుకోడు. అది అసాధ్యం.
కారణం దేవుడంటే ఆనందం. ఆనందం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? దేవుడంటే శాశ్వత తత్వం. కాబట్టి ఆత్మహత్య అన్నది అసాధ్యం కాబట్టి అతన్ని ఎవరో హత్య చేసి వుండాలి. మతాధికారులు ఆ పని చేసి వుంటారు. ఈ కుట్రలో అన్ని మతాలకు సంబంధించిన అందరు పెద్దలు భాగస్వామ్యం వహించారు. వాళ్ళు దేవుణ్ణి చంపారు. వాళ్ళు నిజమైన దేవుణ్ణి చంపలేరనుకోండి. వాళ్ళు తాము సృష్టించిన దేవుణ్ణి చంపగలరు. అర్థం లేని పదివేల సంవత్సరాల మత చరిత్రలో జరిగిందిది.
నేను యిచ్చే సలహా. ప్రేమని అన్వేషించండి. దేవుణ్ణి గురించి మరిచిపొండి. దైవత్వమన్నది దానంతట అదే వస్తుంది. అనివార్యంగా వస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
07 May 2021
No comments:
Post a Comment