విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 386, 387 / Vishnu Sahasranama Contemplation - 386, 387


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 386 / Vishnu Sahasranama Contemplation - 386 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻386. సంస్థానః, संस्थानः, Saṃsthānaḥ🌻


ఓం సంస్థానాయ నమః | ॐ संस्थानाय नमः | OM Saṃsthānāya namaḥ

విశ్వేశ్వరేఽస్మిన్భూతానాం సంస్థితః ప్రలయాత్మికా ।
సమీచీనం స్థాన మస్యేత్యయం సంస్థాన ఉచ్యతే ॥

సంస్థితః, సంస్థానం అనునవి లెస్సయగు నిలుకడ అను అర్థమున సమానార్థక పదములు. అట్లు ఇతనియందు సకల భూతములకును 'ప్రళయ' రూపము అగు ఉనికి ఏర్పడును అను అర్థమున పరమాత్ముడు 'సంస్థానః' అనబడుచున్నాడు. లేదా సమీచీనం స్థానం అస్య ఇతనికి లెస్సయగు ఉనికి కలదు. తాను ఎవ్వరిని ఆశ్రయించక కాలపు అవధులకు లోబడక ఏవియు తనకు అంటక తాను వేనిని అంటక శాశ్వతుడై యుండు ఉనికి లెస్సయగు ఉనికియే కదా!

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 386🌹

📚. Prasad Bharadwaj

🌻386. Saṃsthānaḥ🌻


OM Saṃsthānāya namaḥ


Viśveśvare’sminbhūtānāṃ saṃsthitaḥ pralayātmikā,
Samīcīnaṃ sthāna masyetyayaṃ saṃsthāna ucyate.

विश्वेश्वरेऽस्मिन्भूतानां संस्थितः प्रलयात्मिका ।
समीचीनं स्थान मस्येत्ययं संस्थान उच्यते ॥

Here is the resting place of creatures in the form of pralaya or deluge.

Or as He is the ultimate existence and His abode is excellent hence He is Saṃsthānaḥ.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः ।परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః ।పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥

Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ ।Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 387 / Vishnu Sahasranama Contemplation - 387🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻387. స్థానదః, स्थानदः, Sthānadaḥ🌻

ఓం స్థానదాయ నమః | ॐ स्थानदाय नमः | OM Sthānadāya namaḥ

స్థానదః, स्थानदः, Sthānadaḥ

ధ్రువాదిభ్యఃస్వకర్మానురూపం స్థానం దదాతి యః ।
స స్థానద ఇతి ప్రోక్తో విబుధైర్భగవాన్ హరిః ॥

ధ్రువుడు మొదలగు వారికి తమ కర్మలకు తగిన స్థానమును ఇచ్చువాడు.

క. ధీరవ్రత! రాజన్య కు, మారక! నీ హృదయమందు మసలిన కార్యం
బారూఢిగానెఱుంగుదు, నారయ నది వొందరాని దైనను నిత్తున్. (289)

వ. అది యెట్టి దనిన నెందేని మేధియందుఁ బరిభ్రామ్యమాణ గోచక్రం బునుం బోలె గ్రహనక్ష త్రతారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్ర రూపంబుల యిన ధర్మాగ్ని కశ్యప శక్రులును సప్తర్షులును, దారకా సమేతులై ప్రదక్షిణంబు దిరుగుచుండుదురు; అట్టి దురాపంబును ననన్యాధిష్ఠితం బును లోకత్రయ ప్రళయకాలంబునందు నశ్వరంబుగాక ప్రకాశమా నంబును నయిన ధ్రువక్షితి యను పదంబు ముందట నిరువది యాఱువేలేండ్లు చనంబ్రాపింతువు... (290)

రాజకుమారా! నీ వ్రతదీక్ష అచంచలమైనది. నీ మనస్సులోని అభిప్రాయాలు చక్కగా గ్రహించాను. అయితే అది దుర్లభమైనది. అయినప్పటికీ, నీ కోరిక తీరుస్తాను. కట్టుకొయ్య చుట్టూ పశువుల మంద తిరిగినట్లు గ్రహాలూ, నక్షత్రాలూ, తారాగణాలూ, జ్యోతిశ్చక్రమూ, నక్షత్ర స్వరూపాలయిన ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్తర్షులు, తారకలతో కూడి దేనికి ప్రదక్షిణం చేస్తుంటారో అటువంటి "ధ్రువక్షితి" అనే మహోన్నత స్థానాన్ని ఇకపైన అరవైఆరువేల సంవత్సరాల అనంతరం నీవు పొందుతావు. అది ఎవ్వరికీ అందరానిది. ఇదివరకు ఎవ్వరూ దానిని పొందలేదు. మూడు లోకాలూ నశించేటప్పుడు కూడ అది నశింపక ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి స్థానాన్ని నీవు అలంకరిస్తావు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 387🌹

📚. Prasad Bharadwaj

🌻387. Sthānadaḥ🌻


OM Sthānadāya namaḥ

Dhruvādibhyaḥsvakarmānurūpaṃ sthānaṃ dadāti yaḥ,
Sa sthānada iti prokto vibudhairbhagavān hariḥ.

ध्रुवादिभ्यःस्वकर्मानुरूपं स्थानं ददाति यः ।
स स्थानद इति प्रोक्तो विबुधैर्भगवान् हरिः ॥

Since Lord Hari confers on Dhruva and others their place according to their karmas, He is Sthānadaḥ.


Śrīmad Bhāgavata - Canto 4, Chapter 9

Nanyaradhiṣṭhitaṃ bhadra yad bhrājiṣṇu dhruvakṣiti,
Yatra graharkṣatārāṇāṃ jyotiṣāṃ cakramāhitam. 20.

Dharmo’gniḥ kaśyapaḥ śukro munayo ye vanaukasaḥ,
Caranti dakṣiṇīkr̥tya bhramanto yatsatārakāḥ. 22.


:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे नवमोऽध्यायः ::

नन्यरधिष्ठितं भद्र यद् भ्राजिष्णु ध्रुवक्षिति ।
यत्र ग्रहर्क्षताराणां ज्योतिषां चक्रमाहितम् ॥ २० ॥

धर्मोऽग्निः कश्यपः शुक्रो मुनयो ये वनौकसः ।
चरन्ति दक्षिणीकृत्य भ्रमन्तो यत्सतारकाः ॥ २२ ॥

Lord continued: My dear Dhruva, I shall award you the glowing planet known as the polestar, which will continue to exist even after the dissolution at the end of the millennium. No one has ever ruled this planet, which is surrounded by all the solar systems, planets and stars. All the luminaries in the sky circumambulate this planet, just as bulls tread around a central pole for the purpose of crushing grains. Keeping the polestar to their right, all the stars inhabited by the great sages like Dharma, Agni, Kaśyapa and Śukra circumambulate this planet, which continues to exist even after the dissolution of all others.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः ।परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః ।పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥

Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ ।Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


07 May 2021

No comments:

Post a Comment