25-MAY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 1-40 / Bhagavad-Gita - 1-40🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 607 / Bhagavad-Gita - 608 - 18-19🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 402 403 / Vishnu Sahasranama Contemplation - 402, 403🌹
4) 🌹 Daily Wisdom - 115🌹
5) 🌹. వివేక చూడామణి - 78🌹
6) 🌹Viveka Chudamani - 78🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 88🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 21🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 269 / Sri Lalita Chaitanya Vijnanam - 269 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 40 / Bhagavad-Gita - 40 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము 🌴
శ్లోకము 40

40. కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మా: సనాతనా: |
ధర్మేనష్టే కులం కృత్స్నమధర్మోభిభవత్యుత ||

🌷. తాత్పర్యం : 
కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మ వర్తనులగుదురు.

🌷. భాష్యము : 
వంశమునందలి వారు సక్రమముగా వృద్ధినొంది ఆద్యాత్మికవిలువలను సంతరించుకొనుటకై సహాయపడుటకు పలు ధర్మనియమములు వర్ణాశ్రమపద్దతి యందు కలవు. జన్మ మొదలుగా మృత్యువు వరకు గల అట్టి అనేక శుద్ధికర్మలకు వంశంలోని పెద్దలు భాద్యతను వహింతురు. 

కాని ఆ పెద్దల మరణము పిమ్మట అతి వంశాచారములు నిలిచిపోయి మిగిలిన వంశమువారు అధర్మమగు అలవాట్లను వృద్దిచేసికొను అవకాశము కలదు. తద్ద్వారా ఆధ్యాత్మికముక్తికి వారు అవకాశము కోల్పోవగలరు. కనుకనే ఏ ప్రయోజనము కొరకైనను వంశపెద్దలను వధింపరాదు.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 40 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 

🌴 Chapter 1 - Vishada Yoga 🌴
Verse 40

40. kula-kṣaye praṇaśyanti
kula-dharmāḥ sanātanāḥ
dharme naṣṭe kulaṁ kṛtsnam
adharmo ’bhibhavaty uta

Translation : 
With the destruction of the dynasty, the eternal family tradition is vanquished, and thus the rest of the family becomes involved in irreligion.

Purport : 
In the system of the varṇāśrama institution there are many principles of religious traditions to help members of the family grow properly and attain spiritual values. The elder members are responsible for such purifying processes in the family, beginning from birth to death. 

But on the death of the elder members, such family traditions of purification may stop, and the remaining younger family members may develop irreligious habits and thereby lose their chance for spiritual salvation. Therefore, for no purpose should the elder members of the family be slain.
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 608 / Bhagavad-Gita - 608 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 19 🌴*

19. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదత: |
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛ్రుణు తాన్యపి ||

🌷. తాత్పర్యం : 
ప్రక్రుతిజన్య త్రిగుణముల ననుసరించి జ్ఞానము, కర్మము, కర్త యనునవి మూడురకములు. ఇక వానిని గూర్చి నా నుండి ఆలకింపుము.

🌷. భాష్యము :
చతుర్దధ్యాయమున ప్రకృతిజన్య త్రిగుణముల విస్తారముగా వివరింపబడినవి. సత్త్వగుణము ప్రకాశమానమనియు, రజోగుణము భౌతికభావ సమన్వితమనియు, తమోగుణము సోమరితనము మరియు మాంద్యములకు కారణభూతమనియు అధ్యాయమని తెలుపబడినది. ఆ త్రిగుణములన్నియు బంధకారణములే గాని ముక్తికి హేతువులు కావు. 

సత్త్వగుణమునందు కూడా జీవుడు బద్ధుడే యగుచున్నాడు. అట్టి వివిధగుణములను కలిగియున్న వివిధజనులచే చేయబడు వివిధార్చనములు సప్తదశాధ్యాయమున వివరింపబడినవి. ఇక అట్టి త్రిగుణముల ననుసరించియున్న వివిధజ్ఞానములను, కర్తలను, కర్మలను తాను వివరింపగోరుచున్నట్లు శ్రీకృష్ణభగవానుడు ఈ శ్లోకమున పలుకుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 608 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 19 🌴*

19. jñānaṁ karma ca kartā ca tridhaiva guṇa-bhedataḥ
procyate guṇa-saṅkhyāne yathāvac chṛṇu tāny api

🌷 Translation : 
According to the three different modes of material nature, there are three kinds of knowledge, action and performer of action. Now hear of them from Me.

🌹 Purport :
In the Fourteenth Chapter the three divisions of the modes of material nature were elaborately described. In that chapter it was said that the mode of goodness is illuminating, the mode of passion materialistic, and the mode of ignorance conducive to laziness and indolence. All the modes of material nature are binding; they are not sources of liberation. Even in the mode of goodness one is conditioned. 

In the Seventeenth Chapter, the different types of worship by different types of men in different modes of material nature were described. In this verse, the Lord says that He wishes to speak about the different types of knowledge, workers and work itself according to the three material modes.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 402, 403 / Vishnu Sahasranama Contemplation - 402, 403 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻402. శక్తిమతాం శ్రేష్ఠః, शक्तिमतां श्रेष्ठः, Śaktimatāṃ śreṣṭhaḥ🌻*

*ఓం శక్తిమతాం శ్రేష్ఠాయ నమః | ॐ शक्तिमतां श्रेष्ठाय नमः | OM Śaktimatāṃ śreṣṭhāya namaḥ*

విరించాది శక్తిమతాం శక్తిమత్త్వాజ్జనార్దనః ।
విష్ణుః శక్తిమతాం శ్రేష్ఠ ఇతి సంకీర్త్యతే బుధైః ॥

శక్తిమంతులగు విరించాదుల కంటే అనగా చతుర్ముఖ బ్రహ్మ మొదలగువారికంటెను గొప్ప శక్తిగలవాడు. శక్తి గలవారిలోనెల్ల శ్రేష్ఠుడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 402🌹*
📚. Prasad Bharadwaj

*🌻402. Śaktimatāṃ śreṣṭhaḥ🌻*

*OM Śaktimatāṃ śreṣṭhāya namaḥ*

Viriṃcādi śaktimatāṃ śaktimattvājjanārdanaḥ,
Viṣṇuḥ śaktimatāṃ śreṣṭha iti saṃkīrtyate budhaiḥ.

विरिंचादि शक्तिमतां शक्तिमत्त्वाज्जनार्दनः ।
विष्णुः शक्तिमतां श्रेष्ठ इति संकीर्त्यते बुधैः ॥

More powerful than powerful ones like Viriṃci or Brahma. Best amongst such.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 403 / Vishnu Sahasranama Contemplation - 403🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻403. ధర్మః, धर्मः, Dharmaḥ🌻*

*ఓం ధర్మవిదుత్తమాయ నమః | ॐ धर्मविदुत्तमाय नमः | OM Dharmaviduttamāya namaḥ*

ధారణాత్సర్వభూతానా మేషధర్మ ఇతి శ్రుతేః ।
ధరిమైరారాధ్యత ఇతి ధర్మ ఇత్యుచ్యతే హరిః ॥

ధరించువాడు. సర్వ భూతములను ధరించువాడు గావున ధర్మః అనదగియున్నాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 403🌹*
📚. Prasad Bharadwaj

🌻403. Dharmaḥ🌻*

*OM Dharmaviduttamāya namaḥ*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 115 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 24. The Path of Return to the Absolute 🌻*

Self-preservation and self-reproduction are the spatio-temporal forms taken by the absolute character of the eternity of Consciousness. The ‘fall’ is a single act with the threefold downward pressure of psychic self-affirmation, physical self-affirmation and the urge for self-perpetuation. 

The threefold instinct acts simultaneously, only manifesting a particular phase at a particular time attended with favourable circumstances, so that the psychophysical affirmation and the sex urge, though they are present in the individual at all times hiddenly or expressedly, assume special emphasis under given conditions alone, even as a seed thrown into the soil germinates only when the conditions suited to its sprouting manifest themselves in the course of time. 

Here is a crucial point which has to be taken notice of particularly by those who have dedicated their lives to tread the ‘path of return’ to the Absolute, on which subject a little dilation of understanding is called for.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 78 / Viveka Chudamani - 78🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 20. శరీర బంధనాలు - 4 🍀*

273. అగరవత్తుల సువాసనలకు లొంగి దాని సంబంధము నీతో కలసి ఉండుటచే, అలాంటి ఇతర వాసనలు పూర్తిగా ఘర్షణ ద్వారా తొలగించాలి. 

274. చందనపు సువాసనల వంటి ఆత్మ సుగంధము, అది దుమ్ముతో కప్పబడి అనగా అంతము లేని తీవ్రమైన కోరికల గుర్తులతో నింపబడి, మనస్సులో ముద్రించ బడినపుడు ఆ గుర్తులు విజ్ఞానమనే ఒత్తిడిల వలన పొందిన స్థితులు వివరముగా గ్రహించాలి. 

275. ఆత్మను తెలుసుకోవాలనే కోరిక అనేక ఇతర వస్తు సముదాయములపై కోరికచే కప్పివేయబడినది. ఎపుడైతే ఆ ఇతర కోరికలన్నియూ నాశనము చేయబడతాయో, అందుకు స్థిరమైన బంధము ఆత్మ పై ఉంచిన ఆ ఆత్మ స్పష్టముగా దానంత అదే స్థిరపడుతుంది. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 78 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 20. Bondages of Body - 4 🌻*

273. The lovely odour of the Agaru (agalochum) which is hidden by a powerful stench due to its contact with water etc., manifests itself as soon as the foreign smell has been fully removed by rubbing.

274. Like the fragrance of the sandal-wood, the perfume of the Supreme Self, which is covered with the dust of endless, violent impressions imbedded in the mind, when purified by the constant friction of Knowledge, is (again) clearly perceived.

275. The desire for Self-realisation is obscured by innumerable desires for things other than the Self. When they have been destroyed by the constant attachment to the Self, the Atman clearly manifests Itself of Its own accord.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 89 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 70. అసూయాగ్ని-1 🌻*

ప్రస్తుత ప్రపంచమున అసూయకు లోను కాని వారు బహు కొద్ది మంది మాత్రమే. ఇతరులతో తమను పోల్చుకొను స్వభావము కలవారికి అసూయ సోకును. సుయోధనుడు, కర్ణుడు అసూయకు లోనై నశించినారు. ప్రస్తుత కాలమున ఈ వాసన మిన్నగ నున్నది. అసూయ గలవానికి కర్తవ్యమునందు శ్రద్ధ ఉండదు. అశ్రద్ధ గలిగిన వానికి జ్ఞానము లభింపదు. 

అసూయ అసుర సంపదలో చక్రవర్తి వంటిది. అసూయకు ప్రతీకారము తమ్ముని వంటిది. ప్రతీకారమునకు హింస తనయుని వంటిది. ఇవన్నియు కలిసి జీవుని నరకమునకు నెట్టును. అసూయకులోనై తానెంతటి దుష్కృత్యముల నొనర్చినాడో విశ్వామిత్ర మహర్షి రామునికి తన ఆత్మకథగ వివరించి, ఎట్టి స్థితి యందును అసూయ చెందరాదని హెచ్చరించెను. అర్జునుని శ్రీకృష్ణుడు కూడ అట్లే హెచ్చరించెను. పతనము చెందిన వారందరు కూడ అగ్నిలో పడిన శలభము వలె నశింతురు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 21 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. మనం దేవతలం కానీ బిచ్చగాళ్ళుగా వుంటున్నాం 🍀*

రహస్యాన్ని తెలుసుకోవడం గుండా విజయం రంగంలోకి వస్తుంది. తెలుసుకోవలసిన విలువయిన రహస్యం ఒకటే అది నీ లోలోతుల్లోని నీకు సంబంధించిన నువ్వు. అది అనంత రహస్య ప్రదేశం. జనం అగమ్యంగా అన్ని దిక్కులూ అన్వేషిస్తారు. మనిషి చంద్రుణ్ణి అందుకున్నాడు. అది చాలా సులభం. 

అతి కష్టమయిన విషయం తన అంతరంగంలోకి వెళ్ళడం. తన లోపలి కేంద్రాన్ని చేరగం. అక్కడ రహస్యాలకే రహస్యమైనదుంది. అన్ని రహస్యాలనూ తెరిచే 'మాస్టర్ కీ' అక్కడుంది. సన్యాసిగా నిన్ను నువ్వు తెలుసుకునే మార్గంలో వున్నావు. అది అప్పటికే అక్కడ వుంది. నువ్వు కేవలం దాన్ని కనిపెట్టాలి. 

అక్కర్లేని వాటిని ఆటంకంగా వున్న వాటిని తొలగించాలి. కొన్ని తెరల్ని పక్కకి జరపాలి. అపుడు మనం దేవుడిలో ముఖాముఖీ కలుస్తాం. దేవుడు మన ఎదురుగా వుంటాడు. రహస్యమేమిటంటే మనం దేవతలం. బాధాకరమైన విషయమేమిటంటే మనం బిచ్చగాళ్ళుగా వున్నాం.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 269 / Sri Lalitha Chaitanya Vijnanam - 269 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 64. సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ ।*
*సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥ 🍀*

*🌻269. 'రుద్రరూపా' 🌻* 

బ్రహ్మ దుఃఖమును పోగొట్టుటకై ఫాల భాగమునుండి రుద్రుడుదయించి ఏకాదశ రుద్రులుగ మారి చీకటులను తొలగించి అంతరిక్షము నేర్పరచెను. అవరోధము లేని శక్తి రుద్ర శక్తి. అట్టి శక్తి రూపమును దాల్చునది శ్రీమాతయే. సృష్టి యందు అవరోధము లేర్పడినప్పుడు, అసుర శక్తులు విజృంభించినపుడు, పెనుమార్పులు అవసరమైనపుడు శ్రీమాతయే రుద్రరూపమును దాల్చి కావ్యములను చక్కబెట్టును. 

సృష్టిని తనలోనికి లయము చేసుకొనుట తిరోధానము. ఇట్టి తిరోధానమునకు రౌద్రము, రుద్ర రూపము అవసరము. అట్టి రూపమును ధరించి ప్రళయకాల రుద్రుని వలె సృష్టిని ప్రళయములోనికి నడుపునది శ్రీదేవి. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 269 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 64. saṁhāriṇī rudrarūpā tirodhāna-karīśvarī |*
*sadāśivā'nugrahadā pañcakṛtya-parāyaṇā || 64 || 🍀*

*🌻 Rudra-rūpā रुद्र- रूपा (269) 🌻*

She is in the form of Rudra, while causing death. Her form is known as Rudra when She causes the death of individual lives. Rudra does not mean the lord of death. 

Rudra is the destroyer of miseries. Ru refers to pains arising out of miseries arising out of improper usage of sensory organs and dra means to disperse. Rudra means driving away miseries. 

Chāndogya Upaniṣad (III.13.3) says, “Rudra-s are connected with religious rites. The prāṇa-s are called Rudra-s because they make everyone in this world cry.”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment