దేవాపి మహర్షి బోధనలు - 89


🌹. దేవాపి మహర్షి బోధనలు - 89 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 70. అసూయాగ్ని-1 🌻

ప్రస్తుత ప్రపంచమున అసూయకు లోను కాని వారు బహు కొద్ది మంది మాత్రమే. ఇతరులతో తమను పోల్చుకొను స్వభావము కలవారికి అసూయ సోకును. సుయోధనుడు, కర్ణుడు అసూయకు లోనై నశించినారు. ప్రస్తుత కాలమున ఈ వాసన మిన్నగ నున్నది. అసూయ గలవానికి కర్తవ్యమునందు శ్రద్ధ ఉండదు. అశ్రద్ధ గలిగిన వానికి జ్ఞానము లభింపదు.

అసూయ అసుర సంపదలో చక్రవర్తి వంటిది. అసూయకు ప్రతీకారము తమ్ముని వంటిది. ప్రతీకారమునకు హింస తనయుని వంటిది. ఇవన్నియు కలిసి జీవుని నరకమునకు నెట్టును. అసూయకులోనై తానెంతటి దుష్కృత్యముల నొనర్చినాడో విశ్వామిత్ర మహర్షి రామునికి తన ఆత్మకథగ వివరించి, ఎట్టి స్థితి యందును అసూయ చెందరాదని హెచ్చరించెను. అర్జునుని శ్రీకృష్ణుడు కూడ అట్లే హెచ్చరించెను. పతనము చెందిన వారందరు కూడ అగ్నిలో పడిన శలభము వలె నశింతురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


25 May 2021

No comments:

Post a Comment