శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 269 / Sri Lalitha Chaitanya Vijnanam - 269



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 269 / Sri Lalitha Chaitanya Vijnanam - 269 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 64. సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ ।
సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥ 🍀

🌻269. 'రుద్రరూపా' 🌻


బ్రహ్మ దుఃఖమును పోగొట్టుటకై ఫాల భాగమునుండి రుద్రుడుదయించి ఏకాదశ రుద్రులుగ మారి చీకటులను తొలగించి అంతరిక్షము నేర్పరచెను. అవరోధము లేని శక్తి రుద్ర శక్తి. అట్టి శక్తి రూపమును దాల్చునది శ్రీమాతయే. సృష్టి యందు అవరోధము లేర్పడినప్పుడు, అసుర శక్తులు విజృంభించినపుడు, పెనుమార్పులు అవసరమైనపుడు శ్రీమాతయే రుద్రరూపమును దాల్చి కావ్యములను చక్కబెట్టును.

సృష్టిని తనలోనికి లయము చేసుకొనుట తిరోధానము. ఇట్టి తిరోధానమునకు రౌద్రము, రుద్ర రూపము అవసరము. అట్టి రూపమును ధరించి ప్రళయకాల రుద్రుని వలె సృష్టిని ప్రళయములోనికి నడుపునది శ్రీదేవి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 269 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 64. saṁhāriṇī rudrarūpā tirodhāna-karīśvarī |
sadāśivā'nugrahadā pañcakṛtya-parāyaṇā || 64 || 🍀

🌻 Rudra-rūpā रुद्र- रूपा (269) 🌻


She is in the form of Rudra, while causing death. Her form is known as Rudra when She causes the death of individual lives. Rudra does not mean the lord of death.

Rudra is the destroyer of miseries. Ru refers to pains arising out of miseries arising out of improper usage of sensory organs and dra means to disperse. Rudra means driving away miseries.

Chāndogya Upaniṣad (III.13.3) says, “Rudra-s are connected with religious rites. The prāṇa-s are called Rudra-s because they make everyone in this world cry.”


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


25 May 2021

No comments:

Post a Comment