శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 268 / Sri Lalitha Chaitanya Vijnanam - 268


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 268 / Sri Lalitha Chaitanya Vijnanam - 268 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 64. సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ ।
సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥ 🍀

🌻268. 'సంహారిణీ' 🌻


సృష్టి తిరోధాన కార్యమును నిర్వర్తించుటకు రుద్రరూపము దాల్చి సంహారము చేయునది శ్రీమాత అని అర్థము. రుద్రుడు దుఃఖములను తరుమువాడు. అజ్ఞానమును దహించు వాడు. అగ్ని స్వరూపుడు. రుద్ అనగా దుఃఖము. దుఃఖమును హరించువాడు గనుక రుద్రుడన బడుచున్నాడు. సృష్టి ప్రారంభమున చతుర్ముఖ బ్రహ్మ, సృష్టించుటకు తన మానసపుత్రుల సహకారమును కోరగా వారు సున్నితముగా అది తమపని కాదనిరి. అపుడు బ్రహ్మ దేవునకు దుఃఖము కలిగెను.

భాగవత పురాణమున బ్రహ్మదేవునకు కుమారుల సహాయ నిరాకరణము కోపము కలిగించినదని, ఆ రౌద్రము ఆధారముగ రుద్రుడు దిగివచ్చెనని చెప్పబడినది. రుద్రుడు రౌద్రుడే కాదు; రోదనము (దుఃఖము) గూడ పోగొట్టువాడు. అందువలన ఈ విధమైన వ్యాఖ్యానము గూడ దేవీ భాగవతమున అందించబడినది. బ్రహ్మ దుఃఖమును పోగొట్టుటకై ఫాల భాగమునుండి రుద్రుడుదయించి ఏకాదశ రుద్రులుగ మారి చీకటులను తొలగించి అంతరిక్షము నేర్పరచెను. అవరోధము లేని శక్తి రుద్ర శక్తి. అట్టి శక్తి రూపమును దాల్చునది శ్రీమాతయే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 268 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🍀 64. saṁhāriṇī rudrarūpā tirodhāna-karīśvarī |
sadāśivā'nugrahadā pañcakṛtya-parāyaṇā || 64 || 🍀

🌻 Saṃhārinī संहारिनी (268) 🌻

She causes destruction. Destruction is different from dissolution. The difference between destruction and dissolution is significant. Destruction is the death of a single organism and dissolution is the Supreme process of the Brahman, wherein He makes the entire universe to dissolve and merge unto Himself (nāma 270). This nāma refers to the death of gross bodies and She as the administrator of the universe also causes death.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


23 May 2021

No comments:

Post a Comment