దేవాపి మహర్షి బోధనలు - 88
🌹. దేవాపి మహర్షి బోధనలు - 88 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 69. ఫల త్యాగము 🌻
సత్సాధకునకు త్యాగగుణము శ్రేష్ఠమగు ఆలంబనము. మైనపు వత్తి తాను కరగుచు ఇతరులకు వెలుగు నిచ్చును. కర్పూరము తాను హరింపబడుచు ఇతరులకు క్షేమము నిచ్చును. గంధపు చెక్క తాను అరుగుచు ఇతరులకు చల్లదనాన్ని, పరిమళాన్ని ఇచ్చును. చెఱకుగెడ నమలబడుతుంటే తీపి నిచ్చును. సృష్టిలో త్యాగము వలననే అన్నియు అమృతత్వ స్థితి చెందియున్నవి.
కొందరు వస్తువులను త్యాగము చేసెదరు. కొందరు ధనమును త్యాగము చేసెదరు. ద్రవ్యత్యాగము కన్న భావత్యాగము ముఖ్యము. వాసనలతో కూడిన భావములను త్యాగము చేయుట మొదటి మెట్టు. కర్మఫల త్యాగము తరువాతి మెట్టు. ఆత్మత్యాగము తుదిమెట్టు. అది లోక శ్రేయస్సు నుద్దేశించి చేయువాడే మహాత్ముడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment