నిర్మల ధ్యానాలు - ఓషో - 20


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 20 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అస్తిత్వమొక్కటే మనకు రక్షణ 🍀

అస్తిత్వమొక్కటే మనకు రక్షణ. ధనం, అధికారం, గౌరవం యివేమీకావు. ఏవీ మనకు భద్రతనియ్యవు. కుటుంబం, స్నేహితులు, చివరికి జీవితం కూడా మనకు రక్షణనివ్వదు. మనం అభద్రతతో ఆవహింపబడి వున్నాం. మనకు రక్షణ నిచ్చే ఒకే ఒక విషయముంది. ఆ ఒక విషయం బయట ఎక్కడా కనిపించదు. అది మన లోపల, లోలోతుల్లో మాత్రమే కనిపిస్తుంది.

దేవుడు అక్కడ వుంటాడు. అది దేవుణ్ణి కనిపెట్టే స్థలం. అది నీ హృదయంతర్గత హృదయం ! నీలో దేవుణ్ణి చూడాలంటే నువ్వు అన్ని రక్షణ వలయాల్ని దాటి వెళ్ళాలి. అప్పుడక్కడ ప్రతిదీ భద్రంగా వుంటుంది. రక్షింపబడుతుంది. ప్రతిదీ భద్రంగా రక్షణలో వుంటే దు: ఖం అదృశ్యమవుతుంది. సహజంగా ఆందోళన ఆవిరవుతుంది. గొప్ప పరవశం చిగుళ్ళు తొడుగుతుంది. ఆ ఆనందమే నీ అనంత నిరీక్షణ.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


23 May 2021

No comments:

Post a Comment