శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 279 / Sri Lalitha Chaitanya Vijnanam - 279
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 279 / Sri Lalitha Chaitanya Vijnanam - 279 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 65. భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ ।
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ ॥ 65 ॥ 🍀
🌻 279. 'భగవతీ'🌻
వర్ణింపరాని మాహాత్మ్యము కలది శ్రీమాత అని అర్థము. భగమనగా ఐశ్వర్యము, జ్ఞానము, వైరాగ్యము, త్రికోణము (స్త్రీ యోని), యశస్సు, వీర్యము, క్రియాశక్తి, ఇచ్ఛా, ధర్మము, శ్రీ, ముక్త స్థితి, దేవతలచే పూజింపబడుట, దేవతలను కూడ అనుగ్రహించు శక్తి. ఇట్టి మహిమలు గలది శ్రీమాతయే.
సృష్టి, ప్రళయము, జీవకోట్ల గమనాగమనములు, విద్య అవిద్యల తత్త్వము తెలిసివుండుట వలన కూడ భగవతి అని పిలుతురు. భగవంతుడు భగవతి సర్వాధికారము గల వారికే వర్తించును. ఇట్టి వారిని సృష్టియందు మరి యే శక్తి అధిగమించలేదు. పై తెలిపిన విశేష గుణములన్నీ వివిధ నామములలో మరల వివరింపబడును గనుక ప్రత్యేకముగ నిచ్చట వివరింప నవసరము లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 279 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 65. bhānumaṇḍala-madhyasthā bhairavī bhagamālinī |
padmāsanā bhagavatī padmanābha-sahodarī || 65 || 🍀
🌻 Bhagavatī भगवती (279) 🌻
She is endowed with auspiciousness and power of autonomy of Śiva.
This nāma is an extension of nāma 277. Bhaga refers to six qualities of Śaktī viz. supremacy, righteousness, fame, prosperity, wisdom and discrimination. The nāma means to highlight certain important qualities of the Brahman. She is endowed with these qualities.
There is another set of six qualities and they are creation and destruction, waxing and waning, knowledge and ignorance. It is also said that She is worshipped by all gods and goddesses, therefore She is known as Bhagavatī. In Viṣṇu Sahasranāma, nāma 558 is Bhagavate which carries the same meaning. The masculine gender of Bhagavatī is used in Viṣṇu Sahasranāma.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
15 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment