నిర్మల ధ్యానాలు - ఓషో - 31
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 31 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. జీవితం దేవునికి ప్రత్యామ్నాయం. దేవుడు సృష్టికర్త కాదు. జీవితానికి సృష్టికర్త కాదు. జీవితమే దేవుడు 🍀
దేవుడు జీవితం నించీ వేరుగా లేడు. సృష్టికర్త అన్న అభిప్రాయమే తప్పు. అతను చిత్రకారుడు లాంటివాడు కాడు. ఎందుకంటే చిత్రకారుడు చిత్రానికి వేరుగా వుంటాడు. దేవుడు దాదాపు నాట్యకారుడిలాంటివాడు. అతను నాట్యంతో కలిసి వుంటాడు. అందువల్ల దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన పన్లేదు.
ఈ సమస్త భూమి, ఈ అనంత విశ్వం, దేవుడితో నిండి వున్నాయి. దైవత్వం వాటి నించీ తొణికిసలాడుతోంది. దేవుడు చెట్లలోని ఆకుపచ్చదనం, ఎరుపుదనం, బంగారు రంగు అతనంతటా వ్యాపించి వున్నాడు. నువ్వు అతన్ని వదులుకోలేవు. అనుక్షణం మనమతన్తో కలిసి వున్నాం. మనం దేవుడికి సంబంధించి ఒక అభిప్రాయంతో వున్నాం. ఎక్కడో ఆయన స్వర్గంలో వున్నాడని, మనకు దూరంగా వున్నాడని అనుకుని ఆయన్ని మనకు అందనివాడుగా భావిస్తాం. అందువల్ల దేవుడు మన చేజారిపోతాడు.
అట్లాంటి తెలివితక్కువ అభిప్రాయాన్ని వదులుకుంటే దేవుడు మనకు కనిపిస్తాడు. ప్రతిచోటా కనిపిస్తాడు. ఆయన మన సామీప్యంలో వున్నాడు. ఒకసారి రామకృష్ణ పరమహంసని ఎవరో 'దేవుడెక్కడున్నాడు?” అని అడిగారు. దానికాయన 'దేవుడు ఎక్కడ లేడో నాకు చెప్పు. ఆయన లేని చోటు కోసం నేను వెతుకుతున్నాను. నా ప్రయత్నం విఫలమయింది దేవుడు లేని చోటును యిప్పటి దాకా కనిపెట్టలేకపోయాను' అన్నాడు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
15 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment