వివేక చూడామణి - 88 / Viveka Chudamani - 88


🌹. వివేక చూడామణి - 88 / Viveka Chudamani - 88🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 21. అహంభావము - 4 🍀


302. బ్రహ్మానందమనే ధనాగారము చుట్టూ శక్తివంతమైన, భయంకమైన, 'అహం' అనే సర్పము చుట్టలు చుట్టుకొని తన స్వలాభము కొరకు రక్షించుచున్నది. అందువలన దానికి సత్వ, రజో, తమో గుణములనే మూడు పడగలు కాపలా కాస్తున్నవి. కేవలము జ్ఞాని అయిన యోగి మాత్రమే ఆ త్రిగుణములనే పడగలను తన యొక్క ఆత్మ జ్ఞానమనే ఖడ్గంతో నాశనము చేయగలడని సృతులు పల్కుచున్నవి. అపుడు మాత్రమే బ్రహ్మానందమనే ధనగారమును అనుభవించగలడు.

303. శరీరములో ఏ మాత్రము విష చిహ్నములున్న అట్టి వ్యక్తి ఎలా దాని ప్రభావము నుండి విముక్తి పొందగలడు. యోగి యొక్క అహంకారము కూడా అలానే యోగి యొక్క విముక్తికి అడ్డుగా ఉంటున్నది.

304. పూర్తిగా అహంకారము తొలగిపోయినప్పుడే (అందుకు తత్‌సంబంధమైన మానసిక భావనలు తొలగాలి). అంతర్గత సత్యము యొక్క పూర్ణ జ్ఞానము పొంది, సత్యాసత్యముల విచక్షణ జ్ఞానము వలన 'ఇదే నేను' అను సత్యమును గ్రహించగలడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 88 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 21. Ego Feeling - 4 🌻


302. The treasure of the Bliss of Brahman is coiled round by the mighty and dreadful serpent of egoism, and guarded for its own use by means of its three fierce hoods consisting of the three Gunas. Only the wise man, destroying it by severing its three hoods with the great sword of realisation in accordance with the teachings of the Shrutis, can enjoy this treasure which confers bliss.

303. As long as there is a trace of poisoning left in the body, how can one hope for recovery ? Similar is the effect of egoism on the Yogi’s Liberation.

304. Through the complete cessation of egoism, through the stoppage of the diverse mental waves due to it, and through the discrimination of the inner Reality, one realises that Reality as "I am This".

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


15 Jun 2021

No comments:

Post a Comment