శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 284 / Sri Lalitha Chaitanya Vijnanam - 284
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 284 / Sri Lalitha Chaitanya Vijnanam - 284 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 66. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ।
సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66 ॥ 🍀
🌻 284. 'సహస్రపాత్' 🌻
'సహస్రపాత్' అనగా వెయ్యి పాదములు కలది శ్రీదేవి అని అర్థము. అనగా వెయ్యి మార్గములలో చరించునది. శ్రీదేవి వెయ్యి మార్గములలో చరించును గావున ఆమెను చేరుటకు కూడ వెయ్యి మార్గము లున్నవి. వేయి అనగా అనేకమని ముందు నామములలో సూచించితిమి. వేయి మార్గములు గమ్యమున కుండగా ఒకే మార్గ మున్నదని బోధించుట ఎంతటి మూర్ఖత్వము! మూర్ఖులే యిట్లు పలుకుదురు.
వీరి వలననే సిద్ధాంతములు, మతములు, విరోధములు, యుద్ధములు ఏర్పడినవి. ఏయింటిలోని వారైనా వారి తూర్పు కిటికీ నుండి చూచినపుడు సూర్యు డగుపించును. ఆకాశము కూడ అగుపించును. మా యింటి కిటికీ నుండియే సూర్యుడగుపించును అని భావించుట పరమ మూర్ఖత్వము. భావన దైవమును గూర్చి యున్నప్పుడు, రూపమేదైననూ, నామ మేదైననూ విధాన మేదైననూ గతి గమ్యమును చేర్చును. సిద్ధాంతీకరించుట వెళ్లితనము. ఆకలి తీరుట ముఖ్యము కాని ఏ పదార్థము తినితిమి అని కాదు కదా!
భారతీయ ఋషులు స్వతంత్రించి అనేకానేక విధములుగ దైవ మార్గములను ప్రతిపాదించిరి. అనేకానేక విధముల బోధించిరి. ఇట్లు వైవిధ్యముతో వైభవము కలిగించిరి. వైవిధ్యము వైభవమే. దేవుని సృష్టియందు కూడ వైవిధ్యమున్నది. అనేకానేక పుష్పములు, ఫలములు, వృక్షములు, జంతువులు, ఖనిజములు, జీవులు, గోళములు, దేవతలు, ఋతువు లతో కూడి సృష్టి, వైభవోపేతముగ నున్నది కదా! అట్లే మార్గములు కూడ ఉన్నవని తెలుపుటకే సహస్రపాత్ అను నామము సూచింప బడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 284 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 unmeṣa-nimiṣotpanna-vipanna-bhuvanāvalī |
sahasra-śīrṣavadanā sahasrākṣī sahasrapāt || 66 || 🍀
🌻 Sahasrapād सहस्रपाद् (284) 🌻
She has thousands of feet. Viṣṇu Sahasranāma 227 also conveys the same meaning.
Puruṣasūktam opens by saying “सहस्र-शीर्षा पुरुषः । सहस्राक्षः सहरपात्॥“
The first kūṭa of Pañcadaśī mantra is discreetly revealed in nāma-s 278 to 280. The second and third kūta-s (ह स क ह ल ह्रीं। स क ल ह्रीं॥) of the mantra is revealed in nāma-s 281 to 284.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
30 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment