వివేక చూడామణి - 95 / Viveka Chudamani - 95
🌹. వివేక చూడామణి - 95 / Viveka Chudamani - 95 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 22. కోరికలు, కర్మలు - 5 🍀
324. తుంగ ను అడ్డు తొలగించినప్పటికి అది ఒక క్షణమైనను ఆగదు. మరల అది నీటిని అల్లుకుంటుంది. అలానే మాయ లేక మాలిన్యము జ్ఞానినైనను ఆవహిస్తుంది. ఎపుడైతే అతడు ఆత్మను గూర్చి ధ్యానము చేయడో అంతకాలము ఆ మాయ అతని నుండి తొలగదు.
325. ఎపుడైతే మనస్సు బ్రహ్మము నుండి ఏ కొంచమైనను బయటకు వెళ్ళుటకు మొదలైందంటే అది క్రమముగా ఒక్కొక్క అడుగు క్రిందికి దిగుతుంది. ఎలా నంటే మెట్ల పై నుండి బంతి క్రిందికి జారిన అది ఒక్కొక్క మెట్టు క్రిందపడుతుంది కదా!
326. మనస్సు ఎపుడైతే బాహ్య వస్తు సముదాయమునకు అంటిపెట్టుకొని ఉంటుందో, వాని లక్షణాలు ఆ మనస్సును ఆకర్షించి, వాటిపై కోరికను పుట్టిస్తుంది. ఆ కోరిక వలన వ్యక్తి దాన్ని తీర్చుకొనుటకు ప్రయత్నం చేస్తాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 95 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 22. Desires and Karma - 5 🌻
324. As sedge, even if removed, does not stay away for a moment, but covers the water again, so Maya or Nescience also covers even a wise man, if he is averse to meditation on the Self.
325. If the mind ever so slightly strays from the Ideal and becomes outgoing, then it goes down and down, just as a play-ball inadvertently dropped on the staircase bounds down from one step to another.
326. The mind that is attached to the sense- objects reflects on their qualities; from mature reflection arises desire, and after desiring a man sets about having that thing.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
30 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment