వివేక చూడామణి - 117 / Viveka Chudamani - 117
🌹. వివేక చూడామణి - 117 / Viveka Chudamani - 117🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 26. ఆత్మ మార్పులేనిది - 4 🍀
389. ఆత్మయే లోపల బయట ఉన్నది. ఆత్మయే ముందు వెనుక ఉన్నది. ఉత్తరదక్షిణాలలో ఉన్నది ఆత్మయే. అలానే ఆత్మ పైన క్రింద ఉన్నది.
390. అలలు, నురుగు, సుడులు, బుడగలు మొదలైనవన్నియూ నీరుగాక వేరుకాదు. అదే విధముగా ఆత్మ జ్ఞానము, అన్ని అదే అయి ఉన్నది. శరీరము నుండి అహం వరకు ప్రతిది కేవలము చిత్తో సమానమైనవే.
391. మనస్సుతోనూ, మాటలతోనూ పలికే ఈ విశ్వమంతా బ్రహ్మమే కాని వేరేది కాదు. అట్టి బ్రహ్మము ప్రకృతికి అందనంతదూరములో ఉన్నది. మట్టికుండ, జారు, కూజ ఇవన్నియూ మట్టిలో నుండి తయారైనవే. మోసగించబడిన వ్యక్తి మాత్రమే ‘నీవు’ ‘నేను’ అను భేదముతో మాయ వలన త్రాగిన మత్తులో వాగుతుంటాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 117 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 26. Self is Unchangeable - 4 🌻
389. The Self is within, and the Self is without; the Self is before and the Self is behind; the Self is in the south, and the Self is in the north; the Self likewise is above as also below.
390. As the wave, the foam, the whirlpool, the bubble, etc., are all in essence but water, similarly the Chit (Knowledge Absolute) is all this, from the body up to egoism. Everything is verily the Chit, homogeneous and pure.
391. All this universe known through speech and mind is nothing but Brahman; there is nothing besides Brahman, which exists beyond the utmost range of the Prakriti. Are the pitcher, jug, jar, etc., known to be distinct from the clay of which they are composed ? It is the deluded man who talks of "thou" and "I", as an effect of the wine of Maya.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
17 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment