మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 69


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 69 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ఆనంద సూక్తము -1 🌻


సపర్శ వలన ఆనందమున్నది. ఉద్రేకము వలనా సుకుమార సున్నిత భావావేశముల వల్లనూ ఆనందం కలుగుతుంది. అవగాహన వల్ల కూడ ఆనందోదయమవుతుంది. జ్ఞాన-వివేచన వల్ల కూడ ఆనందం కలుగుతుంది.

ఆనందములోనికి ప్రవేశించుటవల్లనూ ఆనందం, అట్లే ఆనందములో స్థిరపడుట వల్లనూ ఆనందముంది. ఎప్పటికైనా ఎవరైనా కోరవలసినది‌కూడా ఆనందమే కదా!

అయితే స్పర్శ వల్ల ఆనందము కూడా ఆనందమే! అది ఎవరూ కాదనలేరు. శీతాకాలంలో బయట చలిగా ఉంటుంది. అదే మీ కారులో కూర్చున్నామనుకోండి. లోపల వెచ్చగా ఉంటుంది. నాకు ఆనందంగానూ ఉంటుంది. అయితే ఒక విషయం.

మనం దక్షిణ భారతదేశానికి వెళ్ళినప్పుడు గాని లేదా భూమధ్యరేఖా ప్రాంతానికి గాని వెళ్ళినట్లయితే, అదీ మండువేసవిలో అయితే, చల్లని హిమగృహంలో (ఏ.సి. రూములో) కూర్చుంటే మనందరికీ ఆనందంగా ఉంటుంది. దీనినే స్పర్శ వల్ల కలిగే ఆనందమంటారు.

కృష్ణభగవానుడు ఇట్లా అన్నాడు "చలికాలంలో వెచ్చదనం ఆనందమైతే, వేసవిలో చల్లదనం ఆనందమనుకుంటే ఆ ఆనందానికి ప్రామాణికత ఏమిటి? చల్లగా ఉన్నప్పుడు నాకు హాయి అని నేనంటే, అది తప్పనిసరిగా వేసవే అయుండాలి. నేను డెన్మార్కు వెళ్ళేవరకు ఆగి, అక్కడ చలికాలమయితే, ఆనందమంటే ఏమిటో నన్ను అడగండి, వెచ్చదనమే ఆనందమంటారు.

అందువల్ల స్పర్శాసుఖము అని మనం పిలిచే ఆ సుఖంలో ఏదో కొద్ది సత్యము తప్ప పూర్తి నిజం కాదు.

ఆనందము యొక్క పై అంచునుండి క్రమక్రమంగా పై స్థాయిలోని ఆనందానికి వెళ్ళాలనుకొంటున్నారు ప్రజలు. అయితే చివరి మెట్టు చేరేవరకు, ప్రతి ఘట్టములోనూ కలిగే ఆనందం శాశ్వతమైనది కాదు...

.✍️ మాస్టర్ ఇ.కె.🌹

🌹 🌹 🌹 🌹 🌹


17 Aug 2021

No comments:

Post a Comment