వివేక చూడామణి - 118 / Viveka Chudamani - 118


🌹. వివేక చూడామణి - 118 / Viveka Chudamani - 118🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 26. ఆత్మ మార్పులేనిది - 5 🍀


392. సృతులలో చెప్పినట్లు అచట చూసేది, వినేది తెలుసుకొనేది వేరుకాదు. శాశ్వతమైన బ్రహ్మమే. రెండవది ఏదీలేదు. తెలుసుకొనేవాడు, తెలుసుకొనేది, తెలియబడేది అంతా ఒక్కటే.

393. ఉన్నతమైన బ్రహ్మము ఆకాశము వలె స్వచ్ఛము, పూర్ణము, శాశ్వతము, స్థిరము మరియు మార్పులేనిది. లోపల బయట అనేది లేనిది. ఉన్నది ఒక్కటే రెండవది ఏదీలేదు అదే ఒకని యొక్క స్వయం ఆత్మ. అంతకు మించి ఏదైన జ్ఞానము ఉన్నదా? లేదు అని భావము. కర్త, కర్మ కూడా ఆ బ్రహ్మమే అయి ఉన్నది.

394. ఈ విషయాన్ని గూర్చి ఎక్కువగా చెప్పవలసింది ఏముంది. జీవుడు బ్రహ్మము కంటే వేరు కాదు. విస్తరించి ఉన్న ఈ ప్రపంచమంతా బ్రహ్మమే. సృతులు కూడా బ్రహ్మము కంటే వేరుగా ఏదీ లేదని మరియు అది తిరుగులేని సత్యమని చెప్పినవి. ఈ విషయము బ్రహ్మాన్ని పొందిన యోగులు కూడా దృఢపర్చారు. వారు బాహ్య వస్తు సంబంధాలు వదలివేసినారు. వారు స్వచ్ఛముగా బ్రహ్మముతో కలసి జీవిస్తూ శాశ్వతమైన బ్రహ్మానంద స్థితిని అనుభవించుచున్నారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 VIVEKA CHUDAMANI - 118 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj


🌻 26. Self is Unchangeable - 5 🌻


392. The Shruti, in the passage, "Where one sees nothing else", etc., declares by an accumulation of verbs the absence of duality, in order to remove the false superimpositions.

393. The Supreme Brahman is, like the sky, pure, absolute, infinite, motionless and changeless, devoid of interior or exterior, the One Existence, without a second, and is one’s own Self. Is there any other object of knowledge ?

394. What is the use of dilating on this subject ? The Jiva is no other than Brahman; this whole extended universe is Brahman Itself; the Shruti inculcates the Brahman without a second; and it is an indubitable fact that people of enlightened minds who know their identity with Brahman and have given up their connection with the objective world, live palpably unifold with Brahman as Eternal Knowledge and Bliss.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹



19 Aug 2021

No comments:

Post a Comment