మైత్రేయ మహర్షి బోధనలు - 10


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 10 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 7. కృషి - 2 🌻


ఉత్తమమైన సమర్థత కలిగిన వారు కూడ అసూయ ద్వేషముల ద్వారా పతనము చెందుట మనకు ఇతిహాసములుగ కన్పట్టుచునే యున్నది. మార్గానుయాయులు ఈ భావములను కూడ పరిశీలించుకొని నిర్మూలించు కొనుచుండవలెను. జీవులపై ద్వేషము శాపముగ పరిణమించగలదు. మహత్తర కార్యములను చేయసంకల్పించువారు అసూయ, ద్వేషములను పెట్టుబడులుగ కార్యమును నిర్వర్తించినచో ఫలము వైఫల్యమే.

మా బృంద నివాసముల యందు అచ్చటచ్చట హెచ్చరికగ ఈ క్రింది వాక్యము ప్రదర్శింప బడుచున్నది. “ద్వేషించుట సిగ్గు సిగ్గు. ద్వేషించు వాడు సిగ్గుపడ వలెను.” ద్వేషించు వారిని కూడ ప్రేమించు వారే మైత్రేయ సంఘసభ్యులు. ప్రేమించుట మేమొసగు నియమము. ఇది మొదలు కఠినముగనున్నను, ఇది కారణముగ మనస్సు నిర్మలమగును. నిర్మలమైన మనస్సు మాత్రమే పూర్ణచంద్రుని వలె శుద్ధ చైతన్యమును ప్రకాశము నొనర్చును.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


27 Sep 2021

No comments:

Post a Comment