శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 312-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 312-1







🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 312-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 312-1🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀

🌻 312. 'రణత్కింకిణిమేఖలా' - 1🌻


శబ్దము చేయుచున్న చిరుగంటలు గల మొలనూలు గలది శ్రీమాత అని అర్థము. బంగారు మొలత్రాడు మొలకు గట్టుట భారతీయ సంప్రదాయము. పట్టుదారము నుండి బంగారు మొలత్రాడు వరకు శక్యానుసారము అందరునూ ధరించు చుందురు. ఈ సంప్రదాయమునకు ఒక ఉత్తమ మగు విలువ గలదు. కంఠము నుండి కటి ప్రదేశము వరకు మధ్య కూటమని, కటి ప్రదేశమునుండి దిగువ భాగము శక్తి కూటమని ముందు నామములలో వివరింపబడినది.

కంఠము పై భాగము వాగ్భవకూట మని కూడ తెలుపబడినది. వస్త్రధారణము ద్వారా కంఠాభరణము, మొలత్రాడు మానవ శరీరము యొక్క మూడు భాగములను సూత్రప్రాయముగ విభజించుటగ తెలియవచ్చును. శిరస్సు వెలుగు లోకమును సూచించును. అదియే సువర్లోకము. కంఠము నుండి కటి వరకు గల ప్రదేశము భువర్ లోకములను, దిగువ భాగము భూలోకమును సూచించును. మానవుని యందు దివ్యత్వము శిరస్సు నందు, మానవత్వము మధ్యభాగమందు, పశుత్వము దిగువ భాగము నందును అమర్చబడి యున్నదని తెలియవచ్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 312-1 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀

🌻 312-1. Raṇatkiṅkiṇi-mekhalā रणत्किङ्किणि-मेखला (312) 🌻


She is wearing a waistband with small bells hanging from it. The same narration also finds a place in Saundarya Laharī (verse 7) which says, “Your slender waist which is adorned by jingling girdle string (belt-like gold wait ornament called odyāṇa) having small tinkling gold bells attached.”

Therefore the recital given here cannot be the intended interpretation. Possibly this could mean the origin of sound. When She walks, these tiny bells make tinkling sound from where the sound originates.

The sound originates from the naval chakra, where the waist belt is worn. It is also said that the sound originates from the drum (damaru) of Śiva. In the same way it can be said that sound originates from Her waist belt.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


27 Sep 2021

No comments:

Post a Comment