నిర్మల ధ్యానాలు - ఓషో - 77
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 77 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనమే సత్యం. పరిశీలించేవాడే పరిశీలింపబడేది. దీపం నీలోనే వెలుగుతుంది. అదెప్పుడూ అక్కడే వుంది. మనం దాన్ని చూడమంతే. సమస్త అస్తిత్వానికి సంబంధించిన తత్వం కాంతి. దాన్ని కనిపెట్టే ఏకైక మార్గం నిశ్శబ్దంగా కూచుని లోపలికి చూడ్డం. 🍀
సత్యమన్నది ఏదో సాధించాల్సింది కాదు. అది అప్పటికే నీలో వున్నది. మనమే సత్యం. పరిశీలించేవాడే పరిశీలింపబడేది. మనమింత వరకు సత్యాన్ని అన్వేషిస్తూనే వున్నాం. దాన్ని ఎక్కడా చూడలేకపోయాం. అది మనకెక్కడా కనిపించలేదు. అందువల్ల ఇప్పుడు చెయ్యాల్సిన పని బయటదాన్ని వెతకడం ఆపేయడం. దాన్ని కనిపెట్టే ఏకైక మార్గం నిశ్శబ్దంగా కూచుని లోపలికి చూడ్డం. ఇక్కడ ఏదో చెయ్యడమనేది ప్రశ్నకాదు. ఏ పనీ చెయ్యకపోవడమనేది ప్రశ్న. నువ్వు ఏ పనీ చేయని స్థితిలో సంపూర్ణ విశ్రాంతితో వుంటే అది సంభవిస్తుంది. అది కనిపిస్తుంది. అది ఎప్పుడూ అక్కడే వుంది. కానీ ఎప్పుడూ నువ్వక్కడ లేవు. నీతో వున్న క్షణంలోనే అది సంభవిస్తుంది.
దీపం నీలోనే వెలుగుతుంది. అదెప్పుడూ అక్కడే వుంది. మనం దాన్ని చూడమంతే. మనం దాని వైపు వీపును తిప్పుతాం. అందువల్ల చీకట్లోనే వుంటాం. చీకటి మన సృష్టి. తిరిగి మన అంతరంగాన్ని విస్మరించడం. లోపలి ప్రపంచాన్ని మరచిపోవడం. సమస్త అస్తిత్వానికి సంబంధించిన తత్వం కాంతి. అందుకనే పవిత్ర గ్రంథాలన్నీ దేవుణ్ణి కాంతి అంటాయి, వెలుగంటాయి. ఆధునిక సైన్సు కూడా విశ్వం కాంతితో నిర్మింప బడిందంటుంది. ఎలక్ట్రాన్లతో నిండిందంటుంది. యివన్నీ శాస్త్రీయ పారిభాషిక పదాలు. కాంతి అన్నది మరింత కవితాత్మక పదం. కాబట్టి యిప్పటి నించీ నీ ప్రయత్నాలన్నీ లోపలికి ప్రయాణించడానికి సమాయత్తం చేసుకో.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
27 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment