1) 🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 9. సిద్ధిధాత్రి మాత - శ్రీ రాజరాజేశ్వరీ దేవి 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 261 🌹
3) 🌹. శివ మహా పురాణము - 460🌹
4) 🌹 వివేక చూడామణి - 137 / Viveka Chudamani - 137🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -89🌹
6) 🌹 Osho Daily Meditations - 79🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 137 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 137 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 9. సిద్ధిధాత్రి మాత - శ్రీ రాజరాజేశ్వరీ దేవి 🌹*
*జగన్మాత ఆశీస్సులతో మీకు, మీ కుటుంబ సభ్యులకు అన్నింటా విజయం కలగాలని ప్రార్ధిస్తూ,*
*విజయదశమి శుభాకాంక్షలు*
*🌻 . ప్రసాద్ భరద్వాజ*
*🌷. సిద్ధిధాత్రి ప్రార్ధనా శ్లోకము :*
*'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి*
*సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ' *
*🌷. శ్రీ రాజరాజేశ్వరీ దేవి స్తోత్రం : *
*అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీ*
*కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ*
*సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా*
*చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ||*
*🌷. అలంకారము :*
*శ్రీ రాజరాజేశ్వరీ దేవి- ఆకుపచ్చ రంగు*
*🌷. నివేదనం : పరమాన్నం, పిండివంటలు*
*🌷. మహిమ - చరిత్ర :*
*తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది. ఈమె కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగాన్ని పార్వతీ దేవి సాధించినట్టు పురాణకథనం. ఈమెకి ప్రార్ధన చేస్తే పరమానంద దాయకమైన అమృతపథం సంప్రాప్తిస్తుంది.*
*🌻. సాధన :*
*దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’. ఈమె సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో 1) అణిమ, 2) మహిమ, 3) గరిమ, 4) లఘిమ, 5) ప్రాప్తి, 6) ప్రాకామ్యము, 7) ఈశిత్వము, 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొన బడ్డాయి.*
*బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి…*
*1) అణీమ, 2) లఘీమ, 3) ప్రాప్తి, 4) ప్రాకామ్యము, 5) మహిమ, 6) ఈశిత్వ వశిత్వాలు, 7) సర్వకామావసాయిత, 8) సర్వజ్ఞత్వం, 9) దూరశ్రవణం, 10) పరకాయ ప్రవేశం, 11) వాక్‍సిద్ధి, 12) కల్పవృక్షత్వం, 13) సృష్టి, 14) సంహారకరణ సామర్థ్యం, 15) అమరత్వం, 16) సర్వన్యాయకత్వం, 17) భావన మరియు 18) సిద్ధి.*
*సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.*
*నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవ రోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే. తొమ్మిదవ రోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులూ కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది.*
*ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతీ వ్యక్తీ ప్రయత్నించాలి. ఈ మాత దయా ప్రభావంవల్ల అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు.*
*నవదుర్గల్లో ‘సిద్ధిదాత్రి’ అవతారం చివరిది. మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం ముగియగానే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయి. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు.*
*దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.*
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -261 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 5
*🍀 5. యోగమహిమ - ప్రాణికోట్లన్నియు పాత్రల వంటివి. అందుండెడి ప్రాణ మొక్కటియే. ఇట్లు ఒకే తత్త్వము యొక్క యోగ మహిమచేత అనేకముగ అది గోచరించుచు నున్నది. నిజమున కున్నది ఒకే ఒక మహాచైతన్యము. అది తన యోగమహిమచే అనేకముగ గోచరించు చున్నది. అనేకమగుటకు అవస్థితు లేర్పడుచున్నవి. రూపాంతరములు చెందుచున్నవి. ఎన్ని విధములుగ గోచరించినను వాటన్నిటికిని మూలమొక్కటే. మూలము దర్శించు వానికి దానిపై ఏర్పడి, మార్పు చెందుచున్న సమస్తము మహిమాన్వితముగ గోచరించును. మూలమును దర్శించుటయే రాజవిద్య. అది గుహ్యతమము. 🍀*
నచమఠాని భూతాని పశ్య మే యోగ మైశ్వరమ్ |
భూతభృన్న చ భూతస్థా మమాత్మా భూతభావనః || 5
తాత్పర్యము : నా యోగ ఐశ్వర్యమును చూడుము. ఆ యోగ మహిమ నందే సమస్త ప్రాణికోట్లును భరింప బడి యున్నవి. ఉత్పన్న మొనర్చుట, ప్రాణికోట్ల యందుండుట ఇత్యాదివన్నియు ఆ మహిమ నుండియే జరుగుచున్నవి. అవి యన్నియు నాయందే యున్నప్పటికిని వానియందు నేనున్నానను భావన నాకు లేదు.
వివరణము : ముందు తెలిపిన శ్లోకమునకు మరికొంత వివరణమే యిచట యున్నది. ముందు తెలిపిన ఉదాహరణలలో వెండితెరకు సినిమా లేదు. సినిమాకు మాత్రము వెండితెర యున్నది. బంగారమునకు ఉంగరము లేదు. కాని ఉంగరమునకు బంగార మున్నది. సముద్రమునకు అల లేదు. కాని అలకు సముద్ర మున్నది. ఈశ్వరునకు జీవుడు లేడు. కాని జీవున కీశ్వరుడున్నాడు. ఈ వాక్యములను ధ్యానించుటయే మార్గము కాని వివరించుట మార్గము కానేరదు.
అయినప్పటికిని మరియొక ఉదాహరణము : గోదావరి నదిలో ఒక చెంబు ముంచినచో చెంబులో గోదావరి యున్నట్లు వుండును. చెంబులో గోదావరి, చెంబు ఉపరితలము పై ప్రవహించు గోదావరికి తేడా లేదు. చెంబులో గోదావరి వంటగదిలో పెట్టు కొన్నచో మడి నీళ్ళగును. బిందెలో పోసుకొని త్రాగినపుడు మంచి నీరగును. నిజమునకు అది గోదావరి జలమే. దానికి చెంబులో ఉండుట, బిందెలో ఉండుట తేడా లేదు. ప్రాణికోట్లన్నియు పాత్రల వంటివి. అందుండెడి ప్రాణ మొక్కటియే.
ఇట్లు ఒకే తత్త్వము యొక్క యోగ మహిమచేత అనేకముగ అది గోచరించుచు నున్నది. నిజమున కున్నది ఒకే ఒక మహాచైతన్యము. అది తన యోగమహిమచే అనేకముగ గోచరించు చున్నది. అనేకమగుటకు అవస్థితు లేర్పడుచున్నవి. రూపాంతరములు చెందుచున్నవి. ఎన్ని విధములుగ గోచరించినను వాటన్నిటికిని మూలమొక్కటే.
ఆవిరి నీరై, నీరు మంచుగడ్డ అయినపుడు అందలి మూలమొక్కటే. మూలము దర్శించు వానికి దానిపై ఏర్పడి, మార్పు చెందుచున్న సమస్తము మహిమాన్వితముగ గోచరించును. ఈశ్వరుని యోగ మహిమను దర్శించుచు ఆనందించుము. మూలమును దర్శించుటయే రాజవిద్య. అది గుహ్యతమము. ఎప్పటికప్పుడు మరపు సహజముగ వచ్చును. మరచినపుడెల్ల గుర్తు తెచ్చుకొనుటయే మార్గము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 460🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 32
*🌻. సప్తర్షుల రాక - 4 🌻*
ఓ మహర్షులారా! వారి పుత్రికను నేను వివాహమాడ గోరుచున్నాను. ఈ వివాహము నాకంగీకారమే. బ్రహ్మ అట్టి వరమును ఇచ్చి యున్నాడు (36). ఈ విషములో అధిక ప్రసంగముతో బని యేమి గలదు? మీరు మేనా హిమవంతులకు బోధించి దేవతలకు హితమును చేగూర్చుడు (37). మీచే కల్పించబడిన కన్యావరణ విధికంటె అధికమగు వరణమును చేసినట్లగును. ఇది మీ కార్యమే గనుక, దీనిని సిద్ధిపంజేయుటలో మీ భాగము ఉండవలెను (38).
బ్రహ్మ ఇట్లు పలికెను-
పవిత్రమగు హృదయము గలవారు, ప్రభుని అనుగ్రహమును పొందినవారు అగు ఆ మునులందరు ఈ మాటలను విని ఆనందమును పొందిరి (39). మేము ధన్యులము, అన్ని విధములా కృతకృత్యులము అయినాము. మేము అందరికీ ప్రత్యేకించి వందనీయులము, పూజింపదగినవారము అయినాము (40).
బ్రహ్మవిష్ణువులచే నమస్కరింపబడువాడు, సర్వకార్యములను సిద్ధింప జేయువాడు అగు శివుడు, లోకములకు సుఖమును కలుగజేయు కార్యమునకు పంపదగినవారము మేము అని తలంచి మమ్ములను పంపుచున్నాడు (41). ఈ శివుడు లోకములకు ప్రభువు, తండ్రి. ఆమె తల్లి. ఈ యోగ్యమగు సంబంధము శుక్లపక్షచంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమగు గాక! (42)
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఆ దేవర్షులు అపుడు శివునకు నమస్కరించి ఆకాశమార్గముచే హిమవంతుని రాజధానికి వెళ్లిరి (43). ఆ ఋషులు ఆ దివ్య నగరమును చూచి మిక్కలి ఆశ్చర్యమును పొంది వారిలో వారు తమ భాగ్యమును ఇట్లు వర్ణించిరి (44).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 137 / Viveka Chudamani - 137🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 27. విముక్తి - 10 🍀*
449. ఆత్మను తెలుసుకొన్న తరువాత అది దేనికి అంటకుండా తటస్ధముగా ఆకాశముగా ఉండుటచే, సాధకుడు చేసిన కర్మలు తనకు ఏ మాత్రము అంటవు.
450. సారాయి యొక్క వాసనకు ఆకాశము ఏ మాత్రము స్పందించదు. దానికి పాత్రతో మాత్రము సంబంధము ఉంటుంది. అలానే ఆత్మ కూడా ప్రాపంచిక వస్తు వాసనలకు స్పందించదు.
451. బ్రహ్మా జ్ఞానము పొందక ముందే వ్యక్తి శరీరమునకు సంబంధించిన కర్మలు చేసిన అతడు తరువాత ఆ బ్రహ్మ జ్ఞానము పొందినచో ఆ కర్మల ఫలితములు నశించవు. దాని ఫలితములను అనుభవించక తప్పదు. బాణము తగిలిన వస్తువు దాని ఫలితము అనుభవించవలసిందే కదా!
452. బాణము ఒక వస్తువును తాకినట్లు, ‘అది పులి అనుకొని లేక అది ఆవు అయినప్పటికి’ దానిని పూర్తిగా పరీక్షించిన తరువాత మాత్రమే బాణము వేయాలి. లేనిచో ఆ బాణము బలంగా దానిపై నాటుకొనును కదా!
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 137 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 27. Redemption - 10 🌻*
449. Realising the Atman, which is unattached and indifferent like the sky, the aspirant is never touched in the least by actions yet to be done.
450. The sky is not affected by the smell of liquor merely through its connection with the jar; similarly, the Atman is not, through Its connection with the limitations, affected by the properties thereof.
451. The work which has fashioned this body prior to the dawning of knowledge, is not destroyed by that knowledge without yielding its fruits, like the arrow shot at an object.
452. The arrow which is shot at an object with the idea that it is a tiger, does not, when that object is perceived to be a cow, check itself, but pierces the object with full force.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 89 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. చేయవలసినది- చేయదలచినది - 5 🌻*
*ప్రతి ఇంటిలోను ఒక దేవుని మందిరం ఏర్పాటు చేసికొన వలసినది. దేవుని ఏర్పాటు చేసికొన్న స్థానం (ప్రదేశం) ఒకటి తప్పనిసరిగా ఉండాలి. అని ఇన్ని దేశాల వారు నియమంగా పెట్టుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మన దేశంలోను దేవుని గూర్చి సాధన లేని ఇళ్ళుకూడా కొన్ని ఉన్నాయి. నాస్తికుల విషయం నేను చెప్పటం లేదు. నాస్తికులకి మనం చెప్పుకొంటున్న దానికి పెద్ద భేదం ఏం లేదు.*
*నాస్తికుడు తదేక ధ్యానంతో తన మతాన్ని ఆరాధిస్తున్నాడు కనుక మన కన్నా కొంచెం ఆస్తికుడి క్రిందనే లెక్క అని మనం తెలుసుకోవాలి. ఎందుకనగా ఎప్పుడైతే తదేక నిష్ఠ ఉన్నదో దాని పేరే అస్తికం. ఇప్పుడు ఆస్తికుల కన్నా నాస్తిక మతాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తూన్న వాళ్ళకి తదేక నిష్ఠ, దాని యందు ఆరాధన హెచ్చుగా ఉన్నది కనుక వాళ్ళకు తెలియకుండానే వాళ్ళలో ఆస్తికమతం ఆరంభమవుతూ ఉన్నది. దాని గురించి అనవలసిన విషయం ఏమీ లేదు.*
*దాన్ని ఎదుర్కొనుటలో పాషండులమవుతూ మన కర్తవ్యం మనం మరచిపోతాం. అది కూడా మనం చేయకూడదు. భగవంతుని లీల అయిన, క్రీడలయిన భాగములుగా ఇన్నింటిని తెలిసికొని ఈ ప్రార్థనను మన దినచర్యలో నిత్యము అనుష్ఠానము చేసికొని అమలుపరచుకొనవలెను.*
*......✍️. మాస్టర్ ఇ.కె.🌻*
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 78 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 78. CYPRESS IN THE COURTYARD 🍀*
*🕉 The fact if this moment is what true religion is all about. So if you are feeling sad, then that is the cypress in the courtyard Look at it ... just look at it. There is nothing else to be done. 🕉*
There is a very famous story about a Zen master, Chou Chou. A monk asked him, "What is true religion?" It was a full-moon night and the moon was rising. The master remained silent for a long time; he didn't say anything. And then suddenly he came to life and said, "Look at the cypress in the courtyard." A beautiful cool breeze was blowing and playing with the cypress and the moon had just come above the branch. It was beautiful, incredible. It was almost impossible that it could be so beautiful. But the monk said, "This was not my question. I'm not asking about the cypress in the courtyard, or about the moon or its beauty.
My question has nothing to do with this. I am asking what true religion is. Have you forgotten my question?" The master again remained silent for a long time. Then again he came to life and said, "Look at the cypress in the courtyard." True religion consists of the here and now. The fact of this moment is what true religion is all about. So if you are feeling sad, then that is the cypress in the courtyard. Look at it ... just look at it. There is nothing else to be done. That very look will reveal many mysteries. It will open many doors.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 137 / Sri Lalita Sahasranamavali - Meaning - 137 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 137. దేశకాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ*
*సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ ॥ 137 ॥ 🍀*
🍀 703. దేశకాలపరిచ్ఛిన్నా :
దేశకాలములచే మార్పు చెందినది
🍀 704. సర్వగా :
సర్వవ్యాపిని
🍀 705. సర్వమోహినీ :
అందరిని మోహింప చేయునది
🍀 706. సరస్వతీ :
విద్యాస్వరూపిణి
🍀 707. శాస్త్రమయీ :
శాస్త్రస్వరూపిణి
🍀 708. గుహాంబా :
కుమారస్వామి తల్లి
🍀 709. గుహ్యరూపిణి :
రహస్యమైన రూపము కలిగినది
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 137 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 137. Desha kala parichinna sarvaga sarvamohini*
*Sarsvati shastramaei guhanba guhyarupini ॥ 137 ॥ 🌻*
🌻 703 ) Desa kala parischinna -
She who is not divided by region or time
🌻 704 ) Sarvaga -
She who is full of everywhere
🌻 705 ) Sarva mohini -
She who attracts every thing
🌻 706 ) Saraswathi -
She who is the goddess of knowledge
🌻 707 ) Sasthra mayi -
She who is the meaning of sciences
🌻 708 ) Guhamba -
She who is mother of Lord Subrahmanya (Guha)
🌻 709 ) Guhya roopini -
She whose form is hidden from all
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment