మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 89


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 89 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 5 🌻


ప్రతి ఇంటిలోను ఒక దేవుని మందిరం ఏర్పాటు చేసికొన వలసినది. దేవుని ఏర్పాటు చేసికొన్న స్థానం (ప్రదేశం) ఒకటి తప్పనిసరిగా ఉండాలి. అని ఇన్ని దేశాల వారు నియమంగా పెట్టుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మన దేశంలోను దేవుని గూర్చి సాధన‌ లేని ఇళ్ళుకూడా కొన్ని ఉన్నాయి. నాస్తికుల విషయం నేను చెప్పటం లేదు. నాస్తికులకి మనం చెప్పుకొంటున్న దానికి పెద్ద భేదం ఏం లేదు.

నాస్తికుడు తదేక ధ్యానంతో తన మతాన్ని ఆరాధిస్తున్నాడు కనుక మన కన్నా కొంచెం ఆస్తికుడి క్రిందనే లెక్క అని మనం తెలుసుకోవాలి. ఎందుకనగా ఎప్పుడైతే తదేక నిష్ఠ ఉన్నదో దాని పేరే అస్తికం. ఇప్పుడు ఆస్తికుల కన్నా నాస్తిక మతాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తూన్న వాళ్ళకి తదేక నిష్ఠ, దాని యందు ఆరాధన హెచ్చుగా ఉన్నది కనుక వాళ్ళకు తెలియకుండానే వాళ్ళలో ఆస్తికమతం ఆరంభమవుతూ ఉన్నది. దాని గురించి అనవలసిన విషయం ఏమీ‌‌ లేదు.

దాన్ని ఎదుర్కొనుటలో పాషండులమవుతూ మన కర్తవ్యం మనం మరచిపోతాం. అది కూడా మనం చేయకూడదు. భగవంతుని లీల అయిన, క్రీడలయిన భాగములుగా ఇన్నింటిని తెలిసికొని ఈ ప్రార్థనను మన దినచర్యలో నిత్యము అనుష్ఠానము చేసికొని అమలుపరచుకొనవలెను.

......✍️. మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


15 Oct 2021

No comments:

Post a Comment