మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 90
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 90 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. చేయవలసినది- చేయదలచినది - 6 🌻
మన నిత్యజీవితంలో మనం ఒకరినొకరం చేసికొనే వాటిలో ఉద్యోగ ధర్మములు, వృత్తి ధర్మములు ఉన్నాయి. వీటిని అనుష్ఠించు కొనేటప్పుడు పెద్దలు పరోపకారమను ప్రక్రియను మనకు ప్రసాదించినారు.
ఈ పరోపకారము వలననే భగవత్పరమైన ఆరాధనా విశేషం సాధ్యమవుతుంది. దీని ద్వారానే ఆనంద సామ్రాజ్యం స్థాపింపబడుతుంది.
ప్రార్థన చేసికొనుటగానీ, సాధన చేసికొనుట గానీ, యోగాభ్యాసము గానీ ఒంటరిగా చేయరాదు.
ఇదికూడా గుర్తుంచుకొనవలెను. ఒక్కడు గదిలో కూర్చుని చేసికొంటే కుండలినీ సిద్ధి అవుతుందని గానీ, మంత్రసిద్ధి అవుతుందని గానీ పొరపాటు పడరాదు.
మనకు వేదయుగమునందు యజ్ఞాశాలలు కలవు. అందులో పది మంది కూర్చుని చేయు యజ్ఞములు, పరిషత్తులు మొదలగు ఆరాధనా విశేషములు కూడా కలవు.
ఒక్కడే కూర్చుని మౌనంగా ధ్యానం చేయుట అనునది వేదకాలంలొ ఎక్కడా ఉన్నట్లు మనకు కనిపించదు.
ఒకవేళ స్నానం చేస్తూ అనుష్ఠానం చేసినా, దోసిలితో నీళ్ళు తీసికొని సూర్యభగవానునికి సమర్పణం చేస్తూ మనసా, వాచా, కర్మణా ముక్తకంఠంతో ఉచ్చరిస్తూ ఆరాధన చేశారు గానీ మనస్సులో మంత్రమును ధ్యానం చేసెననుట వేదకాలములో మనకు ఎక్కడా తెలియరాదు.
......✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
17 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment