17-OCTOBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 17, ఆదివారం, ఆక్టోబర్ 2021 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 262 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 461🌹 
4) 🌹 వివేక చూడామణి - 138 / Viveka Chudamani - 138🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -90🌹  
6) 🌹 Osho Daily Meditations - 79 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 138 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 138 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*17 ఆదివారం, అక్టోబర్‌ 2021*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ సూర్య స్తుతిః -1 🍀*

నమః సూర్యస్వరూపాయ ప్రకాశాత్మస్వరూపిణే |
భాస్కరాయ నమస్తుభ్యం తథా దినకృతే నమః || 1 ||

శర్వరీహేతవే చైవ సంధ్యాజ్యోత్స్నాకృతే నమః |
త్వం సర్వమేతద్భగవన్ జగదుద్భ్రమతా త్వయా || 2 ||
🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు, అశ్వీజ మాసం
తిథి: శుక్ల ద్వాదశి 17:40:45 వరకు తదుపరి శుక్ల త్రయోదశి
పక్షం: శుక్ల-పక్ష
నక్షత్రం: శతభిషం 09:54:12 వరకు తదుపరి
పూర్వాభద్రపద
యోగం: వృధ్ధి 21:38:06 వరకు తదుపరి ధృవ
కరణం: బాలవ 17:42:44 వరకు
వర్జ్యం: 16:32:12 - 18:12:00
దుర్ముహూర్తం: 16:19:11 - 17:06:05
రాహు కాలం: 16:25:03 - 17:52:59
గుళిక కాలం: 14:57:07 - 16:25:03
యమ గండం: 12:01:16 - 13:29:12
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24
అమృత కాలం: 02:31:42 - 04:09:46 మరియు
26:31:00 - 28:10:48 ?
సూర్యోదయం: 06:09:34, సూర్యాస్తమయం: 17:52:59
వైదిక సూర్యోదయం: 06:13:10
వైదిక సూర్యాస్తమయం: 17:49:24
చంద్రోదయం: 16:05:51, చంద్రాస్తమయం: 03:13:32
సూర్య రాశి: కన్య, చంద్ర రాశి: కుంభం
యోగాలు-ఫలితాలు
రాక్షస యోగం - మిత్ర కలహం 09:54:12 వరకు 
తదుపరి చర యోగం - దుర్వార్త శ్రవణం 
పండుగలు : ప్రదోష వ్రతం, తుల సంక్రాంతి.
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -262 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 6-1
 
*🍀 6. రాజవిద్య -1 - నేను ఆధారముగ ఏర్పడిన సమస్త ప్రాణికోట్లకు కదలిక యున్నది. క్షరత్వమున్నది. అవస్థితులు ఉన్నవి. ఆకాశమునకు వాయువు ఆదిగా గల నాలుగు భూతముల కార్యక్రమముతో ఎట్టి సంబంధము లేదు. కాని ఆకాశము లేనిదే వానికస్థిత్వము లేదు, వ్యాపారమును లేదు. అట్లే నేనాధారముగ నేర్పడిన ప్రాణి కోట్ల హెచ్చుతగ్గులతో, ఒడుదొడుకులతో నాకెట్టి సంబంధము లేదు. నీ యందు నేను ఈశ్వరుడనై యుండుట వలన నీ చేష్టలు, నీ ప్రాణస్పందనలు నడుచు చున్నవి. నేను లేనిచో నీవు లేవు. నీ చేష్టలతో నాకు పని లేదు. ఆకాశము నుండి వాయు వేర్పడినట్లు, నానుండి నీవేర్పడినావు. 🍀*

యథా కాశస్థితో నిత్యం వాయు స్సర్వత్రలో మహాన్ |
తథా సర్వాణి భూతాని మఠానీ త్యుపధారయ II 6

తాత్పర్యము : ఏ ప్రకారముగ అంతటను చరించు వాయువు ఆకాశము నందు స్థితిగొని యున్నదో, అట్లే సమస్త ప్రాణులును నా యందు స్థితిగొని యున్నవి అని తెలుసుకొనుము. 

వివరణము : ఆకాశము నుండి వాయువేర్పడి అంతటను సంచరించు చున్నది. అందుండి పుట్టిన అగ్ని పోషించుట, దహించుట నిర్వర్తించు చున్నది. అగ్నినుండి పుట్టిన నీరు భూమిపై ప్రాణికోట్లను పోషించుచు నున్నది. జలములనుండి పుట్టిన భూమి ఓషధులను, ఇతర దినుసులను, కూరలు పండ్లు ఫలములు వంటి వానిని ఉత్పత్తి చేసి జీవ పోషణమునకు వినియోగపడు చున్నది. 

ఇట్లు ఆకాశము నుండి వరుస క్రమమున పుట్టిన నాలుగు భూతములు సృష్టి యందు నిమగ్నమై యున్నవి. ఆకాశము వాటికి అతీతముగ నున్నది. ఆకాశము స్థిరము, నిత్యముగ నున్నది. అందుండి పుట్టిన వానికి అస్థిరత్వము, జీరత్వము ఉన్నవి. ఆకాశమెప్పుడును ఆకాశముగనే యున్నది. దానికవస్థితి లేదు. ఒకే విధముగ వెలుగుచు నుండును. కాని మిగిలిన నాలుగు భూతములకు అనంతమగు వ్యాపారము లున్నవి. 

అట్లే నేను ఆధారముగ ఏర్పడిన సమస్త ప్రాణికోట్లకు కదలిక యున్నది. క్షరత్వమున్నది. అవస్థితులు ఉన్నవి. ఆకాశమునకు వాయువు ఆదిగా గల నాలుగు భూతముల కార్యక్రమముతో ఎట్టి సంబంధము లేదు. కాని ఆకాశము లేనిదే వానికస్థిత్వము లేదు, వ్యాపారమును లేదు. అట్లే నేనాధారముగ నేర్పడిన ప్రాణి కోట్ల హెచ్చుతగ్గులతో, ఒడుదొడుకులతో నాకెట్టి సంబంధము లేదు. నీ యందు నేను ఈశ్వరుడనై యుండుట వలన నీ చేష్టలు, నీ ప్రాణస్పందనలు నడుచు చున్నవి. నేను లేనిచో నీవు లేవు. నీ చేష్టలతో నాకు పని లేదు. ఆకాశము నుండి వాయు వేర్పడినట్లు, నానుండి నీవేర్పడినావు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 461🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 32

*🌻. సప్తర్షుల రాక - 5 🌻*

ఋషులిట్లు పలికిరి -

మనము ఈ హిమవంతుని రాజధానిని దర్శించుట, శివుడు స్వయముగా ఇట్టి కార్యమునందు మనలను నియోగించుట మన పుణ్యము. మనము ధన్యులము (45). ఈ నగరము అలకానగరము కంటె, స్వరగము కంటె, భోగవతీ నగరము కంటె, మరియు అమరావతి కంటె ఉత్తమమైనదిగా కన్పట్టుచున్నది (46). 

గృహములు అందముగ నున్నవి. వాకిళ్లు వివిధములగు శ్రేష్ఠ స్ఫటికములతో, మరియు మణులతో పొదుగబడి రంగులనీను చున్నవి (47). ప్రతిగృహమునందు సూర్యకాంతమణులు, చంద్రకాంతమణులు, మరియు స్వర్గమునందు పెరిగే విచిత్రములగు వృక్షములు గలవు (48).

ప్రతిగృహమునందు తోరణములు శోభిల్లుచుండెను. గృహములు చిలుకలతో, హంసలతో, విమానములతో చిత్ర విచిత్రములగు రంగులతో విరాజిల్లెను (49). రంగు రంగుల వస్త్రముల తోరణములతో గూడి వితానములు (బాల్కనీలు) ప్రకాశించెను. అనేక జలాశయములు, వివిధములగు దిగుడుబావులు గలవు (50). 

ఉద్యానములు రంగురంగుల పుష్పములతో ప్రకాశించెను. అచటి పురుషులందరు దేవతలు. స్త్రీలందరు అప్సరసలు (51). కర్మభూమియందు యాజ్ఞికులు, పౌరాణికులు హిమవంతుని రాజధానిని వీడి స్వర్గము కొరకై వ్యర్థముగా యజ్ఞాదుల ననుష్ఠించుచున్నారు (52). ఇది కంటబడనంత వరకు మాత్రమే మానవులు స్వరగ్గమును కోరెదరు. ఓ విప్రులారా! దీనిని చూచిన తరువాత స్వర్గముతో ప్రయోజనమేమున్నది? (53)

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ ఋషిశ్రేష్ఠులు ఆ నగరమునిట్లు వర్ణిస్తూ సర్వసంపదలతో విలసిల్లే హిమవంతుని గృహమునకు వారందరు వెళ్లిరి (54). దూరములో ఆకాశమునందు గొప్ప తేజస్సుతో సూర్యుని వలె వెలుగొందే ఆ ఏడ్గురు మునులను చూచి చకితుడైన హిమవంతుడిట్లనెను (55). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 138 / Viveka Chudamani - 138🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 28. ప్రారబ్దము - 1 🍀*

453. ప్రారబ్దము యొక్క ఫలితము తప్పకుండా చాలా బలముగా ఉంటుంది. అది విముక్తి పొందినవానికైనను దాని ఫలితములను అనుభవించవలసిందే. అయితే గతములో పేరుకు పోయిన కర్మల ఫలితములు ఇంకా అనుభవించనిచో అవి జ్ఞానాగ్నిలో దగ్దమై పోగలవు. గతం, వర్తమానము, భవిష్యత్తులలో జరిగే ఏ కార్యముల యొక్క ఫలితమైనను పూర్తిగా జ్ఞానములో ఉన్న వ్యక్తిని బాధించలేవు. అవన్ని బ్రహ్మములోకి మారిపోతాయి. 

454. యోగి తాను పూర్తిగా బ్రహ్మములో జీవిస్తున్నచో అతనిని ఎట్టి ప్రారబ్దము కూడా ఏమియూ చేయజాలరు. ఎలానంటే ఒక వ్యక్తి కలలో తాను చేసిన ఏ కర్మలైనను అతను మెల్కొన్న తరువాత అవి ఉండదు కదా! 

455. నిద్ర మెల్కొన్న వ్యక్తి ఎప్పటికి ‘నేను’ ‘నాది’ అని కలలోని వస్తువులను గూర్చి పలకడు. అతడు తన ఎఱుక జీవితమును మాత్రమే గడుపుచుండును. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 138 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 28. Fate - 1 🌻*

453. Prarabdha work is certainly very strong for the man of realisation, and is spent only by the actual experience of its fruit; while the actions previously accumulated and those yet to come are destroyed by the fire of perfect knowledge. But none of the three at all affects those who, realising their identity with Brahman, are always living absorbed in that idea. They are verily the transcendent Brahman.

454. For the sage who lives in his own Self as Brahman, the One without a second, devoid of identification with the limiting adjuncts, the question of the existence of Prarabdha work is meaningless, like the question of a man who has awakened from sleep having any connection with the objects seen in the dream-state.

455. The man who has awakened from sleep never has any idea of "I" or "mine" with regard to his dream-body and the dream-objects that ministered to that body, but lives quite awake, as his own Self.
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 90 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. *చేయవలసినది- చేయదలచినది - 6* 🌻

మన నిత్యజీవితంలో మనం ఒకరినొకరం చేసికొనే వాటిలో ఉద్యోగ ధర్మములు, వృత్తి ధర్మములు ఉన్నాయి. వీటిని అనుష్ఠించు కొనేటప్పుడు పెద్దలు పరోపకారమను ప్రక్రియను మనకు ప్రసాదించినారు. 

ఈ పరోపకారము వలననే భగవత్పరమైన ఆరాధనా విశేషం సాధ్యమవుతుంది. దీని ద్వారానే ఆనంద సామ్రాజ్యం స్థాపింపబడుతుంది. 

ప్రార్థన చేసికొనుటగానీ, సాధన చేసికొనుట గానీ, యోగాభ్యాసము గానీ ఒంటరిగా చేయరాదు. 

ఇదికూడా గుర్తుంచుకొనవలెను. ఒక్కడు గదిలో కూర్చుని చేసికొంటే కుండలినీ సిద్ధి అవుతుందని గానీ, మంత్రసిద్ధి అవుతుందని గానీ పొరపాటు పడరాదు. 

మనకు వేదయుగమునందు యజ్ఞాశాలలు కలవు. అందులో పది మంది కూర్చుని చేయు యజ్ఞములు, పరిషత్తులు మొదలగు ఆరాధనా విశేషములు కూడా కలవు. 

ఒక్కడే కూర్చుని మౌనంగా ధ్యానం చేయుట అనునది వేదకాలంలొ ఎక్కడా ఉన్నట్లు మనకు కనిపించదు. 

ఒకవేళ స్నానం చేస్తూ అనుష్ఠానం చేసినా, దోసిలితో నీళ్ళు తీసికొని సూర్యభగవానునికి సమర్పణం చేస్తూ మనసా, వాచా, కర్మణా ముక్తకంఠంతో ఉచ్చరిస్తూ ఆరాధన చేశారు గానీ మనస్సులో మంత్రమును ధ్యానం చేసెననుట వేదకాలములో మనకు ఎక్కడా తెలియరాదు.
......✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 79 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 79. DOING NOTHING 🍀*

*🕉 If you can do nothing, that is the best. 🕉*

One needs much courage to do nothing. To do does not need much courage, because the mind is a doer. The ego always hankers to do something-worldly or otherworldly, the ego always wants to do something. If you are doing something, the ego feels perfectly right, healthy, moving, enjoying itself. Nothing is the most difficult thing in the world, and if you can do that, that's the best. The very idea that we have to do something is basically wrong. We have to be, not to do.

All that I suggest to people that they do is just to come to know the futility of doing, so that one day out of sheer tiredness they flop on the ground and they say, "Now it is enough! We don't want to do' anything." And then the real work starts. The real work is just to be, because all that you need is already given, and all that you can be you are. You don't know yet, that's true. So all that is needed is to be in such a silent space that you can fall into yourself and see what you are. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 138 / Sri Lalita Sahasranamavali - Meaning - 138 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 138. సర్వోపాధి వినిర్ముక్తా సదాశివపతివ్రతా ।*
*సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణీ ॥ 138 ॥ 🍀*

🍀 710. సర్వోపాధివినిర్ముక్తా :
 ఏరకమైన శరీరము లేనిది 

🍀 711. సదాశివపతివ్రతా : 
శివుని భార్య 

🍀 712. సంప్రదాయేశ్వరీ : 
అన్ని సంప్రదాయములకు అధీశ్వరి 

🍀 713. సాధ్వీ : 
సాధుస్వభావము కలిగినది 

🍀 714. గురుమండలరూపిణీ : 
గురుపరంపరా స్వరూపిణి   

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 138 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 138. Sarvopadhivinirmukta sadashiva pativrata
Sanpradayeshvari sadhvi gurumandala rupini ॥ 138 ॥ 🌻*

🌻 710 ) Sarvo padhi vinirmuktha -   
She who does not have any doctrines

🌻 711 ) Sada shiva pathi vritha -   
She who is devoted wife for all times to Lord Shiva

🌻 712 ) Sampradhayeshwari -   
She who is goddess to rituals or She who is goddess to teacher-student hierarchy

🌻 713 ) Sadhvi -   
She who is innocent

🌻 714 ) Guru mandala roopini -   
She who is the universe round teachers

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment