వివేక చూడామణి - 167 / Viveka Chudamani - 167


🌹. వివేక చూడామణి - 167 / Viveka Chudamani - 167 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -14 🍀

545. ఆనందము గాని, బాధగాని లేకుండా, మంచి చెడులతో పని లేకుండా ఎల్లపుడు అన్నింటిలో ఉంటూ బ్రహ్మజ్ఞాని తాను శారీరక సృహ అనేది లేకుండా జీవిస్తాడు.

546. బాధ, ఆనందము, మంచి, చెడులు అనేవి ఎవరైతే శరీరమే తానను భావముతో ఉంటాడో అతనికి మాత్రమే ఉంటాయి. వాటిని అతడు తనకు వర్తింపజేసుకుంటాడు. ఏవిధంగా మంచి,చెడులు వాటి ఫలితాలు యోగిని స్పర్శించగలవు? ఎవడైతే తనను తాను స్వచ్ఛమైన ఆత్మగా భావిస్తాడో, అతనిని ఏవిధమైన బంధనాలు బాధించవు.

547. రాహువు సూర్యుని మ్రింగివేసినట్లు కనిపిస్తుంది కాని అది నిజానికి సూర్యునికి అడ్డుగా నిలుస్తుంది. కేవలము మాయ వలన ప్రజలు సూర్యుని అసలు నిజాన్ని తెలుసుకొనలేకున్నారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 VIVEKA CHUDAMANI - 167 🌹

✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda
📚 Prasad Bharadwaj

🌻 32. I am the one who knows Brahman -14 🌻

545. Neither pleasure nor pain, nor good nor evil, ever touches this knower of Brahman, who always lives without the body-idea.

546. Pleasure or pain, or good or evil, affects only him who has connections with the gross body etc., and identifies himself with these. How can good or evil, or their effects, touch the sage who has identified himself with the Reality and thereby shattered his bondage ?

547. The sun which appears to be, but is not actually, swallowed by Rahu, is said to be swallowed, on account of delusion, by people, not knowing the real nature of the sun.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


15 Dec 2021

No comments:

Post a Comment