2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 291 🌹
3) 🌹. శివ మహా పురాణము - 490🌹
4) 🌹 వివేక చూడామణి - 167 / Viveka Chudamani - 167🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -119🌹
6) 🌹 Osho Daily Meditations - 108 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 167 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 167🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 15, డిసెంబర్ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ సిద్ధగణపతి ధ్యానం 🍀*
*పక్వచూతఫలపుష్పమంజరీ ఇక్షుదండతిలమోదకైస్సహ |*
*ఉద్వహన్ పరశుమస్తు తే నమః శ్రీ సమృద్ధియుత హేమపింగళః || 7 ||*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: శుక్ల ద్వాదశి 26:02:54
వరకు తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: భరణి 31:35:36 వరకు
తదుపరి కృత్తిక
యోగం: శివ 31:17:27 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: బవ 12:48:04 వరకు
వర్జ్యం: 15:26:36 - 17:14:12
దుర్ముహూర్తం: 11:48:55 - 12:33:20
రాహు కాలం: 12:11:08 - 13:34:23
గుళిక కాలం: 10:47:52 - 12:11:07
యమ గండం: 08:01:21 - 09:24:36
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:33
అమృత కాలం: 26:12:12 - 27:59:48
సూర్యోదయం: 06:38:05
సూర్యాస్తమయం: 17:44:09
వైదిక సూర్యోదయం: 06:42:08
వైదిక సూర్యాస్తమయం: 17:40:16
చంద్రోదయం: 15:04:27
చంద్రాస్తమయం: 03:16:15
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మేషం
కాల యోగం - అవమానం 31:35:36
వరకు తదుపరి సిద్ది యోగం -
కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
పండుగలు : లేవు
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -291🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 17-2
*🍀 17-2. ప్రణవ స్వరూపుడు - ఏ వస్తువు నందు ఈశ్వరుని దర్శింతురో ఆ వస్తువు పవిత్రమని తెలుయుట జ్ఞానము. పవిత్రమగు వస్తువుల యందు కూడ ఈశ్వర దర్శనము కానపుడు వాని పవిత్రత అంతంత మాత్రమే. ఈశ్వరుని దర్శింపక ఇతరములన్నియు దర్శించుట దౌర్భాగ్యము. సమస్త సృష్టి ఈశ్వర నిర్మితమగుటచే, సమస్తము పవిత్రమే అని తెలుయుట రాజవిద్య. 🍀*
*పితా హమస్య జగతో మాతా ధాతా పితామహః |*
*వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవ చ || 17*
*తాత్పర్యము : ఈ జగత్తునకు తండ్రిని నేనే. తల్లి, తండ్రి, తాత కూడ నేనే. ఓంకారము నేనే. అన్నిటి యందు తెలిసికొనదగినది నేనే. పవిత్ర పదార్థముగ నున్నది నేనే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే.*
*వివరణము : పవిత్రమగు వస్తువులను ఆదరించుట చేతురు గాని, అందలి ఈశ్వరుని చూడరు. కుంకుమ, పసుపు, గంధము, అక్షతలు, సాంబ్రాణి, దీపము, పంచపాత్ర, హరివేణము, ఉద్ధరిణ- ఇట్లనేక పవిత్ర వస్తువులను వాడుచు నుందుము. ఎందుకు పవిత్రమని అడిగినచో, శుభము కలిగించునని సమాధానము చెప్పెదము. శుభమెందులకు కలిగించును? అని ప్రశ్నించినచో, పెద్దలు చెప్పిరి అందుము. నిజమునకు అందీశ్వర సాన్నిధ్యము ప్రస్ఫుటముగ నుండును.*
*ఈశ్వరుని దర్శింపక ఇతరములన్నియు దర్శించుట దౌర్భాగ్యము. ఏ వస్తువు నందు ఈశ్వరుని దర్శింతురో ఆ వస్తువు పవిత్రమని తెలుయుట జ్ఞానము. పవిత్రమగు వస్తువుల యందు కూడ ఈశ్వర దర్శనము కానపుడు వాని పవిత్రత అంతంత మాత్రమే. సమస్త సృష్టి ఈశ్వర నిర్మితమగుటచే, సమస్తము పవిత్రమే అని తెలుయుట రాజవిద్య.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 490 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 38
*🌻. వివాహ మండపము - 4 🌻*
అదే విధముగా విష్ణువుకొరకై మహాప్రకాశము గలది, దివ్యమైనది, అనేకములగు ఆశ్చర్యములతో గూడినది అగు అపర వైకుంఠము నాతడు క్షణములో నిర్మించెను (32). మరియు ఆ విశ్వకర్మ అద్భుతము, ఉత్తమము, దివ్యము, సర్వసంపదలతో విలసిల్లునది అగు గృహమును ఇంద్రుని కొరకు నిర్మించెను (33). అదే విధముగా ఆతడు లోకపాలుర కొరకు సుందరమైనవి, దివ్యమైనవి, అద్భుతమైనవి, పెద్దవి అగు గృహములను సంతోషముతో నిర్మించెను (34). అతడు ఇతర దేవతలందరికీ కూడా విచిత్రములగు గృహములను వరుసగా నిర్మించెను (35).
శివుని నుండి గొప్ప వరములను పొందినవాడు, మహాబుద్ధిశాలి అగు విశ్వకర్మ శివునకు పూర్తిగా సంతోషమును కలిగించుట కొరకై క్షణములో గృహమును నిర్మించెను (36). చిత్రమైనది, గొప్పగా ప్రకాశించునది, దేవతలచే పూజింపబడునది, శివుని చిహ్నములు గలది, శివలోక హర్మ్యమును పోలియున్నది, మిక్కిలి సుందరమైనది అగు గృహమును ఆతడు శివుని కొరకు నిర్మించెను (37). ఈ విధముగా విశ్వకర్మ శివుని ప్రీతికొరకై విచిత్రము, అత్యాశ్చర్యకరము, గొప్ప ప్రకాశము గలది అగు రచనను ప్రదర్శించెను (38).
ఈ విధమగు లౌకిక వ్యవహారమునంతనూ పూర్తి చేసుకొని, ఆ హిమవంతుడు ఆనందముతో శంభుని రాకను నిరీక్షించుచుండెను (39). ఓ దేవర్షీ! ఈ తీరున నీకు హిమవంతుని ఆనందదాయకమగు చరిత్రనంతనూ చెప్పియుంటిని. ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? (46)
శ్రీ శివ మహాపురాణములో రుద్రసంహిత యందలి పార్వతీఖండములో ముప్పది ఎనిమిదవ అద్యాయము వివాహమండప వర్ణనమను పేరు గలది ముగిసినది (38).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 167 / Viveka Chudamani - 167 🌹*
*✍️ రచన : పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -14 🍀*
*545. ఆనందము గాని, బాధగాని లేకుండా, మంచి చెడులతో పని లేకుండా ఎల్లపుడు అన్నింటిలో ఉంటూ బ్రహ్మజ్ఞాని తాను శారీరక సృహ అనేది లేకుండా జీవిస్తాడు.*
*546. బాధ, ఆనందము, మంచి, చెడులు అనేవి ఎవరైతే శరీరమే తానను భావముతో ఉంటాడో అతనికి మాత్రమే ఉంటాయి. వాటిని అతడు తనకు వర్తింపజేసుకుంటాడు. ఏవిధంగా మంచి,చెడులు వాటి ఫలితాలు యోగిని స్పర్శించగలవు? ఎవడైతే తనను తాను స్వచ్ఛమైన ఆత్మగా భావిస్తాడో, అతనిని ఏవిధమైన బంధనాలు బాధించవు.*
*547. రాహువు సూర్యుని మ్రింగివేసినట్లు కనిపిస్తుంది కాని అది నిజానికి సూర్యునికి అడ్డుగా నిలుస్తుంది. కేవలము మాయ వలన ప్రజలు సూర్యుని అసలు నిజాన్ని తెలుసుకొనలేకున్నారు.*
*సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 167 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*
*🌻 32. I am the one who knows Brahman -14 🌻*
*545. Neither pleasure nor pain, nor good nor evil, ever touches this knower of Brahman, who always lives without the body-idea.*
*546. Pleasure or pain, or good or evil, affects only him who has connections with the gross body etc., and identifies himself with these. How can good or evil, or their effects, touch the sage who has identified himself with the Reality and thereby shattered his bondage ?*
*547. The sun which appears to be, but is not actually, swallowed by Rahu, is said to be swallowed, on account of delusion, by people, not knowing the real nature of the sun.*
*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 167 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*
*🌻 32. I am the one who knows Brahman -14 🌻*
*545. Neither pleasure nor pain, nor good nor evil, ever touches this knower of Brahman, who always lives without the body-idea.*
*546. Pleasure or pain, or good or evil, affects only him who has connections with the gross body etc., and identifies himself with these. How can good or evil, or their effects, touch the sage who has identified himself with the Reality and thereby shattered his bondage ?*
*547. The sun which appears to be, but is not actually, swallowed by Rahu, is said to be swallowed, on account of delusion, by people, not knowing the real nature of the sun.*
*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 119 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 4 🌻*
*జీవుల ప్రవర్తనలు, సమాజగతిలో సన్నివేశాలు మున్నగు అలల వెనుక అనంతకాలమనే సాగరాన్ని దర్శించి, లోక కల్యాణమునకై దీక్ష వహించేవారు విష్ణుధర్మాన్ని అవలంబించి, ధన్యులవుతారు. వీరు కాలస్వరూపుడగు వాసుదేవుని మంద్రజాలంలో పరవశిస్తుంటారు. ఇట్టి వారి ద్వారా వాసుదేవుడు తన సాన్నిధ్యాన్ని వ్యక్తం చేయడంతో, వీరిని చేరినవారికి ఆనందం, శాంతి కలుగుతాయి.*
*ఇదియే సత్యం కాని, మొత్తం లోకంతా ఒక్కసారిగా విష్ణుధర్మావలంబులు కావడం జరుగదు. అసలు తనను తానే ఉద్ధరించుకోలేని నరుడు లోకాన్ని ఉద్ధరిస్తాననడం పిచ్చి మాత్రమే. ఆ దృక్పథమే రోగ గ్రస్తమగు మనోవైఖరి. జీవులకు యోగక్షేమాలను ప్రసాదించేది వారి వారి కర్మలను బట్టి వాసుదేవుడే కాని ఇంకెవరూ కాదు.*
....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 108 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 108. MUDDLE-HEADED 🍀*
*🕉 Lao Tzu says: I am a muddle-headed man. When everybody is clear, only I am unclear; when everybody seems to be intelligent, I am stupid. 🕉*
*What Lao Tzu means is that he does not calculate about his life--he lives it. He lives like any animal, like any tree, like any bird. He lives it simply, without figuring out what it is and where it is leading. Anywhere is good; even nowhere is good. Put your mind aside. It will be difficult, but it can be done. This is one of the crucial problems for the modern mind--putting cleverness aside. You need to be a little more wild. That will bring great innocence to you; that will make you ready to jump into a great love.*
*It need not be with anybody in particular, but it should be just a passionate love-for life, for existence, or for any human being. It could be for painting, poetry, dance, music, drama, anything--but a great, passionate love that becomes your whole life, in which you are so totally absorbed that nothing is left outside: so you and your love become one. That will be the transformation for you. Fear is there, but don't choose fear. Those who choose fear destroy themselves. Let the fear be there; in spite of it, go into love.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 167 / Sri Lalita Sahasranamavali - Meaning - 167 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 167. వీరగోష్ఠీప్రియా, వీరా, నైష్కర్మ్యా, నాదరూపిణీ ।*
*విజ్ఞాన కలనా, కల్యా విదగ్ధా, బైందవాసనా ॥ 167 ॥ 🍀*
🍀 895. వీరగోష్టేప్రియా :
వీరభక్తులు చేయు తీవ్రసాధన యెందు ప్రీతి కలిగినది
🍀 896. వీరా :
వీరత్వము కలిగినది
🍀 897. నైష్కర్మ్యా :
కర్మబంధము లేనిది
🍀 898. నాదరూపిణీ :
ఓంకారస్వరూపిణి
🍀 899. విఙ్ఞాన కలానా :
విఙ్ఞాన స్వరూపిణి
🍀 900. కల్యా :
మూలకారణము
🍀 901. విదగ్ధా :
గొప్ప సామర్ధ్యము కలిగినది
🍀 902. బైందవాసనా :
బిందువు ఆసనముగా కలిగినది
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 167 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 167. Vira goshti priya vira naish karmya nadarupini*
*Vigynanakalana kalyavidagdha vhaindavasana ॥ 167 ॥ 🌻*
🌻 895 ) Veera goshti priya -
She who likes company of heroes
🌻 896 ) Veera -
She who has valour
🌻 897 ) Naish karmya -
She who does not have attachment to action
🌻 898 ) Nadha roopini -
She who is the form of sound
🌻 899 ) Vignana kalana -
She who makes science
🌻 900 ) Kalya -
She who is expert in arts
🌻 901 ) Vidhagdha -
She who is an expert
🌻 902 ) Baindavasana -
She who sits in the dot of the thousand petalled lotus
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment