నిర్మల ధ్యానాలు - ఓషో - 119
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 119 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. వ్యక్తి అహం కోసం కాక సంపూర్ణత కోసం జీవించాలి. వ్యక్తి దైవానికి వాహికగా వుండాలి. ఏకత్వంతో వుండడమంటే ఏమీ లేనితనంతో వుండడమే. వ్యక్తి చెయ్యాల్సింది అదే. 🍀
దైవత్వాన్ని ఆవిష్కరించడమంటే సన్యాసాన్ని నిర్వచించడమే. వ్యక్తి అహం కోసం కాక సంపూర్ణత కోసం జీవించాలి. వ్యక్తి దైవానికి వాహికగా వుండాలి. ఖాళీగా వున్న వెదురు బొంగుగా వుండాలి. దైవం అతన్ని పిల్లంగ్రోవిగా మారుస్తాడు. ఏకత్వంతో వుండడమంటే ఏమీ లేనితనంతో వుండడమే. వ్యక్తి చెయ్యాల్సింది అదే. వ్యక్తి తన కోసమే తను ఏమీ లేనితనంగా మారాలి. వ్యక్తి తకకోసమే తను ఏమీ లేనితనంగా మారాలి. వ్యక్తి శూన్యంగా వుంటే మార్మికమయిందేదో జరగడం ఆరంభమవుతుంది. అది వర్ణనాతీతం.
నక్షత్రాల కవతలిదేదో నీలో ప్రవేశిస్తుంది. నీగుండా అజ్ఞాతశక్తి గానం చేస్తుంది. నీగుండా నాట్యం చేస్తుంది. ఆ అజ్ఞాత శక్తే దేవుడు. దేవుడు ఒక వ్యక్తి కాదు. అది అజ్ఞాతానికి పేరు. మార్మికమయిన దానికి మరో పేరు. అది అవగాహనకి అతీతం. ఎట్లాంటి మేధస్సయినా దాన్ని అవగాహన చేసుకోలేదు. మార్మికమయిన రహస్యమయిన దాన్ని తెలుసుకోవడానికి సౌందర్యభరితమయిన, దయాపూరితమయిన జీవితాన్ని జీవించాలి. లేని పక్షంలో జనం జీవితాన్ని కోల్పోతారు. నాట్యం చేయడం కోల్పోతారు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
05 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment