విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 536 / Vishnu Sahasranama Contemplation - 536



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 536 / Vishnu Sahasranama Contemplation - 536 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 536. మహాశృఙ్గః, महाशृङ्गः, Mahāśr‌ṅgaḥ 🌻

ఓం మహాశృఙ్గాయ నమః | ॐ महाशृङ्गाय नमः | OM Mahāśr‌ṅgāya namaḥ

మహాశృఙ్గః, महाशृङ्गः, Mahāśr‌ṅgaḥ

మత్స్యరూపేణ మహతి శృఙ్గే ప్రలయవారిధౌ ।
చిక్రీడ నావం బద్ద్వేతి మహాశృఙ్గ ఇతీర్యతే ॥

పెద్దదియగు శృంగము (పెద్ద కొమ్ము) ఇతనికి క్రీడా స్థానముగా నుండెను. మత్స్యరూపి యగుచు ప్రళయకాలపు మహా సముద్రమున తన మహా శృంగము నందు నావను కట్టి క్రీడించెను.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::

వ. కని, జలచరేంద్రుని కొమ్మున నొక్కపెనుఁ బాఁపత్రాట న న్నావఁ గట్టి, సంతసించి డెందంబు నివురుకొని తపస్వులుం దాను నారాచపెద్ద మీనాకారుండగు వేల్పుఱేని నిట్లని పొగడం దొడంగె. (722)

మ. తమలోఁ బుట్టు నవిద్య గప్పిగొనుడుం దన్మూలసంసార వి
బ్రములై కొందరు దేలుచుం గలఁగుచున్ బల్వెంటలన్ దైవ యో
గమునం దే పరమేశుఁ గొల్చి ఘనులై కైవల్యసంప్రాప్తులై
ప్రమదంబందుదు రట్టి నీవు కరుణం బాలింపు మ మ్మీశ్వరా! (723)




సత్యవ్రతుడు ఒక పెద్దపామును త్రాడుగా చేసి ఆ ఓడను మహామత్స్యం కొమ్ముకు కట్టివేసినాడు. సంతోషంతో హృదయాన్ని పదిలపరచుకొన్నాడు. ఋషులతో పాటు అతడు విష్ణువును క్రింది విధంగా పొగడసాగినాడు.

ఓ భగవంతుడా! తమలో ఆవరించిన అజ్ఞానం వల్ల కొందరు సంసారసాగరంలోపడి చిక్కుకొని మోసపోయి కలత పడతారు. కోరికలను వెన్నంటుతారు. అటువంటివారు అదృష్టంవల్ల పరమాత్ముడవైన నిన్ను సేవించి మోక్షాన్ని పొంది సంతోషపడతారు. ఆ విధంగా అందరినీ ఆదరించే నీవు మమ్ములను కాపాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 536 🌹

📚. Prasad Bharadwaj

🌻 536. Mahāśr‌ṅgaḥ 🌻

OM Mahāśr‌ṅgāya namaḥ

मत्स्यरूपेण महति शृङ्गे प्रलयवारिधौ ।
चिक्रीड नावं बद्द्वेति महाशृङ्ग इतीर्यते ॥

Matsyarūpeṇa mahati śr‌ṅge pralayavāridhau,
Cikrīḍa nāvaṃ baddveti mahāśr‌ṅga itīryate.

The One sporting a big horn. During His Matsyāvatāra or incarnation as a great fish, He sported in the waters of great deluge binding the boat with only life to His great horn.


:: श्रीमद्भागवते अष्टमस्कन्धे चतुर्विंशोऽध्यायः ::

सोऽनुध्यातस्ततो राज्ञा प्रादुरासीन्महार्णवे ।
एकशृङ्गधरो मत्स्यो हैमो नियुतयोजनः ॥ ४४ ॥


Śrīmad Bhāgavata - Canto 8, Chapter 24

So’nudhyātastato rājñā prādurāsīnmahārṇave,
Ekaśr‌ṅgadharo matsyo haimo niyutayojanaḥ. 44.


Then, while the King (Satyavrata) constantly meditated upon the Supreme Personality of Godhead, a large golden fish appeared in the ocean of inundation. The fish had one horn and was inconceivably long.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥

Maharṣiḥ kapilācāryaḥ kr‌tajño medinīpatiḥ,Tripadastridaśādhyakṣo mahāśr‌ṃgaḥ kr‌tāntakr‌t ॥ 57 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


05 Jan 2022

No comments:

Post a Comment