మైత్రేయ మహర్షి బోధనలు - 53
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 53 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 41. అహంకార వలయము - 1 🌻
మా బృందము నుండి సమాజ శ్రేయస్సుకై, సంఘమున దేహము ధరించు మహాత్ముడు రకరకముల కష్టనష్టములకు గురి అగును. మొసళ్ళ కోనేటిలో ప్రవేశించినట్లు అతని జీవితము నడచును. సర్వమునకు సిద్ధమై పరహితబుద్ధితో త్యాగనిరతితో మా బృంద సభ్యుడు భౌతిక శరీరమును గొనుటకు సంసిద్ధుడగును. నీటి యందలి ఈ మొసళ్ళు సంఘమునందలి అహంకారులు. అహంకారము, ధనము ఈ అహంకారులను క్రూరులుగ కూడ తయారుచేయుచున్నది. పరికించి చూడగ ఈ క్రూరత్వము పదవులను, అధికారమును, ధనమును అంటిపెట్టుకొని యున్నట్లు గోచరించును. వీరి వలన సంఘమున ఎట్టి శ్రేయోదాయకమైన కార్యములు నెరవేరవు.
అహంకారి తనకు తానే శత్రువు. ఇతరులకు ఉపయోగపడు పనులు అతని వలన జరుగవు. అతని భావనా సముదాయ మంతయు అతని మేలుకొఱకే పని చేయుచుండును. అందరి మేలును కోరుచున్నా మనుచు తమ మేలును పెంపొందించు కొందురు. కట్టలు తెగిన అహంకారముతో తమకందినంత మేర జీవులను, ప్రదేశములను, దేశములను కబళింతురు. ఆతురతతో సమస్తమును, కబళించుటకు వీరు చేయు యత్నము వెనుక మిక్కుటమైన భీతి యున్నది.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
05 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment