మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 148


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 148 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మానవజన్మము - విశిష్టత -1 🌻


జీవరాశులన్నింటిలోను తనది ఉత్తమ జన్మ అని మానవుడు భావిస్తూ ఉంటాడు. కారణమేమంటే వృక్షములను, జంతువులను కూడ తన అదుపులో పెట్టుకొని తనకు అనుకూలమైన విధంగా ఉపయోగించుకొనే మేధాశక్తి తనకున్నది.‌ దీని వలన అన్ని జీవరాశులను తన వశంలో పెట్టుకోగలడు మానవుడు. సనాతన ధర్మప్రవర్తకులైన ఋషులు మాత్రం మానవజన్మ అన్ని జీవులలోను దుర్లభమైనదని, అది చక్కని అవకాశమని చెప్పారు.

మొదట మానవజన్మ‌ మనకెందుకు కలిగిందనే విషయాన్ని అవగతం చేసుకోవాలి. కేవలం అన్నపానీయాదులు స్వీకరించడం, నిద్రించడం, స్త్రీ పురుష సంయోగం ఇంత మాత్రమే అయితే జంతు జన్మకి మానవజన్మకి భేదమే లేదు. ఇన్ని లక్షల జీవరాశుల జన్మలు గడచి మానవ జన్మలోకి ప్రవేశించిన తరువాత తన జన్మకు ప్రత్యేక లక్ష్యమేది? దీనిని గుర్తించడం మానవుని మొదటి కర్తవ్యం.

...✍️ మాస్టర్ ఇ.కె.

🌹 🌹 🌹 🌹 🌹


11 Feb 2022

No comments:

Post a Comment