శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 347 / Sri Lalitha Chaitanya Vijnanam - 347


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 347 / Sri Lalitha Chaitanya Vijnanam - 347🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀


🌻 347. 'విమలా'🌻


మలములచే తాకబడనిది విమల అని అర్థము. శ్రీమాత మలములచే తాకబడనిది. ఆకలిదప్పులు ప్రధాన మగు మలములు. దరిద్రము మలము. అష్ట దరిద్రములు గలవు. అవి అన్నియూమలములే. కామక్రోధాది అరిషడ్వర్గములు మలములు. అతిక్రమించు కామము మలము. వికారమగు మనోభావములు మలములు. అధర్మము, అవినీతి మల భావములు. అధిక్రమించు రజస్సు, తమస్సులు (రజస్తమస్సులు) మలములు. మలముల మొత్తమును అవిద్య అందురు. కనుక అవిద్య మలము, మలములకు సమగ్ర నిర్వచనము. అజ్ఞానమే అవిద్య. అది కారణముగనే అహంకారము గట్టిపడును. అప్పుడు రజస్తమస్సులు సత్వము కన్న బలము కలవై వర్తించును. వానికి లోబడిన అహంకార పురుషుడు వికారమగు భావములు కలిగి అష్ట బంధములను సమకూర్చుకొనును. అష్ట కష్టములు పడును.

అట్టి నరుడు త్రికరణ శుద్ధిగ శ్రీమాతను ఆరాధింప ప్రారంభించినచో క్రమముగ అవిద్య తొలగును. విమలుడగును. త్రిగుణములకు లోనైన జీవు లందరూ కూడ అహంకారమను ఆవరణమున వసింతురు. అవిద్యకిది ప్రథమావరణము. త్రిగుణములకు ఆవల శుద్ధచైతన్య స్వరూపిణిగ శ్రీమాత యున్నది. ఈవల అహంకారులై జీవు లున్నారు. అహంకారావరణము దాటినచో జీవులు విమలత్వము చెందగలరు. అట్లు పొందుటకు శ్రీమాత అనుగ్రహమే ఉపాయము. అనుగ్రహమును పొందుటకు నిత్య చింతన, ఆరాధన జరుగవలెను. శ్రీమాత అనుగ్రహించినచో ఎట్టి వారైననూ విమలత్వమును పొందగలరు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 347 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala
Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻

🌻 347. Vimalā विमला (347) 🌻


She is devoid of impurities. Mala means impurities arising out of ignorance. When She is the embodiment of knowledge, there is no question of impurities arising out of ignorance. The same meaning is also conveyed in nāma 135. Vi (वि) as a prefix to a word conveys the opposite meaning of the word. For example, mala means impurities and vi-mala means devoid of impurities.

Interpretation for nāma 135 nirmalā is repeated here. Mala means dirt arising out of impure matter. She is without such dirt. In nāma (134) impurity arising out of mind was discussed and in nāma 135 impurities arising out of matter is being discussed. It is to be recalled that mind and matter is Śaktī. Mala is a sense of imperfection that leads to ignorance about the soul and hampers the free expression of the Supreme Self. This ignorance is caused by ego which is called āṇava-mala.

This nāma says that if one gets rid of attachments towards matter and by dissolving ego, knowledge is attained. Presence of mala causes avidyā (lack of knowledge) which leads to confusion, dirt and darkness. This darkness etc can be dispelled by meditating on Her, thereby acquiring knowledge.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 Feb 2022

No comments:

Post a Comment