1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 11, శుక్రవారం, ఫిబ్రవరి 2022 భృగు వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 23-3 - 320 🌹
3) 🌹. శివ మహా పురాణము - 518🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -148🌹
5) 🌹 Osho Daily Meditations - 137🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 347 / Sri Lalitha Chaitanya Vijnanam - 347 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*బృగు వాసరే, 11, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం - 9 🍀*
*17. అస్మాభిస్తవ రూపలక్షణ గుణాన్వక్తుం కథం శక్యతే |*
*మాతర్మాం పరిపాహి విశ్వజనని కృత్వా మమేష్టం ధ్రువమ్*
*18. దీనార్తిభీతం భవతాపపీడితం ధనైర్విహీనం తవ పార్శ్వమాగతమ్ |*
*కృపానిధిత్వాన్మమ లక్ష్మి సత్వరం ధనప్రదానాద్ధననాయకం కురు*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఫలాసక్తి లేని కర్తవ్యము ఆచరించినపుడు మాత్రమే సంచిత కర్మ నశించి జన్మకు కారణము నశించును. 🍀*
*పండుగలు మరియు పర్వదినాలు : లేవు*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
శిశిర ఋతువు, మాఘ మాసం
తిథి: శుక్ల-దశమి 13:53:37 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: మృగశిర ఉ 6:38:18 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: వైధృతి 19:48:21 వరకు
తదుపరి వషకుంభ
కరణం: గార 13:51:37 వరకు
సూర్యోదయం: 06:44:35
సూర్యాస్తమయం: 18:16:05
వైదిక సూర్యోదయం: 06:48:15
వైదిక సూర్యాస్తమయం: 18:12:24
చంద్రోదయం: 13:43:40
చంద్రాస్తమయం: 02:27:25
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: వృషభం
వర్జ్యం: 09:51:24 - 11:39:48
దుర్ముహూర్తం: 09:02:53 - 09:48:59
మరియు 12:53:23 - 13:39:29
రాహు కాలం: 11:03:54 - 12:30:20
గుళిక కాలం: 08:11:02 - 09:37:28
యమ గండం: 15:23:12 - 16:49:38
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 20:41:48 - 22:30:12
మానస యోగం - కార్య లాభం ఉ 6:38:18
వరకు తదుపరి పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PANCHANGUM
#DAILYCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -320 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 23 -3 📚*
*🍀 23-3. త్రికరణశుద్ధి - యాంత్రికముగ దైవారాధన చేయువారికి ఎట్టి వికాసము ఏర్పడదు. మూఢ నమ్మకములు, అంధ విశ్వాసములు, దైవమును గూర్చిన భయము ఇత్యాదివి వారిని బంధించి సంప్రదాయములకు బద్ధులను చేయును. కనుక ఆరాధన విషయమున భక్తి శ్రద్ధలు ప్రధానము. త్రికరణశుద్ధిగ ఆరాధన చేయుటయే భక్తి శ్రద్ధ యుతమైన ఆరాధన. అట్టి వారియందు దైవమే ప్రసన్నుడై జ్ఞాన వైరాగ్య యోగమార్గములను క్రమముగ పరిచయము చేయును. త్రికరణ శుద్ధిగల మూర్తుల ననేకులను దైవము మహా జ్ఞానులు గను, మహర్షులుగను తీర్చిదిద్దినాడు. వాల్మీకి, కాళిదాసు అట్టి వారు. వారెంత మూర్ఖులైనప్పటికిని, వారి త్రికరణశుద్ధియే వారికి వరమై సర్వజ్ఞతకు దారి చూపెను. 🍀*
*23. యో వ్యన్య దేవతాభక్తా యజంతే శ్రద్ధయాన్వితా: |*
*తే2 పి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకమ్ ||*
*తాత్పర్యము : విధి పూర్వకము కాకున్నను, భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఇతర దేవతలను ఆరాధించుచున్నారో, వారు కూడ నన్నే ఆరాధించు చున్నారు.*
*వివరణము : జ్ఞానముచే అజ్ఞానము దహింపబడగ, పరిమితమగు తన అవగాహన క్రమముగ అపరిమితము అగుచుండును. నిరాకరణ తగ్గుచు నుండును. అన్నిటి యందును దైవమును చూచు ప్రయత్న మారంభమగును. ఇట్లు సంభవించుటకు భక్తి శ్రద్ధలు ప్రధానము. యాంత్రికముగ దైవారాధన చేయువారికి ఎట్టి వికాసము ఏర్పడదు. మూఢ నమ్మకములు, అంధ విశ్వాసములు, దైవమును గూర్చిన భయము ఇత్యాదివి వారిని బంధించి సంప్రదాయములకు బద్ధులను చేయును. కనుక ఆరాధన విషయమున భక్తి శ్రద్ధలు ప్రధానము. త్రికరణశుద్ధిగ ఆరాధన చేయుటయే భక్తి శ్రద్ధ యుతమైన ఆరాధన. అట్టి వారియందు దైవమే ప్రసన్నుడై జ్ఞాన వైరాగ్య యోగమార్గములను క్రమముగ పరిచయము చేయును.*
*వారి భక్తి శ్రద్ధలకు ముచ్చటపడి, వాత్సల్యముతో దైవమే దారి చూపుట అనుగ్రహము. త్రికరణ శుద్ధిగల మూర్తుల ననేకులను దైవము మహా జ్ఞానులు గను, మహర్షులుగను తీర్చిదిద్దినాడు. వాల్మీకి, కాళిదాసు అట్టి వారు. వారెంత మూర్ఖులైనప్పటికిని, వారి త్రికరణశుద్ధియే వారికి వరమై సర్వజ్ఞతకు దారి చూపెను. ఈ శ్లోకము, ఈ రహస్యమును ఆవిష్కరించుచున్నది. ఇచ్చట భక్తి శ్రద్ధలనగా త్రికరణ శుద్ధియే. లౌక్యము, తెలివితేటలుగల వారికన్న త్రికరణశుద్ధి గలవారే దైవమునకు ప్రీతిపాత్రులు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 518 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 44
*🌻. మేన యొక్క మంకు పట్టు - 4 🌻*
మేన ఇట్లు పలికెను -
నే నామెను కత్తితో నరికి వేయుటకైనా సిద్ధమే గాని, ఆమెను శంకరునకు ఈయను. మీరందరు దూరముగా పొండు. నా సమీపమునకు రావద్దు (38).
బ్రహ్మ ఇట్లు పలికెను -
మిక్కిలి దుఃఖితురాలగు ఆమె ఏడుస్తూ ఇట్లు పలికి మిన్నకుండెను. ఓ మునీ! ఆమె ప్రవర్తనను చూచి అచట ఉన్న వారందరు హాహాకారమును బిగ్గరగా చేసిరి (39). అపుడచటకు కంగారు పడుతూ హిమవంతుడు వచ్చెను. అతడు ఆమెకు సత్యమును ప్రేమతో బోధించి సర్దిచెప్పుటకు యత్నించెను (40).
హిమవంతుడిట్లు పలికెను -
ఓ మేనా! ప్రియురాలా! ఇప్పుడు నా మాటను వినుము. నీవు దుఃఖించుచుంటివేల ? ఎవరెవరు ఇంటికి వచ్చిరి? వారిని నీవెట్లు నిందించుచుంటివి? (41). శంకరుడు నీకు తెలిసిన వాడే. అనేక నామములను రూపములను ధరించు ఆ శంభుని భయంకర రూపమును చూచి నీవు కంగారు పడితివి (42). ఆ శంకరుని నేను ఎరుంగుదును. అందరినీ రక్షించువాడు ఆయనయే. ఆయన పూజ్యులలోకెల్ల పూజ్యుడు. అను గ్రహ నిగ్రహములను చేయువాడు ఆయనమే (43). ఓ ప్రాణాప్రియురాలా! మొండి పట్లు పట్టకుము. దుఃఖమును వీడుము. ఓ పూజ్యురాలా! వెంటనే లెమ్ము. గొప్ప వ్రతము గలదానా! నీ కర్తవ్య కర్మను నీవు చేయదగుదువు (44)
ఇంతకు ముందు శంభుడు వికృతరూపమును ధరించి ద్వారము వద్దకు వచ్చి అనేక లీలలను చేసినాడు. ఆ లీలను నీకిపుడు నేను గుర్తు చేయుచున్నాను. (45). ఓ దేవీ! మనము అపుడు ఆయన యొక్క మహిమను చూచి, ఇద్దరము కన్యను ఇచ్చుటకు అంగీకరించి యుంటిమి. ఓ ప్రియురాలా! ఆ అంగీకారమును ప్రమాణముగా చేసుకొనుము.
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మునీ! ఇట్లు పలికి ఆ పర్వతేశ్వరుడు విరమించెను. పార్వతి తల్లియగు మేన ఆ మాటను విని హిమవంతునితో నిట్లనెను (47).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 148 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
🌻. మానవజన్మము - విశిష్టత -1 🌻*
*జీవరాశులన్నింటిలోను తనది ఉత్తమ జన్మ అని మానవుడు భావిస్తూ ఉంటాడు. కారణమేమంటే వృక్షములను, జంతువులను కూడ తన అదుపులో పెట్టుకొని తనకు అనుకూలమైన విధంగా ఉపయోగించుకొనే మేధాశక్తి తనకున్నది. దీని వలన అన్ని జీవరాశులను తన వశంలో పెట్టుకోగలడు మానవుడు. సనాతన ధర్మప్రవర్తకులైన ఋషులు మాత్రం మానవజన్మ అన్ని జీవులలోను దుర్లభమైనదని, అది చక్కని అవకాశమని చెప్పారు.*
*మొదట మానవజన్మ మనకెందుకు కలిగిందనే విషయాన్ని అవగతం చేసుకోవాలి. కేవలం అన్నపానీయాదులు స్వీకరించడం, నిద్రించడం, స్త్రీ పురుష సంయోగం ఇంత మాత్రమే అయితే జంతు జన్మకి మానవజన్మకి భేదమే లేదు. ఇన్ని లక్షల జీవరాశుల జన్మలు గడచి మానవ జన్మలోకి ప్రవేశించిన తరువాత తన జన్మకు ప్రత్యేక లక్ష్యమేది? దీనిని గుర్తించడం మానవుని మొదటి కర్తవ్యం.*
...✍️ *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 137 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 137. COUNTERFEIT 🍀*
*🕉 First one has to realize that one is carrying a counterfeit, a false coin. Of course, it makes you sad. You feel as if you have lost something — but you never had it in the first place. 🕉*
*People simply think they have compassion. Compassion is a very rare quality. Sympathy is possible, but compassion is a very high level thing. But when you come to feel that you don't have any compassion, now there will be a possibility of your having it. That is the trouble with false things: If your pocket is full of false coins and you think that you are rich, why worry? Once you come to know that you are a beggar and all coins are false, suddenly you become sad because all the money is lost. But now you can find out where and how one gets real money. Right now you cannot make the distinction between what is real and what is unreal.*
*Only when a very integrated consciousness arises, will you be able to make it. It is not that a few things are real in your life and a few things are unreal. In this state, when you are unaware, everything is unreal like a dream, but everything looks real. In another state, when you become awakened, become a Buddha, then everything is real; nothing is unreal. So it is not that a few things are real and a few unreal. If you are not aware, then everything is unreal. If you are aware, everything is real. But you will be able to know what was unreal only when you are awake, not before that.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 347 / Sri Lalitha Chaitanya Vijnanam - 347🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।*
*వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀*
*🌻 347. 'విమలా'🌻*
*మలములచే తాకబడనిది విమల అని అర్థము. శ్రీమాత మలములచే తాకబడనిది. ఆకలిదప్పులు ప్రధాన మగు మలములు. దరిద్రము మలము. అష్ట దరిద్రములు గలవు. అవి అన్నియూమలములే. కామక్రోధాది అరిషడ్వర్గములు మలములు. అతిక్రమించు కామము మలము. వికారమగు మనోభావములు మలములు. అధర్మము, అవినీతి మల భావములు. అధిక్రమించు రజస్సు, తమస్సులు (రజస్తమస్సులు) మలములు. మలముల మొత్తమును అవిద్య అందురు. కనుక అవిద్య మలము, మలములకు సమగ్ర నిర్వచనము. అజ్ఞానమే అవిద్య. అది కారణముగనే అహంకారము గట్టిపడును. అప్పుడు రజస్తమస్సులు సత్వము కన్న బలము కలవై వర్తించును. వానికి లోబడిన అహంకార పురుషుడు వికారమగు భావములు కలిగి అష్ట బంధములను సమకూర్చుకొనును. అష్ట కష్టములు పడును.*
*అట్టి నరుడు త్రికరణ శుద్ధిగ శ్రీమాతను ఆరాధింప ప్రారంభించినచో క్రమముగ అవిద్య తొలగును. విమలుడగును. త్రిగుణములకు లోనైన జీవు లందరూ కూడ అహంకారమను ఆవరణమున వసింతురు. అవిద్యకిది ప్రథమావరణము. త్రిగుణములకు ఆవల శుద్ధచైతన్య స్వరూపిణిగ శ్రీమాత యున్నది. ఈవల అహంకారులై జీవు లున్నారు. అహంకారావరణము దాటినచో జీవులు విమలత్వము చెందగలరు. అట్లు పొందుటకు శ్రీమాత అనుగ్రహమే ఉపాయము. అనుగ్రహమును పొందుటకు నిత్య చింతన, ఆరాధన జరుగవలెను. శ్రీమాత అనుగ్రహించినచో ఎట్టి వారైననూ విమలత్వమును పొందగలరు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 347 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala*
*Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻*
*🌻 347. Vimalā विमला (347) 🌻*
*She is devoid of impurities. Mala means impurities arising out of ignorance. When She is the embodiment of knowledge, there is no question of impurities arising out of ignorance. The same meaning is also conveyed in nāma 135. Vi (वि) as a prefix to a word conveys the opposite meaning of the word. For example, mala means impurities and vi-mala means devoid of impurities.*
*Interpretation for nāma 135 nirmalā is repeated here. Mala means dirt arising out of impure matter. She is without such dirt. In nāma (134) impurity arising out of mind was discussed and in nāma 135 impurities arising out of matter is being discussed. It is to be recalled that mind and matter is Śaktī. Mala is a sense of imperfection that leads to ignorance about the soul and hampers the free expression of the Supreme Self. This ignorance is caused by ego which is called āṇava-mala.*
*This nāma says that if one gets rid of attachments towards matter and by dissolving ego, knowledge is attained. Presence of mala causes avidyā (lack of knowledge) which leads to confusion, dirt and darkness. This darkness etc can be dispelled by meditating on Her, thereby acquiring knowledge.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment