మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 153


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 153 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ధ్రువము, ధ్రువుడు 🌻


ఉత్తర , దక్షిణ ధ్రువముల నుండి దూసికొని నిలబడు రేఖగా ధ్రువుడు నిలబడును. అతనికి దిగువగా సప్తర్షి మండలముండును. ధ్రువుడు ఒక ఆత్మప్రదక్షిణము చేయు బిందువును అధిష్ఠించినట్లూహింపగా ఆ ప్రదక్షిణ కాలము భూమిపై నున్న జీవులకు ఇరువదియారు వేల (26,000) సంవత్సరములుగా భాసించును. ఒక్కొక్క నక్షత్రమున వేయి సంవత్సరములు చొప్పున సంచారము చేసినట్లు భాసించును.

భూమి చుట్టును భూమధ్యరేఖ కెదురు ఆకాశమున గ్రహములు చరించు చక్రమున్నది. దానినే రాశిచక్రమందురు. దానిని ఇరువది యేడు సమభాగములు చేయగా నక్షత్ర చక్ర మేర్పడును. ఒక పరిభ్రమణము పూర్తి చేయుటకు అనగా ఇరువది ఏడవ నక్షత్రమున ప్రవేశించుటకు ఇరువది ఆరువేల సంవత్సరములు పట్టును.

ఈ మానములు భూమి తన ధ్రువము చుట్టును తిరుగుచుండుట వలన ఏర్పడుచున్నవి. ఈ పరిభ్రమణముకు నడుమ నిలబడు రేఖగా ధ్రువుడు స్థానము గొనును. అన్నియు పరిభ్రమించు చున్నను కేంద్రమగు ఈ రేఖ పరిభ్రమింపదు గనుక ధ్రువము లేక ధ్రువుడు అనబడును.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


21 Feb 2022

No comments:

Post a Comment