శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 351-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 351-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 351-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 351-1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀
🌻 351-1. 'వామకేశీ' 🌻
అందమైన కేశములు కలది శ్రీదేవి అని అర్థము. వామకులు అనగా ఒక జాతి శివభక్తులు. వారికి శివుడే ఈశుడు అగుటచే అమ్మ వామకేశి అని పేరు పొందినది. వామ కేశుని పత్ని వామకేశి. అమ్మ పేరున వామకేశి తంత్ర మొకటి కలదు. శివుడు అర్ధనారీశ్వర తత్త్వమున కుడి ఎడమలుగ శివ శక్తులుందురు. కుడి అనగా దక్షిణము. ఎడమ అనగా వామ. వామ భాగమంతయూ శ్రీదేవియే. దక్షిణ భాగమంతయూ దక్షిణామూర్తి యగు ఈశ్వరుడు. శిరస్సునందు కుడి భాగము శిరోజములు శివుడివి. ఎడమ భాగము శిరోజములు శ్రీమాతవి.
శ్రీమాత శిరోజములు అనుపమాన సౌందర్యము కలవి. శివుని శిరోజములు జటాజూటములు. అట్లే అమ్మ కన్ను వామాక్షి. ఆమె వామహస్త. వామ భాగ మదురుట స్త్రీలకు శుభము. దక్షిణ భాగ మదురుట పురుషులకు శుభము. వామతత్త్వము దక్షిణ తత్త్వమునకు ఉన్ముఖమే కాక ప్రతికూలము కూడ. ప్రతికూలత లేనిదే సృష్టి లేదు. శ్రీమాత శివుని కున్ముఖమై, ప్రతికూలమై నిలచి ద్వంద్వములతో సృష్టి నిర్మాణము చేయును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 351-1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala
Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻
🌻 351-1. Vāmakeśī वामकेशी 🌻
Wife of Vāmakeśvarā is Vāmakeśī. Śiva introduced twenty eight tantra-s (as per Śaivasiddhānta) to the universe and one among them is called Vāmakeśa tantra. This deals only with Her worship, hence She is called Vāmakeśī. Vāmakā means a man. Śiva is considered as the chief among men (īśvarā), hence He is known as Vāmakeśvarā (vāmaka + īśvarā). His wife is Vāmakeśī. It is like Bhairava and Bhairavi.
There are two nāma-s in Lalita Sahasranāma beginning with Vāmakeśa. The first one is this nāma, Vāmakeśī and the other one is nāma 945. Vāmakeśvarī. Vāma has innumerable meanings such as beautiful, splendid, Śiva, Durgā, Lakṣmī, Sarasvatī, a beautiful woman, wife, left side, etc. Keśa means hair. Then this nāma means that She has beautiful hair. But this interpretation does not align well with the preceding and succeeding nāma-s. Nāma 350 refers to Goddess Sarasvatī and nāma 352 could mean Durgā. If these interpretations are correct, then this nāma should refer to Goddess Lakṣmī, which seems to be appropriate.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
21 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment