2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 25-1 - 325 - పరమ పదము🌹
3) 🌹. శివ మహా పురాణము - 523 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -153🌹
5) 🌹 Osho Daily Meditations - 142 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 351-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 351-1 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 21, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. రుద్రనమక స్తోత్రం - 11 🍀*
*21. హిరణ్య బాహవే తుభ్యం సేనాన్యే తే నమోనమః!*
*దిశాంచ పతయే తుభ్యం పశూనాం పతయే నమః!!*
*22. త్విషీమతే నమస్తుభ్యం నమస్సస్పింజరాయతే!*
*నమః పథీనాం పతయే బభ్లుశాయ నమోనమః!!*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : వసతులు, సౌకర్యాలు జీవితానికి తగినంత ఉంటే సరిపోతుంది. కానీ, అవే జీవిత పరమార్థం కాకూడదు. 🍀*
*పండుగలు మరియు పర్వదినాలు : లేవు*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు,
మాఘ మాసం
తిథి: కృష్ణ పంచమి 19:58:51 వరకు
తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: చిత్ర 16:17:43 వరకు
తదుపరి స్వాతి
యోగం: దండ 13:06:56 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: కౌలవ 08:33:10 వరకు
సూర్యోదయం: 06:39:31
సూర్యాస్తమయం: 18:19:58
వైదిక సూర్యోదయం: 06:43:09
వైదిక సూర్యాస్తమయం: 18:16:20
చంద్రోదయం: 22:35:41
చంద్రాస్తమయం: 09:45:12
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: తుల
వర్జ్యం: 00:34:20 - 02:08:36
మరియు 21:43:26 - 23:16:42
దుర్ముహూర్తం: 12:53:05 - 13:39:47
మరియు 15:13:11 - 15:59:52
రాహు కాలం: 08:07:05 - 09:34:38
గుళిక కాలం: 13:57:18 - 15:24:51
యమ గండం: 11:02:11 - 12:29:45
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52
అమృత కాలం: 09:59:56 - 11:34:12
ముద్గర యోగం - కలహం 16:17:43
తదుపరి ఛత్ర యోగం - స్త్రీ లాభం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PANCHANGUM
#DAILYCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -325 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 25-1 📚*
*🍀 25-1. పరమపదము - అంతర్బహిః వ్యాప్తి చెంది యున్న శాశ్వతమగు తత్త్యమును నారాధించు వారు తత్త్వదర్శనులై, తత్ పదమును చేరుదురు. అదియే పరమపదము. ఈ పరమపదము లోకముల కతీతము. సమస్త జీవుల ఉనికికి మూలము. అందే అన్నీ ఇమిడి యుండి కాలక్రమమున బయల్వెడలి, వృద్ధి చెంది, తిరోగమించి మరల అందులోనికే లయ మగుచుండును. అట్టి పదము లోకములకు మూలమై యున్నది. సత్యలోకము, వైకుంఠము, కైలాసము అను లోకములకు కూడ పరమై యున్నది. అట్టి పరమును బ్రహ్మపరమని, పరమ పదమని తెలుపుదురు. 🍀*
*26. యాంతి దేవవ్రతా దేవాన్ పితన్ యాంతి పితృవ్రతాః |*
*భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోలి పి మామ్ ||*
*తాత్పర్యము : దేవతల నారాధించువారు దేవతాలోకములు చేరుదురు. పితృదేవతల నారాధించువారు పితృలోకము చేరుదురు. భూతప్రేతముల నారాధించువారు ఆ లోకములను చేరుదురు. నన్నారాధించు వారు నన్ను చేరుదురు.*
*వివరణము : భగవద్గీత యందు, అంతర్బహిః వ్యాప్తి చెంది యున్న శాశ్వతమగు తత్త్యమును, సమస్తమునకు మూలముగను ఆధారముగను తెలుపబడినది. దానిని “నేను” అను ప్రజ్ఞగ దైవము పలికినాడు. అట్టి తత్త్వము నారాధించువారు తత్త్వదర్శనులై, తత్ పదమును చేరుదురు. అదియే పరమపదము. అట్టి పదము లోకములకు మూలమై యున్నది. సత్యలోకము, వైకుంఠము, కైలాసము అను లోకములకు కూడ పరమై యున్నది. అట్టి పరమును బ్రహ్మపరమని, పరమ పదమని తెలుపుదురు. బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకములు కూడ అందుండి ఏర్పడునవే. అట్టి లోకమును నిత్యమనుభవించువారు బ్రహ్మర్షులు. త్రిమూర్తులు సహితము అట్టి బ్రహ్మర్షులను గౌరవింతురు, పూజింతురు కూడ.*
*ఈ పరమపదము లోకముల కతీతము. సమస్త జీవుల ఉనికికి మూలము. అందే అన్నీ ఇమిడియుండి కాలక్రమమున బయల్వెడలి, వృద్ధి చెంది, తిరోగమించి మరల అందులోనికే లయ మగుచుండును. ఈ పరమును చేరినవారు జనన మరణ చక్రమునకు అతీతమై శాశ్వతముగ యుందురు. వారికి కేవలమమరత్వమేగాక బ్రహ్మత్వము కూడ అందిన ఫలమై యుండును. అట్టివారు బ్రహ్మమై యుందురు. అగస్త్య వశిష్ఠు లట్టివారు. పై తెలిపిన పరమపదమును పొందుట కారాధించవలసినది తత్త్వమునే.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 523 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 44
*🌻. మేన యొక్క మంకు పట్టు - 9 🌻*
ఆయన రూపమును ఎవరు వర్ణించగలరు? వర్ణన యేల? ఎరింగిన వారెవ్వరు? నాకు గాని, బ్రహ్మకు గాని ఆయన యథార్థ స్వరూపము తెలియనే లేదు (94). బ్రహ్మ గారి నుండి గడ్డిపోచ వరకు ఈ జగత్తు అంతయూ శివ స్వరూపమేనని తెలుసుకొనుము. ఈ విషయములో నీవు సందేహించకుము (95).
ఆయన తన లీలచే ఇట్టి స్వరూపముతో అవతరించినాడు. పార్వతి చేసిన తపస్సు యొక్క మహిమచే నీ గుమ్మము వద్దకు వచ్చియున్నాడు. (96). ఓ హిమవంతుని పత్నీ ! కావున నీవు దుఃఖమును వీడి శివుని భజింపుము. నీకు మహానందము కలుగ గలదు. నీ దుఃఖము పూర్తిగా నశించగలదు (97).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ ! ఇట్లు విష్ణువు బోధ చేయగా ఆ మేనక యొక్క మనస్సు కొద్దిగా మెత్తపడెను (98). కాని ఆమె తన మొండి తనమును వీడలేదు. శివుని మాయచే విమోహితురాలైన ఆ మేన ఆ సమయములో పార్వతిని శివునకు ఇచ్చుటకు అంగీకరించలేదు (99).
హిమవత్పత్ని. పార్వతి తల్లి యగు ఆ మేన విష్ణువుయొక్క మధురమగు బోధను విని జ్ఞానమును పొందినదై విష్ణువుతో నిట్లనెను (100). అతడు సుందరాకారుడైనచో నేను కుమార్తెను ఇచ్చెదను. అట్లు కానిచో కోటి యత్నములు చేసిననూ నేను ఈయను. నేను సత్యము, దృఢము అగు వచనమును పలుకు చున్నాను (101).
బ్రహ్మ ఇట్లు పలికెను-
దృఢదీక్ష గల మేన శివుని ఇచ్ఛచే ప్రేరితురాలై ఇట్లు పలికి మిన్నకుండి ధన్యురాలయ్యెను. సర్వప్రాణులను ఆ శివచ్ఛయే మోహింపజేయును (102)
శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో మేనా ప్రబోధమనే నలుబది నాల్గవ అధ్యాయము ముగిసినది (44).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 153 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. ధ్రువము, ధ్రువుడు 🌻*
*ఉత్తర , దక్షిణ ధ్రువముల నుండి దూసికొని నిలబడు రేఖగా ధ్రువుడు నిలబడును. అతనికి దిగువగా సప్తర్షి మండలముండును. ధ్రువుడు ఒక ఆత్మప్రదక్షిణము చేయు బిందువును అధిష్ఠించినట్లూహింపగా ఆ ప్రదక్షిణ కాలము భూమిపై నున్న జీవులకు ఇరువదియారు వేల (26,000) సంవత్సరములుగా భాసించును. ఒక్కొక్క నక్షత్రమున వేయి సంవత్సరములు చొప్పున సంచారము చేసినట్లు భాసించును.*
*భూమి చుట్టును భూమధ్యరేఖ కెదురు ఆకాశమున గ్రహములు చరించు చక్రమున్నది. దానినే రాశిచక్రమందురు. దానిని ఇరువది యేడు సమభాగములు చేయగా నక్షత్ర చక్ర మేర్పడును. ఒక పరిభ్రమణము పూర్తి చేయుటకు అనగా ఇరువది ఏడవ నక్షత్రమున ప్రవేశించుటకు ఇరువది ఆరువేల సంవత్సరములు పట్టును.*
*ఈ మానములు భూమి తన ధ్రువము చుట్టును తిరుగుచుండుట వలన ఏర్పడుచున్నవి. ఈ పరిభ్రమణముకు నడుమ నిలబడు రేఖగా ధ్రువుడు స్థానము గొనును. అన్నియు పరిభ్రమించు చున్నను కేంద్రమగు ఈ రేఖ పరిభ్రమింపదు గనుక *ధ్రువము లేక ధ్రువుడు* అనబడును.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 142 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 142. THE TWO DOORS 🍀*
*🕉 It is not a question of choosing between truth and illusion, because all doors that are outside you lead to illusion.🕉*
*The truth is within you. It is in the very heart of the seeker. So if on one door is written "illusion" and on another is written "truth," don't bother to choose between them. Both are illusory. You are truth. Truth is your very consciousness. Become more alert and more conscious. It is not a question of choosing between doors. The darkness is there because you are unconscious, so no light from the outside can help. I can give you a lamp right now, but it won't help. By the time you have reached your room, it will be out.*
*You have to become more conscious, more and more conscious
and alert, so your inner flame, only that, will enlighten your surroundings. In that light you will see that all doors have disappeared. The door that was illusion and the door that was truth both have disappeared. They were both in conspiracy. In fact, they both lead to the same place. They just give you an illusion of choice. So no matter what you choose, you always choose the same thing. They both lead to the same passage. Eventually you end up in illusion. So that is not the problem. The problem is how to become more alert.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 351-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 351-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।*
*వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀*
*🌻 351-1. 'వామకేశీ' 🌻*
*అందమైన కేశములు కలది శ్రీదేవి అని అర్థము. వామకులు అనగా ఒక జాతి శివభక్తులు. వారికి శివుడే ఈశుడు అగుటచే అమ్మ వామకేశి అని పేరు పొందినది. వామ కేశుని పత్ని వామకేశి. అమ్మ పేరున వామకేశి తంత్ర మొకటి కలదు. శివుడు అర్ధనారీశ్వర తత్త్వమున కుడి ఎడమలుగ శివ శక్తులుందురు. కుడి అనగా దక్షిణము. ఎడమ అనగా వామ. వామ భాగమంతయూ శ్రీదేవియే. దక్షిణ భాగమంతయూ దక్షిణామూర్తి యగు ఈశ్వరుడు. శిరస్సునందు కుడి భాగము శిరోజములు శివుడివి. ఎడమ భాగము శిరోజములు శ్రీమాతవి.*
*శ్రీమాత శిరోజములు అనుపమాన సౌందర్యము కలవి. శివుని శిరోజములు జటాజూటములు. అట్లే అమ్మ కన్ను వామాక్షి. ఆమె వామహస్త. వామ భాగ మదురుట స్త్రీలకు శుభము. దక్షిణ భాగ మదురుట పురుషులకు శుభము. వామతత్త్వము దక్షిణ తత్త్వమునకు ఉన్ముఖమే కాక ప్రతికూలము కూడ. ప్రతికూలత లేనిదే సృష్టి లేదు. శ్రీమాత శివుని కున్ముఖమై, ప్రతికూలమై నిలచి ద్వంద్వములతో సృష్టి నిర్మాణము చేయును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 351-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala*
*Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻*
*🌻 351-1. Vāmakeśī वामकेशी 🌻*
*Wife of Vāmakeśvarā is Vāmakeśī. Śiva introduced twenty eight tantra-s (as per Śaivasiddhānta) to the universe and one among them is called Vāmakeśa tantra. This deals only with Her worship, hence She is called Vāmakeśī. Vāmakā means a man. Śiva is considered as the chief among men (īśvarā), hence He is known as Vāmakeśvarā (vāmaka + īśvarā). His wife is Vāmakeśī. It is like Bhairava and Bhairavi.*
*There are two nāma-s in Lalita Sahasranāma beginning with Vāmakeśa. The first one is this nāma, Vāmakeśī and the other one is nāma 945. Vāmakeśvarī. Vāma has innumerable meanings such as beautiful, splendid, Śiva, Durgā, Lakṣmī, Sarasvatī, a beautiful woman, wife, left side, etc. Keśa means hair. Then this nāma means that She has beautiful hair. But this interpretation does not align well with the preceding and succeeding nāma-s. Nāma 350 refers to Goddess Sarasvatī and nāma 352 could mean Durgā. If these interpretations are correct, then this nāma should refer to Goddess Lakṣmī, which seems to be appropriate.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment